Ram charanRam charan

ఫిబ్రవరి 4నే మెగా ఆచార్య

ఆచార్య సినిమా (Acharya Movie) వాయిదా పడిందని అనే వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ఆచార్య సినిమా అనుకున్న సమయానికే విడుదల అవుతుంది అని చిత్ర నిర్మాతలు (Producers) స్పష్టం చేసారు. ఇప్పటికే ఆచార్య సినిమా డబ్బింగ్‌ (Dubbing) కూడా పూర్తయింది. విడుదలకి సిద్ధంగా ఉంటుంది అని నిర్మాతలు వివరించారు.

ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 4న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. అయితే ఆచార్య విడుదల ఆలస్యం అవ్వబోతోందని, విడుదల తేదీ మారే అవకాశాలు అనే వార్తలపై నిర్మాతలు స్పందించారు. చిత్రీకరణ దశలో ఉండగానే ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. వాటిని తప్పకుండా అందుకుంటామని కూడా నిర్మాతలు వివరించారు.

చిరంజీవి (Chiranjeevi) కథానాయకుడిగా నటించిన ఆచార్య చిత్రంలో రామ్‌ చరణ్‌  (Ram Charan) కీలక పాత్ర పోషించారు. కాజల్‌ (Kajal), పూజా హెగ్డే (Pooja Hegde) నాయికలు. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వం వహించారు. నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మాతలు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్‌: నవీన్‌ నూలి.

సినిమా టికెట్ల ఆన్‌లైన్‌ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ!