District CollectorDistrict Collector

ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్

జంగారెడ్డిగూడెం: మహిళలు మెరుగైన జీవనోపాధికి జిల్లాలో తొలిసారిగా జంగారెడ్డి గూడెంలో (Jangareddygudem) ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్’ని (Mahila Mart) జిల్లా కలెక్టర్ (District Collector) ప్రారంభించారు. ఇది జిల్లాకే ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకాంక్షించారు. మహిళల జీవనోపాధికి ‘చేయూత మహిళా మార్ట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, శాసన సభ్యులు వి.ఆర్. ఎలీజా పాల్గొని శుక్రవారం ప్రారంభోత్సవం చేశారు.

ప్రసన్న వెంకటేష్, మాట్లాడుతూ మహిళలంతా సహకరించాలని, అలాగే పంచధార, వంటనూనె వంటివి ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇక్కడ తక్కువ ధరకే అందించ బడతాయన్నారు. ఈ మార్ట్ లో డిస్ప్లే చేసిన వస్తువులనే కాకుండా లాభం వస్తుందని భావిస్తే ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల నుంచి చీరలు టోకున కొనుగోలు చేసి ఇక్కడ విక్రయించు కోవచ్చునన్నారు. అదే విధంగా పరిసర ప్రాంతాల్లో సేంద్రీయ కాయగూరలు పండించే కొంతమంది రైతులతో సమన్వయం చేసుకొని టోకున ఆర్గానిక్ కాయకూరలు కొనుగోలు చేసి మార్ట్’లో విక్రయించేందుకు చొరవ చూపాలన్నారు. మరింత పనివారిని పెట్టుకొని డోర్ డెలివరి చేసే ప్రయత్నం చేయాలని ఆయన సూచించారు.

ఈ మధ్య కాలంలో జుమాటో, స్విగ్గీ వంటి డోర్ డెలివరి ద్వారా సరుకులు పొందే అలవాటు పెరిగినందున ఆదిశగా మార్ట్ లోని వస్తువులు విక్రయానికి ప్రయత్నాలు చేయాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ జంగారెడ్డిగూడెంలో ఏర్పాటు చేసిన చేయూత మహిళా మార్ట్ ను బాగా నడిపి ఆదర్శంగా నిలబడాలన్నారు. దీనిని బట్టి మిగతా వారు ఏర్పాటుకు ముందుకు వస్తారన్నారు. మిగతా నియోజకవర్గాల్లో కొత్తగా చేయూత మహిళా మార్ట్ లు ఏర్పాటుకు జంగారెడ్డిగూడెం మహిళా మార్ట్ రోల్ మోడల్ గా నిలవాలన్నారు. ఇక్కడ 1500 గ్రూపులకు చెందిన మహిళలు రూ.300 చొప్పున తమ వాటాగా 40 లక్షలు రూపాయలు మూల ధనంగా మార్ట్ ను ఏర్పాటు చేసుకోవడం జరిగిందన్నారు.

ఈ మార్ట్’ల్లో మార్కెట్ ధర కంటే తక్కువ ధరకే నాణ్యమైన నిత్యవసర సరుకులు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటువంటి మహిళా మార్ట్ లు ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అందరూ కలిసి గట్టి కృషితో లాభాలను అందుకోవాలన్నారు. రిలయన్స్, వాల్ మార్ట్, డిమార్ట్ వంటి ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నాయని వాటికి ధీటుగా చేయూత మహిళా మార్ట్ లు నిలవాలన్నారు. ఈ భవనంపైన మరో అంతస్తు ఖాళీగా ఉన్నందున రంజాన్, క్రిష్టమస్, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో హెూల్ సేల్ గా వస్తువులు కొనుగోలు చేసి విక్రయించేందుకు సిద్ధపడాలన్నారు.

గృహనిర్మాణాలు చేపట్టండి

ఇటువంటి సమయంలో ఆయా సంస్థలు నుండి కొనుగోలు చేసిన వస్తువులు మిగిలి పోయిన నిర్దిష్ట కాలపరిమితిలో తిరిగి తీసుకొనే వెసులుబాటు ఉంటుందన్నారు. గృహనిర్మాణాలు చేపట్టండి పేదలందరికి ఇళ్లు ఉండాలనే రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఆకాంక్షకు అనుగుణంగా ప్రభుత్వం అందించిన ఇంటి స్థలంలో ఇళ్లు నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ లబ్దిదారులను కోరారు. ఇళ్ల నిర్మాణానికి మహిళలకందరికి రూ.35 వేలు వడ్డీలేని రుణాలు అందించడం జరుగు తుందన్నారు. ఇళ్ల స్థలం తీసుకున్న ప్రతిఒక్కరూ ఇళ్లు నిర్మించుకోవాలన్నారు. కోర్టు కేసుల్లో ఉన్న ఇంటి స్థలాల సమస్యను కూడా త్వరలో పరిష్కరించడం జరుగు తుందన్నారు.

–జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు

అనన్య చిత్రం విజయవంతం కావాలి