Bandi sanjayBandi sanjay

బీజేపీ (BJP) తెలంగాణ (Telangana) అధ్యక్షుడు (President), ఎంపీ (MP) బండి సంజయ్‌ (Bandi Sanjay) జైలు నుండి విడుదలయ్యారు. ఆయనకు 14 రోజుల రిమాండ్‌ (Remand) విధిస్తూ కరీంనగర్‌ ఫస్ట్‌క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ (Judicial Magistrate) జారీ చేసిన ఆదేశాలను తెలంగాణ హైకోర్టు (Telangana High Court) బుధవారం సస్పెండ్‌ చేసింది. మేజిస్ట్రేట్‌ (Majistrate) మెకానికల్‌గా రిమాండ్‌ ఆదేశాలు ఇచ్చారంటూ ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. బండి సంజయ్‌ను విడుదల చేయాలంటూ మధ్యంతర ఉత్తర్వులను కూడా జారీ చేసింది. దీంతో సంజయ్‌ బుధవారం రాత్రి కరీంనగర్‌ జైలు నుండి విడుదలయ్యారు.

కేంద్ర మంత్రి భగవత్‌ ఖుబా (Central Minister Bhagavat Khuba) ఆయనకు స్వాగతం పలికి జైలు నుంచి బయటకు తీసుకువచ్చారు. బీజేపీ నాయకులు (BJP Leaders), కార్యకర్తలు ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో జైలు వద్దకు తరలివచ్చి బండి సంజయ్’కు ఘనస్వాగతం (Grand Welcome) పలికారు. అనంతరం జైలు ఆవరణలో సంజయ్‌ మీడియాతో (Media) మాట్లాడారు. కోర్టు తీర్పుతోనే టీఆర్‌ఎస్‌ (TRS) ప్రభుత్వంపై ధర్మయుద్ధం ప్రారంభమైందని అయన ప్రకటించారు. కేసీఆర్‌ కుటుంబ (KCR Family) పాలనకు రోజులు చెల్లాయన్నారు. తాను జైలుకు వెళ్తే ముఖ్యమంత్రి రాక్షసానందం పొందుతున్నారని బండి వ్యాఖ్యానించారు.

జైలుకు వెళ్లడం తనకు కొత్త కాదని, ఎన్నో సందర్భాల్లో తాను ప్రజా పోరాటాలు చేసి జైలుకు వెళ్లానని అయన తెలిపారు. 317 జీవోను సవరించే వరకు పోరాటం చేస్తామని అన్నారు. ఉద్యోగుల కోసం జైలు కెళ్లడం సంతోషంగా ఉందని బండి అన్నారు. కేసీఆర్‌ కనుసన్నల్లో పోలీసులు (Telangana Police) తన ఆఫీసును ధ్వంసం చేసి ఆఫీస్ లోపలికి దూసుకువచ్చి కార్యకర్తలను కొట్టారని, మహిళా కార్యకర్తల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారని బండి సంజయ్ఆ రోపించారు.

నిరసన తెలపడం సహజమే కదా: హై కోర్టు

ప్రజాస్వామ్యంలో (Democracy) నిరసన తెలపడం అత్యంత సహజమైన ప్రక్రియ అని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం (High Court) వ్యాఖ్యానించింది. నిబంధనలకు విరుద్ధంగా నిరసన తెలిపారన్న ఒక్క కారణంతో ఒక ఎంపీని 14 రోజులు జైల్లో ఉంచడం మంచిది కాదని తెలిపింది. కరీంనగర్‌ కోర్టు (Karimnagar Court) తనకు 14 రోజుల రిమాండ్‌ విధించడాన్ని సవాలు చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భుయాన్‌ ధర్మాసనం విచారించింది.

పచ్చతంత్రాలను తిప్పికొట్టలేక పోతున్న జనసేనాని?