Kapu ReservationKapu Reservation

కాపుల బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ ఉద్యమ వేదిక డిమాండ్

కాపు (Kapu), తెలగ (Telaga), బలిజ (Balija), ఒంటరి (Ontari) కులాల్లో ఎంతోమంది మేధావులు (Intellectuals) ఉన్నారు. వివిధ పార్టీల్లో ఉద్దంటులైన నాయకులు ఉన్నారు. ఉన్నత పదవుల్లో కూడా ఉన్నారు. కాపు రిజర్వేషన్లపై (Kapu Reservations) వీరు అందరూ కూడా నోరు విప్పి తమ తమ వైఖిరిని చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. లేని యెడల జాతిపై వీరికున్న నిర్లక్ష్యపు వైఖిరిపై మేము ప్రజల్లో చైతన్యం తీసికొస్తాం… అంటూ “కాపుల బీసీ రిజర్వేషన్ (BC Reservations) పునరుద్ధరణ ఉద్యమ వేదిక” ప్రతీ కాపు నాయకుడికి  (Kapu Leaders) ఉత్తరాలు రాస్తున్నది. తద్వారా మరొక కాపు ఉద్యమానికి సమాహుత్తం అవుతున్నది. తమ పోరాట సత్తా సాటుదలచుకొన్నది. ఇది మంచి పరిణామమే.

అయితే ఈ ఉత్తరం కేవలం నాటి బాబు ప్రభుత్వాన్నే ప్రశ్నిస్తున్నట్లు ఉన్నది. గాని ప్రస్తుత ప్రభుత్వం కాపులకు చేస్తున్న మోసాలను ఎత్తి చూపడం లేదు అని అనిపిస్తున్నది. పాలక పార్టీలు రిజర్వేషన్ ఉద్యమాలను తిరిగి రెచ్చగొట్టాలని చూస్తున్నాయి అనే అనుమానాలు ఉన్నాయి. ఈ ఉత్తరం కూడా అటువంటి అనుమానాలను పెంచేదిగా ఉండకూడదు. ఉద్యమ సంఘాలు పక్షపాతంతో కాకుండా చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఫలితం ఉంటుంది. అప్పుడే చీలికలు, పీలికలుగా విడిపోయిన కాపుల్లో చైతన్యాన్ని తీసికొని రాగలరు. పక్షపాతంతో చేసిన ముద్రగడ (Mudragada) ఉద్యమ సారాంచాన్ని వీరు గుర్తెరిగి ముదుకువెళ్లడం మంచిదేమో? లేకపోతే వీరి ప్రయత్నం కూడా బూడిదలో పోసిన పన్నీరుగానే మిగులుతుందేమో?

వివిధ పార్టీల్లో ఉన్న కాపు నాయకులకు, కుల సంఘాలకు వారు రాస్తున్న లేఖలోని కీలక ముఖ్యంశాలు:

తెలుగు దేశం పార్టీ (Telugu Desam) అధినేత మరియు మాజీ ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) కాపులను నయవంచనకు గురిచేసారు. 1994 సం॥ నుండి 2004 సం॥రం వరకు హైకోర్టు (High Court) సమర్ధించినప్పటికీ జి.ఓ.నెం.30 ని అమలు చేయలేదు. జీవోని అమలుచేయకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించకుండా ఆ జీవోను తుంగలో తొక్కేసారు.

బి.సి. రిజర్వేషన్‌ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టి …

2014 సం॥రంలో వారి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం అధికారంలోకి వచ్చిన ఆరు మాసాలలోపు కాపులకు బి.సి. రిజర్వేషన్‌ కల్పిస్తామని మేనిఫెస్టోలో పెట్టారు. అయితే మానిఫెస్టోలో పెట్టిమరీ కాపులను మోసం చేసిన విషయం తమరికి తెలియనిది కాదు. ఒకసారి బి.సి.`ఎఫ్‌ ద్వారా 5% రిజర్వేషన్స్‌ అన్నారు. మరోసారి ఇ.డబ్ల్యు.ఎస్‌. (EWS) 10%లో 5% కాపులకని చెప్పి చక్కటి లేఖలు ఢల్లీికి  (Delhi) పంపారు. అలా లెకహాలు ఢిల్లీకి పంపించేసి చక్కగా బాబు చేతులు దులిపేసుకున్నారు. చివరికి ఈ రాష్ట్రంలో కాపులు బి.సి.లా? ఒ.సి.లా? తెలియని అయోమయ పరిస్థితిలోనికి కాపులను నెట్టేశారు. మన చిరకాల బి.సి. రిజర్వేషన్‌ డిమాండ్‌ను సైతం సైడ్‌ట్రాక్‌ పట్టించిన ఘనులు వారు అని అర్ధం అవుతున్నది.

చంద్రబాబు ట్రాప్’లోకి కాపు మేధావులు?

ఎంతో మేధవులు అయినా కాపు నాయకులు (Kapu Leaders) కూడా చంద్రబాబు (Chandra Babu) ట్రాప్’లోకి వెళ్ళిపోవు చున్నారు. మీరు ఇ.డబ్ల్యు.ఎస్‌.లో 5% కాపులకు ఇవ్వాలని ఏవిధంగా డిమాండ్‌ చేస్తున్నారో మాకు అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడి ఆలోచనను జగన్మోహన్‌ రెడ్డి (Jagan Mohan Reddy) ఎందుకు అమలు చేస్తారు? ఇ.డబ్ల్యు.ఎస్‌.లో 5% ఇచ్చాం అన్నారు. గాని అమలు చేయలేదు కదా? వారి ఆలోచనను ప్రస్తుతం వీరు అమలు చేస్తే పేరు ప్రఖ్యాతులు ఎవరికి వస్తాయి?

EWS లో 5 % కావాలి అనే మీ డిమాండ్ రాజకీయ కోణంలో ఏవిధంగా సాధ్యం? అసలు కాపుల చిరకాల డిమాండ్‌ బి.సి. రిజర్వేషనా? ఇ.డబ్ల్యు.ఎస్‌.లో 5% వాటానా? ఎందుకు మన చిరకాల డిమాండ్‌ను తమరు వక్రీకరిస్తున్నారో మాకు అర్థం కావడం లేదు సార్‌.

EWS కాదు బీసీ రిజర్వేషన్ కావాలి

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) విభజన అనంతరం తెలంగాణాలో (Telangana) మాదిరిగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా బి.సి. రిజర్వేషన్ల (Reservations) పునర్‌వ్యవస్థీకరణ చేయాలి. తెలంగాణాలో సుమారుగా సీమాంధ్ర (Seemandhra) ప్రాంతానికి చెందిన 27 కులాలవారిని బి.సి. జాబితా నుండి తొలగించారు. అలానే ఎ.పి.లో కూడా తెలంగాణా ప్రాంతానికి చెందిన బి.సి. కులాలవారిని బీసీ జాబితా (BC List) నుండి తొలగించాలి. ఆ విధంగా తొలగించగా మిగిలిన ఆ ఖాళీలలో 50% లోనే కాపులు కోల్పోయిన బి.సి. రిజర్వేషన్స్‌ రాజ్యాంగబద్ధంగా పునరుద్ధరించవచ్చు. దీన్ని గురించి కాపు నాయకులు, కాపు (Kapu) పెద్దలు ఎందుకు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వాన్ని (YCP Government) డిమాండ్‌ చేయడం లేదు?

127వ రాజ్యాంగ సవరణ (Constitution amendment) ద్వారా కాపులను బి.సి.లుగా గుర్తించమని కాపు నాయకులు ఎందుకు డిమాండ్‌ చేయడం లేదు? రాజ్యాంగ విరుద్ధమైన మత ప్రాతిపదిక రిజర్వేషన్లను రద్దు చేయాలని కాపు నాయకులు ఎందుకు డిమాండ్‌ చేయడం లేదు?
ఆచరణ సాధ్యం అయ్యేవాటికే పోరాడుదాం

కర్నాటకలోను (Karnataka), తమిళనాడులోను (Tamilnadu) 50% దాటి రిజర్వేషన్‌ ఉంది. కావున ఇక్కడ కూడా ఆ విధంగా ఉండాలి. అందుచేత రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కొంతమంది కాపు నాయకులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఇది ఆచరణ సాధ్యంకాని డిమాండ్ అని ఈ నాయకులకు తెలియదా? ఆచరణ సాధ్యమయ్యే డిమాండ్‌ని వదిలేసి ఆచరణ సాధ్యంకాని డిమాండ్స్‌ ప్రభుత్వం ముందుంచడంలో కాపు నాయకుల ఆంతర్యం ఏమిటి? అంటూ కాపుల బీసీ రిజర్వేషన్ పునరుద్ధరణ ఉద్యమ వేదిక ప్రతీ కాపు నాయకుడిని ప్రశ్నిస్తున్నది.

Importance of Vijaya Dasami

Spread the love