జనసైనికులకు (Janasainiks), మెగా అభిమానులకు (Mega Fans) శింగలూరి శాంతి ప్రసాద్ (Singaluru Shanti Prasad) ఇస్తున్న “శాంతి సందేశం” ఆలోచనలు రేకెత్తించేదిగా ఉన్నది. ప్రత్యర్థి వర్గాలకు లేదా పార్టీలకు చెందిన కొంతమంది వ్యక్తులు మెగా సోదరులపై (Mega Brothers) దిగజారి విమర్శలు చేస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్నాయి. అయితే వీటికి కలత చెంది అంతే ఆవేశంతో స్పందిస్తున్న మెగా అభిమానులను జనసైనికులను కూడా చూస్తున్నాం.
ఆవేశంతో, ఆవేదనతో కలత చెందుతూ స్పందిస్తున్న మెగా అభిమానులకు, జనసైనికులకు శింగలూరి శాంతి ప్రసాద్, జనసేన లీగల్ సెల్, ఇస్తున్న శాంతి సందేశం ఆలోచనలు రేకెత్తించేదిగా ఉన్నది. మెగా అభిమానులు, జనసైనికుల్లో సహనం పెరగాలి అనే ఉద్దేశంతో ఇస్తున్న శాంతి సందేశము యధాతధంగా వారి మాటల్లోనే…
శింగలూరి శాంతి ప్రసాద్ శాంతి సందేశం
“మీ అందరికీ ఒక చిన్న మాట చెప్పదలుచు కున్నాను. అప్పట్లో నేను ప్రజారాజ్యం పార్టీ (Praja Rajyam) లీగల్ సెల్ (Legal Cell) తరపున పని చేసే వాడిని. నేను కూడా మీకన్నా అత్యథికంగా అవేశంతో ఉండేవాడిని. అదే అవేశంతో ఒకరోజు చిరంజీవి గారిని నేను ప్రశ్నించటం జరిగింది, ఎందుకు మీరు ప్రత్యర్ధులు చేసే విమర్శలు పైన స్పందించటం లేదు, క్యాడరు నిరుత్సాహపడుతున్నారు అని.
దానికి అయన చెప్పిన సమాధానం, నా జీవిత గమనాన్ని, విథానాలను పూర్తిగా మార్చి వేసింది. అయన చెప్పిన మాట
” ప్రసాదు, అటువంటి విమర్శలకు నేను సమాధానం చెప్పాలి అని మీరు భావించటంలో తప్పు కాదు. కానీ మిమ్మల్ని తృప్తి పరచటం కోసం, నాతో ఏమాత్రం సమానం కానీ వాడి విమర్శకు నేను ప్రెస్ మీట్ పెట్టి సమాధానం చెబుతాను. దానితో నేను వాడి స్థాయికి దిగజారటమో, లేదా నా స్థాయికి తగని వాడిని, నా స్థాయిలోకి తీసుకురావటం జరుగుతుంది. ఇక దానిని అడ్వాంటేజీ తీసుకోని, వాడు తెల్లవారే మరలా విమర్శలు మొదలు పెడతాడు. అప్పుడు మరలా క్యాడరు నిరుత్సాహపడతారని, మరలా నేను సమాధానం చెప్పాలి. ఇక వాడు ఇదే పనిలో ఉంటాడు, నా సమయం అంతా వాడు రేపు ఏమి చెబుతాడు అనేది మాత్రమే నా ప్రయారిటీ అవుతుంది. ఇది నేను చేయను. నాకు చాలా తక్కువ సమయం ఉన్నది. పెట్టుకున్న గమ్యాలు చాలా ఉన్నాయి. నేను ప్రవహించే నీరు లాంటి వాడిని. అలా ప్రవహిస్తూ దారిలో ఉన్న వారి అవసరాలు తీరుస్తూ ప్రవహిస్తూనే ఉంటాను గమ్యం వైపు నిరంతరంగా. ఒకొక్క సారి లోయ రావచ్చు, లేదా పెద్ద పర్వతం లోంటి అడ్డం రావచ్చు.
అటువంటప్పుడు నా ప్రవాహం అగినట్లుగా పైకి కనిపిస్తుంది. కానీ నాలో ఉన్న నిరంతర తపన వలన, నేను సదరు లోయను నింపి, లేదా పర్వతాన్ని ఢీకోని మరలా గమ్యం ఏర్పాటుచేసుకోని, నా ప్రవాహం కొనసాగిస్తునే ఉంటాను. నా దృష్టి ఎప్పుడూ అర్జునుడికి పక్షి కన్ను పైన గురి లాగ, నా దృష్టి ఎప్పుడూ గమ్యం వైపు మాత్రమే ఉంటుంది. అటువంటప్పుడు ఎవరైనా పనికిమాలిన వారు, నా స్థాయికి తగని వారు నన్ను దృష్టి మరల్చటానికి ప్రయత్నాలు చేసినా, నేను ఏమాత్రం చలించను.
ఒకసారి నేను గమ్యం చేరిన తరువాత కూడా, వారు అలాగే ఉంటే, అప్పుడు మాత్రమే స్పందించటం చేస్తాను. కాకపోతే నా గమ్యమే ఎక్కువ సార్లు మాట్లాడటం వలన, సదరు వ్యక్తులు పక్కకి పోతుంటారు. వారికి వారే వేథవలు అవుతుంటారు. కోపం వలన మనిషి ఏమీ సాథించలేడు. కోపం అనే శక్తి ని సక్రమంగా వాడు. అది నీకు బలం అవుతుంది. కోపం నీ బలహీనత కాకూడదు.”
ఆచరణలో పెడితే?
నిజంగా దీనిని నేను కూడా అచరించాను. జీవితంలో చాలా కోత్తదనం వచ్చింది. నాకున్న స్థాయి పెరిగింది. గుర్తింపు పెరిగింది. అదే ఈరోజు నన్ను అందరూ గౌరవించేలా చేసింది. కాబట్టి చిరంజీవి గారు ఎప్పుడూ దేనికీ స్పందించటం చేయరు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాదాపుగా అదే తీరులో పయనిస్తూన్నారు. కాకపోతే అతి జరిగితే మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా స్పందించటం, సమాథానం చెప్పటం ఖచ్చితంగా చేస్తారు. అది కూడా ఎదుటి వారిని కంట్రోల్ చేయటానికి తప్పితే, దాడి చేయటం కోసం కాదు. కాబట్టి జనసైనికులు దీనిని గమనించండి.
మనకు చాలా పనులు ఉన్నాయి. పార్టీని ప్రజలలోకి తీసుకోని వెళ్ళటం, మన సిథ్థాంతాలు ప్రచారం చేసి, వారిని మెప్పించటం చేయాలి, తద్వారా ఓటుబ్యాంకు ఏర్పాటు చేసుకోని, అథికారం వైపు సాగి, సమాజంలో మార్పుకి శ్రీకారం చుట్టాలి. అంతటి ఘనకార్యం ముందు పెట్టుకోని, పిల్లచెష్టలకు, పిచ్చి చేష్టలు చేసేవారి ట్రాప్ లో పడదామా? లేక పవన్ కళ్యాణ్ గారు చెబుతున్న గమ్యం వైపు పయనం చెద్దామా?
ఒక్క సారి గమ్యం చేరితే, ఇటువంటి నోర్లు అటోమాటిగ్గా మూత పడతాయి. ప్రత్యేకంగా మీరు ఏమీ చేయకుండానే. ఏవరో పనికిమాలినవారు , అతి ప్రతివ్రతలు సోషల్ మీడియాలో పిచ్చి పిచ్చి పోస్టులు పెడుతున్నారు అనే అవేశంతో వారికి సమాధానం చెప్పాలని, వారిని పెద్దవారిని చేయటమా, లేక వారిని వదిలేస్తే, వారంతటవారే పక్కకు వెళ్ళిలా చేయటమా? అలోచన చేయండి…
(ఇది శాంతి శింగలూరి శాంతి ప్రసాద్ గారి వ్యక్తిగత సంభాషణగా భావించగలరు)