Pawan with NadendlaPawan with Nadendla

1983 లో కాంగ్రెస్’ని ఓడించి ఎన్టీఆర్’ని గెలిపిస్తే మార్పు (Change in Power) సాధించినట్లే అనే నాడు భావించారు గాని అణగారినవర్గాల (Suppressed classes) అధికారం కోసం అవసరమైన పునాదులు గురించి నాడు ఎవ్వరూ ఆలోచించలేదు.

1989 లో కూడా టీడీపీ’ని ఓడించి కాంగ్రెస్’ని గెలిపిస్తే మార్పు సాధించినట్లే అనే భావించారు గాని అణగారినవర్గాల అధికారం కోసం అవసరమైన పునాదులను కాంగ్రెస్-టీడీపీ కలిసి తవ్వేస్తున్నారేమో అని నాడు ఎవ్వరూ ఆలోచించలేదు.

1994 లో కాంగ్రెస్’ని ఓడించి ఎన్టీఆర్’ని గెలిపిస్తే మార్పు సాధించినట్లే అనే భావించారు గాని అణగారినవర్గాలు పల్లకీ మోత (Pallake motha) గురించి నాడు ఎవ్వరూ ఆలోచించలేదు. వీడి మీద కోపంతో వాడిని గెలిపించడం. వాడిమీద కోపంతో వీడిని గెలిపించడమేనా మార్పు అంటే అని ఈ కుల నాయకులు, ఉద్యమ నాయకులు, కుల సంఘాలు నాడు భావించలేదు.

1999 లో బాబు-రాజన్న వర్గాల విష వలయంలో అణగారిన వర్గాలు తమ నిర్ణయాన్ని ప్రభావితం చేయలేక పోయారు? అంతే గాని రాజ్యాధికారంలో (Rajyadhikaram) మార్పు కోసం అణగారిన వర్గాలు ఏమి కోల్పోతున్నాయి అని ఈ కుల నాయకలు తెలిసికోలేక పోయారు. ప్రజలు కూడా కునాయకుల మోసాన్ని అర్ధం చేసికోలేక పోయారు.

2004లో టీడీపీని ఓడించి వైస్సార్’ని గెలిపిస్తే మార్పు సాధించినట్లే అనే భావించారు గాని అణగారినవర్గాల కోసం అవసరమైన అధికారం కోసం ఈ కుల నాయకులు ఆలోచించలేదు. వాడిమీద కోపంతో వీడిని అలానే వీడిమీద కోపంతో వాడిని గెలిపించడమేనా మార్పు అంటే అని మన ఈ కుల నాయకులు, ఉద్యమ నాయకులు, కుల సంఘాలు భావించడం మొదలు పెట్టలేదు.

బిక్షగాళ్లగా చేస్తున్న సంక్షేమ పథకాలు

2009లో మార్పు అంటే బిక్షగాళ్లగా చేస్తున్న సంక్షేమ పథకాలే అనుకొన్నారు గాని అణగారిన వర్గాల కోసం అవసరమైన అధికారం కోసం ఈ కుల నాయకులు గని అణగారిన వర్గాలు గాని ఆలోచించలేదు. వాడిమీద కోపంతో వీడిని అలానే వీడిమీద కోపంతో వాడిని గెలిపించడమేనా మార్పు అంటే అని మన ఈ కుల నాయకులు, ఉద్యమ నాయకులు, కుల సంఘాలు నాడు భావించలేదు.

2014లో టీడీపీని ఓడించి ఉంటే అణగారిన వర్గాలకు అవసరమైన మార్పుకు అవసరమైన పునాదులు ఏర్పడి ఉండేవి. కానీ వారిని ఓడించి టీడీపీని గెలిపించారు తప్ప అణగారినవర్గాల కోసం అవసరమైన అధికారం కోసం మన కుల నాయకులు ఆలోచించలేదు. ఇందులో జనసేన కూడా ఆలోచించలేక పోవడం జరిగింది.

2019లో కూడా వారిని ఓడించి వీరిని గెలిపిస్తే మార్పు వస్తుంది అనుకొన్నారు గాని బానిసత్వంలో అణగారిన వర్గాలు ఎలా మగ్గిపోతున్నారు అని కుల నాయకులు ఇప్పటికీ తెలిసికోలేక పోయారు. ప్రజలు మిమ్ములను కూడా నమ్మలేక పోయారు. టీడీపీని ఓడించి వైసీపీని గెలిపిస్తే మార్పు కాదు అని నేటికీ తెలిసికోలేక పోతున్నారు. జనసేన కూడా ప్రజలకు గట్టిగా చెప్పలేక పోతున్నది.

2024 లో అయినా జనసేన పార్టీ సరి అయిన నిర్ణయం తీసికోవాలి. అధికారంలో మార్పు అంటే ఒక ఆధిపత్య వర్గాన్ని ఓడించి మరొక ఆధిపత్య వర్గాన్ని గెలిపించడం కాదు. ఆ ఇద్దరిని ఓడించి జనసేనని గెలిపిస్తేనే అధికారంలో మార్పు అని జనసేన పార్టీ నిరూపించాలి. అణగారిన వర్గాలను మోసం చేస్తూ వస్తున్న ఈ కుల సంఘాలకు, కుల నాయకులకు, ఉద్యమ నాయకులకు మీరు రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి.

అధికారంలో మార్పు కోసం కొన్ని వర్గాల మద్దతు తీసికోవడం తప్పు లేదు.  టీడీపీతో సహా అన్ని వర్గాల మద్దతు మీరు మతీసికోవడం తప్పు లేదు. కానీ టీడీపీ కి మద్దతు నిస్తూ పోతుంటే మార్పు మంటల్లో మాడి పోతుంది. టీడీపీకి మరల జనసేన మద్దతు నివ్వడం జరిగితే గత చరిత్ర పునరావృతం అవుతున్నది అని ప్రజలు భావిస్తారేమో? ఒక్క సారి ఆలోచించండి.

పవనేశ్వరుడు అంటే ఆ సర్వేశ్వరుడులా బోలా శంకరుడు అనుకొనే మీ అభిమానులు భయాలను మీరు నివృత్తి చేయాలి. మార్పు కోసం మీ వైఖిరి మరింత స్పష్టంగా ఉండాలి. పచ్చ నీలి పార్టీల కుట్రలకు పవనేశ్వరుడు తగిన గుణ పాఠం చెప్పాలి. గాలి బాలి కాకూడదు అని మార్పు కోరుకొనే ప్రజలు కోరుకొంటున్నారు.

ఆలోచించండి… అధికారంలో మార్పు అంటే టీడీపీని ఓడించి వైసీపీని గెలిపించడం లేదా వైసీపీని ఓడించి టీడీపీని గెలిపించడం కాదు అని గ్రహించండి (It’s from Akshara Satyam)

మహిళల జీవనోపాధికి చేయూత మహిళా మార్ట్: జిల్లా కలెక్టర్