ఈ నెల 9న ఏలూరులో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆధ్వర్యంలో జనసేన వారాహి యాత్ర (Janasena Varahi Vijaya Yatra) రెండో దశ ఏలూరు నుండి ప్రారంభం కానున్నది. గత నెల 14న అన్నవరంలో ప్రారంభమై అశేష జనావళి జేజేలు అందుకున్న వారాహి విజయ యాత్ర రెండో దశ ఏలూరు నుంచి ప్రారంభించడానికి పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆమోదం తెలిపారు.
ఆయన ఈ రోజు సాయంత్రం మంగళగిరి పార్టీ కార్యాలయంలో రెండో దశ యాత్రకు సంబంధించిన ప్రణాళికపై పార్టీ రాజకీయ వ్యవహారాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో సుదీర్ఘంగా చర్చించారు. 9వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఏలూరులో తలపెట్టిన బహిరంగ సభతో యాత్ర ప్రారంభం అవుతుంది.
ఏలూరుతోపాటు దెందులూరు, తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల నాయకులను కలసి స్థానిక రాజకీయ పరిస్థితులపై మాట్లాడతారు.