Janasena Yuva ShakthiJanasena Yuva Shakthi

ఆంధ్ర ప్రదేశ్ యువత (AP Youth) ఆలోచనలను, ఆవేదనను జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) రణస్థలంలో (Ranasthalam) గట్టిగా వినిపించ నున్నారు. చాలా ప్రతిష్టాత్మకంగా రాష్ట్రంలో ఉన్న యువత భావాలను బలంగా తెలియ చేయటం కోసం, మార్పు దిశగా సమాజం కదలాలని కృషి చేస్తూన్నారు. ఇది నిజంగా రాష్ట్రంలో ఒక విప్లవాత్మకమైన, చారిత్రాత్మక మలుపుకి శ్రీకారం చుట్టే ఘటన అని చెప్పాలి.

అందుకే రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చటానికి ప్రత్యర్థి పార్టీ వారు ఒక పంది తోనో, ఒక గుడిసేటోడి తోనో, ఒక అంబోతు తోనోపవన్ కళ్యాణ్ పైన కానీ, మెగా కుటుంబ సభ్యుల పైన కానీ కావాలని రెచ్చగొట్టే మాటలు మాట్లాడతారు.

దానితో ఈ నికృష్టమైన వాఖ్యలపైన జనసైనికులు పూర్తిగా సమాధానం చెప్పటం మీద దృష్టి పెడతారు. అప్పుడు తమ నీలి, కూలి మీడియాల ద్వారా రోజుల తరబడి వీటి పైన డిబెట్లు పెట్టి, యువశక్తి (Janasena Yuva Shakthi) కార్యక్రమం నుంచి దృష్టి మరలేలా చేస్తారు. ఈలోపు అవసరమైతే చంద్రబాబుని కూడా కెలకడం ద్వారా, పచ్చ మీడియా కూడా ఇటువంటి వాటిపైన చర్చలు జరిగేలా చూస్తారు.

ఇదంతా పీసీపీ పార్టీ వేసిన స్కెచ్ లో భాగమే. అతని కనుసైగ చేయగానే, ఈ రాజకీయ నాయకులూ వచ్చి మాట్లాడుతారు. వాటి పైన దృష్టి పెట్టి, ప్రధాన మీడియా, సోషల్ మీడియా దృష్టి దీని పైకి మరలుతుంది. ఇక ప్రతీ రోజు అటువంటి చెత్తపైన రచ్చ రచ్చతో చర్చలు జరుగుతాయి. తద్వారా యువశక్తి అవశ్యకత, యువశక్తి వలన జరిగే రాజకీయ ప్రకంపనలు పైనుంచి దృష్టి మరలుతుంది.

కాబట్టి జనసైనికులు అందరికీ బహిరంగ విజ్ఞప్తి చేస్తున్నాం. వైసీపీ వేస్తున్న పాచికల్లో పావులు కావద్దు. మీ శక్తి, యుక్తి, సమయం మొత్తం యువశక్తి విజయవంతంగా ఏలా చేయాలి. దానిని రాష్ట్రవ్యాప్తంగా ఏలా ప్రచారం చేసి, మార్పు రాజకీయాలు ప్రజలకు దగ్గరగా చేయాలి అనే దాని పైన మాత్రమే దృష్టి పెట్టడం మంచిది.

ప్రత్యర్థి పార్టీలోని కొందరు వ్యక్తులు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యల గురించిన అలోచన సంక్రాంతి పండుగ ముగిసే వరకు చేయకండి.

యువశక్తి ముగిసిన మరుసటి రోజైన భోగి రోజున ఈ రెచ్చగొట్టే వారి పేరుతో భోగి మంట వేయండి.

మీ పూర్తి శక్తియుక్తులు జనసేన పార్టీ రణస్థలంలో చేయబోతున్న యవశక్తి పైన మాత్రమే కేంద్రీకరించండి. చారిత్రాత్మక ఘటనలో భాగం అవ్వండి అని మనవి

శాంతి ప్రసాద్ శింగళూరి, జనసేన పార్టీ లీగల్

సీఐడీ కేసులు అక్రమమో, సక్రమమో కోర్టులే తేలుస్తాయి: డిజిపి సునీల్ కుమార్