కులసంఘాలపై తీవ్ర వత్తిడితో ప్రతిఘటన మొదలు
పేర్ని నానికి బలిజనాడు బహిరంగ లేఖ
సీఎంకి కాపునాడు బహిరంగ లేఖ
ప్రతిఘటన దిశగా మరికొన్ని సంఘాలు!
మొఖం చెల్లడం లేదంటూ వాపోతున్న కొందరు నాయకులు?
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి (Andhra Pradesh Government) భీమ్లా నాయక్ (Bheemla Nayak) సినిమాకి జరుగుతున్న పోరు రోజు రోజుకి రాజకీయ రంగు పులుముకొంటున్నది. అధికారం దక్కని కొన్ని వర్గాలపై జగన్ ప్రభుత్వం (Jagan Government) కక్ష పూరిత వైఖిరి అనుసరిస్తున్నది అని ఆయా వర్గాలు భావిస్తున్నాయి. సోషల్ మీడియా (Social Media) ప్రభావంతో తమలో తామే ప్రశ్నించుకొంటూ మదనపడుతున్నారు.
అధికారం దక్కని ఒక మెజారిటీ సామజిక వర్గంపై ప్రభుత్వ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సినిమాపై అణచివేతలు మొదలు పెట్టారు అని మెజారిటీ వర్గ ప్రజలు భావిస్తున్నారు. వివిధ కుల సంఘాలు (Kula sangalu) కూడా ఈ విధంగానే భావిస్తున్నట్లు తెలుస్తున్నది. కొన్ని కుల సంఘాలు వేచి చూద్దాం అనే వైఖిరితో ఉన్నాయి. మరి కొన్ని కుల సంఘాలు బహిరంగంగా లేఖలు కూడా రాస్తున్నాయి.
ఆయా సామజిక వర్గాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు (Elected members) అయితే మొఖం చెల్లడం లేదు అంటూ వాపోతున్నట్లు తెలుస్తున్నది. ఇలా అయితే వచ్చే ఎన్నికల్లో ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అని మిగిలిన వర్గాల నుండి ఎన్నికైన ప్రజా ప్రతినిధులు కూడా మదనపడుతున్నట్లు అనిపిస్తున్నది.
రాష్ట్ర కాపునాడు అధ్యక్షులు గంగ సురేష్ బండారు
రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి రాసిన లేఖ సారాంశం:
“ముఖ్యమంత్రివర్యా! మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు కాపు (Kapu) కులంపై ద్వేష భావంతో మెలుగుతుంది అనిపిస్తున్నది. ఎన్నికల ముందు కాపుల సంక్షేమం కోసం (welfare of Kapu) 10 వేల కోట్ల వెచ్చిస్తామని వాగ్ధానం చేసిన మీరు, ఏవేవో కాకిలెక్కలు చెబుతూ కాపు జాతిని (Kapu jathi) మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. చేస్తునే ఉన్నారు.
అధికార దర్పంతో కాపు ప్రముఖులపై (Legends in Kapu) ప్రత్యక్ష, పరోక్ష దాడులు సైతం చేస్తున్నారు. మీ ప్రభుత్వ వైఖరి కాపులతో మాకు ఏ అవసరం లేదన్నట్లుంది. ఎవరు ఔనన్నా, కాదన్నా మీ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలో కాపుల పాత్ర ప్రధానమైందిని మేము మరోసారి గుర్తు చేస్తున్నాం. గత పార్టీలు అనుసరించిన విధానాలను, తిరిగి మళ్లీ మీరు కాపులపై ప్రదర్శిస్తున్న తీరు కడు సోచనీయమైనది.
కాపు జాతిని (Kapu Jathi) అణిచివేయాలనే లక్ష్యంతో మీ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణులే మీకు రాబోయే రోజుల్లో శాపంగా మారుతోంది అని తెలియచేస్తున్నాం.
మీ వైఖరి కూడా గత పార్టీ ల పద్దతిలోనే సాగుతుంది. ఇలాగే కొనసాగితే మిమ్మల్ని కూడా ఇంటికి సాగనంపడానికి కాపులు వెనుకాడరని తెలియజేస్తున్నాం.
అదే విధంగా మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినీ పరిశ్రమ పెద్దగా, పరిశ్రమ సమస్యలపై మీతో చర్చలు జరిపారు. మీరు సానుకూలంగా స్పందిస్తానని తెలిపి, మాట దాట వేశారు. సినీ పెద్దగా వచ్చిన చిరంజీవికి విలువను ఇవ్వకుండా చేసిన వైనాన్ని యావత్ కాపుజాతికి జరిగిన అవమానం గా భావిస్తున్నాం.
అంతే కాకుండా బాలకృష్ణ అఖండ (Akhanda) సినిమా రిలీజ్ సమయంలో మీరు స్పందించిన తీరు, నేడు భీమ్లానాయక్ సినిమాపై మీరు ప్రవర్తించిన తీరు కాపుజాతి మొత్తం గమనిస్తూనే ఉంది. ఇటువంటివి అన్నీ చూస్తుంటే పాలక కులాలు అన్నీ ఒక్కటే అనే భావన మా అణగారిన వర్గాల్లో రేకెత్తిస్తున్నాయి. మీ ప్రభుత్వంలో మంత్రి అయిన పేర్ని నాని మీడియా సమావేశంలో (Press meet) తెలిపినా విషయాలను బట్టి మేము చెప్పాల్సి వస్తున్నది” అంటూ రాష్ట్ర కాపునాడు (Rastra Kapunadu) బహిరంగ లేఖ రాసింది.
ప్రభుత్వ వైఖిరిని నిరశిస్తూ బలిజనాడు బహిరంగ లేఖ:
ఏపీ బలిజనాడు (AP Balijanadu) వ్యవస్థాపక అధ్యక్షులు, మల్లెపూల మధు రాయలు, రాష్ట్ర మంత్రి పేర్ని నానికి రాసిన బహిరంగ భహిరంగ లేఖ సారాంశం యధాతధంగా:
“ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మొదలు బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, కులంపై ద్వేషభావంతో మెలగుతుంది.
ఎన్నికల ముందు కాపుల సంక్షేమం కోసం (welfare of kapu) 10వేల కోట్ల వెచ్చిస్తామని వాగ్ధానం చేశారు. కానీ నేడు ఏవేవో కాకి లెక్కలు చెబుతూ ఈ వర్గాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు బలిజ, కాపు, తెలగ, ఒంటరి, మున్నూరు కాపు, తూర్పు కాపు, ప్రముఖులపై ప్రత్యక్ష, పరోక్ష దాడులు సైతం చేస్తున్నారు.
మీ ప్రభుత్వ వైఖరి కాపులతో మాకు ఏ అవసరం లేదన్నట్లుంది. ఎవరు ఔనన్నా, కాదన్నా మీ ప్రభుత్వానికి గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలో కాపుల పాత్ర ప్రధాన మైనది.
గత తెలుగుదేశం పార్టీ (Telududesam Party) కాపులపై అనుసరించిన విధానాలు, అణిచివేత, నిర్లక్ష్య ధోరణులే మీ వైసీపీ పార్టీ గెలుపుకి కారణం అయ్యింది. అయితే నేటి మీ వైఖరి కూడా టీడీపీ పద్దతిలోనే సాగుతున్నది అన్నట్లుగా ఉన్నది.
మీ విధానాలు ఇలానే కొనసాగితే, మిమ్మల్ని కూడా ఇంటికి సాగనంపడానికి కాపులు వెనుకాడరని తెలియజేస్తున్నాం.
మెగాస్టార్ చిరంజీవి మీ ప్రభుత్వ విధానాలను సమర్ధిస్తూ వస్తున్నారు. సినీ పరిశ్రమ (Film Industry) పెద్దగా పరిశ్రమ సమస్యలపై మీ సమక్షంలోనే ముఖ్యమంత్రితో చర్చలు జరిపారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని మీరే చెప్పారు.
అలాంటి పరిస్ధితుల్లో మీరు మీడియా ముందు తెలిపిన బాలకృష్ణ అఖండ సినిమా గురించిన వివరాలు బలిజ (Balija), కాపు (Kapu), తెలగ (Telaga), ఒంటరి (Ontari), మున్నూరు కాపు (Munnuru Kapu), తూర్పు కాపు (Turpu Kapu), జాతిలో పాలక కులాలు ఒక్కటే అనే భావన రేకెత్తిస్తున్నాయి.
ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యే, అందునా మాజీ సీఎం చంద్రబాబు (Chandra Babu) బావమరిది సినిమాకు మీరందించిన “లోపాయికారి వెసులబాటు” ను మీరు బయటపెట్టడం కాపుజాతిలో ఆగ్రహం పెంచుతుంది.
మీడియాలో మీరు బయటపెట్టిన విషయాలను పరిశీలిస్తే… కాపులు దైవంగా భావించే మెగాస్టార్ చిరంజీవిని అవమానపరిచినట్లుగా భావిస్తున్నాం.
మీ వైఖరిని ఖండిస్తున్నాం
గతంలో మీ పార్టీలోని కాపు నాయకులైన అంబటి రాంబాబు (Ambati Rambabu), మంత్రి వర్యులు అవంతి శ్రీనివాసరావులపై ప్రత్యర్ధులు చేసిన దుష్ప్రచారాన్ని బలిజనాడు (Balijanadu) ఖండించిందని గుర్తు చేస్తున్నాం, కానీ కాపులైన మీరు మీ స్వామి కార్యంలో మునిగిపోయి స్వకులానికి చెందిన వారిపై మీ వైఖరిని ఖండిస్తున్నాం.
గతంలో మీ పార్టీలోని కాపు నాయకులైన అంబటి రాంబాబు, మంత్రివర్యులు శ్రీ అవంతి శ్రీనివాసరావులపై ప్రత్యర్ధులు చేసిన దుష్ప్రచారాన్ని కాపునాడు (Kapunadu) ఖండించిందని గుర్తుచేస్తున్నాం, అధికార పార్టీకి ఊడిగం చేసే కాపు ప్రజాప్రతినిధులు (Kapu elected members) కూడా మా జాతికి అవసరం లేదు. భీమ్లానాయక్ సినిమా పట్ల మీ వైఖరిని కూడా కాపునాడు తీవ్రంగా ఖండిస్తుంది. కాపుల పట్ల మీ వైఖరి మారకుంటే కాపుల శక్తి ఏమిటో మరికొన్ని రోజుల్లోనే ప్రత్యక్షంగా చూడబోతున్నారని తెలియచేస్తున్నాము.
భీమ్లానాయక్ సినిమా పట్ల మీ వైఖరిని కూడా బలిజనాడు తీవ్రంగా ఖండిస్తున్నది.
కాపుల పట్ల మీ వైఖరి మారకుంటే మా ఈ కాపుల శక్తి ఏమిటో రాబోయే ఎన్నికల్లో చూపిస్తామని తెలియజేస్తున్నాం” అంటూ బలిజనాడు తన బహిరంగ లేఖలో పేర్కొంది.
జగన్ రెడ్డికి (Jagan Reddy) కాపులంటే ఎందుకంత కక్ష? కాపులకు రిజర్వేషన్లు (Kapu Reservations) నిలిపివేసినట్లు పవన్ సినిమాను నిలిపేస్తారా? రాష్ట్రంలో ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకే ఎందుకు? అంటూ తెలుగుదేశం ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్ (Anagani Satya Prasad) ఒక ప్రకటన విడుదల చేసినట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
జగన్ కింకర్తవ్యం?
జగన్ ప్రభుత్వం (Jagan Government) దీనిపై పునరాలోచించాలి. అణగారిన వర్గాల్లో (Suppressed classes) వస్తున్న అసంతృప్తిపై, వివిధ కులసంఘాల నుండి వస్తున్న లేఖలపై వాస్తవాలు తెలుసుకోవాలి. నిజనిజాలపై విశ్లేషణ జరగాలి. అణగారిన వర్గాల్లో మెజారిటీ వర్గమైన కాపుల్లో ఉన్న అసంతృప్తి (Dissatisfaction in Kapu) నిజమే అని భావిస్తే తగు ఉపశమన చర్యలు తీసికోవాలి. తప్పు ఒప్పులు ఉంటే సరిదిద్దుకోవాలి. లేకపోతే భాదిత వర్గాల్లో రేగుతున్న ఈ అసంతృప్తి పెరిగి పెరిగి… ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా మారుతుంది. ఇది జనసేనకు (Janasena) లాభిస్తోంది అని చెప్పక తప్పదు.