Rajyadhikaaram

ఆంధ్ర ప్రదేశ్’లో (Andhra Pradesh) సామాజిక న్యాయం (Social Justice) ఎండమావిగానే ఉంది అని కాపు (Kapu) ఉద్యమ నేత వేల్పూరి శ్రీనివాసరావు (Velpuri Srinivasa Rao) తన లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎంకి (AP CM) రాసిన బహిరంగ లేఖలో రాజ్యాధికారానికి సంబంధించి ఎన్నో చిక్కు ప్రశ్నలను వేల్పూరి లేవనెత్తారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడి 70సంవత్సరాలలో కేవలం ఒక్క సంవత్సరమే దశిత శిఖరం దామోదరం సంజీవయ్య (Damodaram Janjevaiah) రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మిగతా 69 సంవత్సరాలు కొన్ని వర్గాలవారే  సీఎంలుగా పరిపాలించారని వేల్పూరి తన లేఖలో గుర్తు చేశారు. ఒక్క సంవత్సరంలోనే సంజీవయ్య పాలన స్వర్ణ యుగంగ మిగిలింది. కానీ కొందరు సంజీవయ్యను అనేక విధాలుగా అవమానించారని వేల్పూరి తన ఆవేదనని వెలిబుచ్చారు.

ఇది సామాజిక న్యాయం ఎలా అవుతుంది?

జనాభాలో 95 శాతం ఉన్న దళితులు (Dalit), గిరిజనులు (Girijana), బలహీన వర్గాలు (weaker sections), కాపులు (Kapulu) కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే సీఎంగా ఉన్నారు. అయితే జనాభాలో కేవలం 5 శాతం మాత్రమే ఉన్నవారు మెజారిటీ సంవత్సరాలు సిఎంలు గా ఉండటము చూస్తున్నాము. ఇది సామాజిక న్యాయం (Social Justice) ఎలా అవుతుందని వేల్పూరి శ్రీనివాసరావు తన లేఖలో ప్రశ్నించారు.

ఈ 69 సంవత్సరాలలో రాష్ట్రంలోని అధికార ఫలాలను ఉపయోగించుకొని కొందరు మాత్రమే అన్ని రంగాలలో ఆకాశం ఎత్తుకి ఎదిగారని ఆయన పేర్కొన్నారు. అయితే జనాభాలో 95శాతం ఉన్న వర్గాలను సామాజికంగా, ఆర్థికముగా, రాజకీయముగా పూర్తి స్థాయిలో అణచి వేయడము జరుగుతున్నది అని ఈ వర్గాలు భావిస్తున్నాయి. ఇది వాస్తవము కూడా అని వేల్పూరి సూటిగా ప్రశ్నించారు.

పంచాయితీ సభ్యులు, ఎం.పి.టి.సి, జడ్.పి.టి.సి. పదవులను మాత్రమే ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయం సాధించటము సాధ్యమవుతుందా ? అని శ్రీనివాస్ ప్రశ్నించారు. జనాభాలోని 95శాతం ఉన్న వర్గాలకు అన్ని అధికారాలు ఉన్న ముఖ్యమంత్రి పదవి లాంటి పదవి దక్కితేనే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అయన ఆశాభావం వ్యక్తం చేశారు. నాటి నుండి నేటి వరకు జనాభాలోని 95శాతం ఉన్న వర్గాలను కేవలం ఓటర్లుగా చూడటం జరుగుతున్నది. ఓట్లు మావి- సీట్లు మీవా ? ఈ విధానం ఇకపై చెల్లదు ! అని వేల్పూరి తన ఆవేదనని వ్యక్తం చేశారు.

జనాభాలో 5శాతం ఉన్న వారికి మెజారిటీ పదవులు ఇవ్వడం, 95శాతం ఉన్న వారికి అధికారం లేని పదవులు ఇవ్వడం సామాజిక న్యాయం ఎలా అవుతుంది అని వేల్పూరి ప్రశ్నించారు. తాడిత పీడిత బాధిత వర్గాలు అన్నీ కలిసి, సామాజిక న్యాయం కోసం మరో పోరాటానికి  సిద్ధం కావాలని శ్రీనివాస్ పిలుపు నిచ్చారు.

(ఇది వేల్పూరి శ్రీనివాస్, కాపు ఉద్యమ నేత, విడుదల చేసిన బహిరంగ లేఖ సారాంశం అని గమనించ గలరు)

Spread the love