క్షేత్రస్థాయిలో ప్రజలు YCP ప్రభుత్వాన్ని ఈసడించుకుంటున్నారు
పులివెందుల ప్రజలే వైసీపీ నాయకులకు బుద్ధి చెబుతారు
చిరంజీవిని వెన్నుపోటు పొడిచిన నాయకులంతా వైసీపీలోనే ఉన్నారు
పేర్ని నాని పూర్తిస్థాయి ఊర కు..గా మారిపోయారు
తాడేపల్లి ప్యాలెస్ ప్రసన్నం కోసం నోటికొచ్చినట్లు వాగుతున్నారు
కాకినాడలో విలేకరుల సమావేశంలో పంతం నానాజీ, ముత్తా, శెట్టిబత్తుల
జనసేన అధ్యక్షులు (Janasena Party President) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో వైసీపీకి (YCP) 45 సీట్లు వస్తాయని చెప్పడంతో తాడేపల్లి ప్యాలెస్’లో (Tadepalli Palace) ఆడుకునే నాయకుడికి పట్టరాని కోపం వచ్చినట్లు ఉంది. ఆ వెంటనే తన పెంపుడు విశ్వాసులను పవన్ కళ్యాణ్’ని తిట్టించడానికి వదిలారని జనసేన పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ (Pantham Nanaji) అన్నారు. కాకినాడలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా నానాజీ మాట్లాడుతూ ” ఒకపక్క సొంత చెల్లి తెలంగాణలో (Telangana) మాట్లాడుతూ తండ్రిని కుట్ర చేసి చంపారని చెబుతుంటే ఏమీ మాట్లాడని ఈ నాయకుడు, అతడి పెంపుడు కు…లు పవన్ కళ్యాణ్ మీద ఇష్టానుసారం మాట్లాడడం సిగ్గుచేటు అని పంతం నానాజీ అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్’లో (Delhi Liquor Scam) ముఖ్యమంత్రి భార్య శ్రీమతి భారతిరెడ్డి మీద ఆరోపణలు వచ్చినా ఏ మాత్రం సమాధానం చెప్పుకోలేని స్థితిలో ఈ నాయకులు ఉన్నారు? ఇప్పుడు పెడబొబ్బలు పెడుతున్నారు. పవన్ కళ్యాణ్ వైసీపీకి 45 సీట్లు వస్తాయని చెప్పారు. అయితే క్షేత్ర స్థాయిలో పరిస్థితి చూస్తే 25 సీట్లు కూడా వచ్చేలా లేవు. ఇటీవల కడప (Kadapa) వెళ్ళిన మాకు అక్కడ నాయకులు చెప్పిన మాట ఇది. కడపలో కూడా కనీసం సగం సీట్లు తెచ్చుకుంటే ఈసారి గొప్ప అన్నట్లు అక్కడి వారు మాట్లాడడం ఈ ప్రభుత్వం ఎలా పతనమవుతుందో చెబుతోంది. సీఎం సొంత నియోజకవర్గంలోనూ ప్రజలు సుఖంగా లేరని నానాజీ వివరించారు.
పులివెందుల (Pulivendula) ప్రజలలో కూడా తీవ్ర వ్యతిరేకత
కడపలో పప్పులు ఉడక్క.. ఆ సంస్కృతిని గోదావరి జిల్లాలోకి తీసుకురావాలని చూస్తున్నారు. కాకినాడ రూరల్ పరిధిలో నాటు తుపాకులు దొరికాయి. వాటి వెనుక ఎవరు ఉన్నారో పోలీసులు సమాధానం చెప్పాలి. ఇటీవల కాకినాడ నగరంలోనూ కొన్ని స్థలాలు కబ్జా అవుతున్నాయని ప్రజాప్రతినిధులకు చెబితే వారు ఏమాత్రం పట్టించుకోలేదు. పైగా మా పార్టీ నాయకులే (YCP Leaders) స్థలాలు ఆక్రమిస్తే మేమేం చేసేది అంటూ చెబుతున్నారు. మీ అక్రమాలపై జనసేన పోరాడుతుందని పంతం నానాజీ అన్నారు.
తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి (Chief Minister) అయిపోవాలని, తండ్రి శవం ఇంట్లోనే ఉంచుకుని సంతకాలు సేకరించిన మీ నాయకుడు కూడా నీతులు చెప్పడం చూస్తే నవ్వు వస్తోంది. వైయస్ కుటుంబానికి కు…లా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) చెబుతున్న మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. ఎప్పటికీ చిరంజీవి (Chiranjeevi), పవన్ కళ్యాణ్ రామలక్ష్మణుల్లా కలిసిమెలసి ఉంటారు అని నానాజీ తెలిపారు.
మా యాత్ర ఎప్పుడు చేయాలి.. ఎలా రాజకీయం మొదలు పెట్టాలి అనేది మేం చూసుకుంటాం. ముందు మీ పార్టీ సంగతి, ప్రజలకు మంచి పాలన ఎలా ఇవ్వాలో మీరు చూడండి. ఇటీవల తాడేపల్లి ప్యాలెస్ నుంచి తరిమేశాక బందరు కు… ఇప్పుడు పూర్తి స్థాయి ఊర కు… మారి, మళ్లీ ప్యాలెస్ లోకి ప్రవేశించాలని చూస్తోంది. పవన్ కళ్యాణ్’ని మాటలు అంటే అది సాధ్యపడుతుందని భావిస్తోంది. పదవి కోసం ఏదైనా వాగితే, గట్టిగా సమాధానం ఇస్తాం. మా నాయకుడిపై నోరు పారేసుకుంటే జనంలో తిరగలేరు జాగ్రత్త” అని పంతం నానాజీ హెచ్చరించారు.
వైసీపీ మాటల్లో భయం కనిపిస్తోంది : ముత్తా శశిధర్
జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ముత్తా శశిధర్ (Mutha Shashidhar) మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించే విధంగా ఉన్నాయి. అందుకే ఆయన సభ అయిపోగానే వైసిపి నాయకులు రోడ్లమీద పడి పవన్ కళ్యాణ్’ని ఏదో ఒకటి తిట్టి సంబర పడుతున్నారు. మీ మాటల్లో మీ ఓటమి భయం కనిపిస్తుంది. ఒక పక్కా ప్రణాళికతో జనసేన సమరక్షేత్రంలో దిగబోతుంది. దీనికి మా అధినేత ముందుండి నడిపిస్తారు. పవన్ కళ్యాణ్ ఏ విషయం చెప్పినా దానిని వింటేనే వైసీపీ నాయకులకు ముచ్చెమటలు పడుతున్నాయి. అందుకే ఆయన మాటలకు వక్రభాష్యాలు చెబుతూ ఆనందపడుతున్నారు. నాయకులను, జన సైనికులను కొత్త శక్తిగా తయారు చేసి, ఈ దుర్మార్గపు ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు మిలిటెంట్ తరహా పోరాటాలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్నో పుస్తకాలు చదివి, గొప్ప నాయకుల త్యాగాలు చెబుతూ యువతలో స్ఫూర్తి నింపుతున్న పవన్ కళ్యాణ్ మార్గదర్శకం రాష్ట్రానికి అవసరం. కచ్చితంగా ఈ రాక్షస పాలనపై జనసేన అలుపెరగని పోరాటం చేస్తుంది. అలాగే రాబోయే రోజుల్లో కాకినాడలో పదివేల మంది పోర్టు కార్మికులకు ఉపాధి కోల్పోయే అవకాశం కనిపిస్తోంది. దీనిపై ఇప్పటివరకు అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు నోరు మెదపడం లేదు. కచ్చితంగా ఉపాధి కోల్పోయే కార్మికులకు ఒక దారి చూపేలా జనసేన పోరాటం చేస్తుందని ముత్తా శశిధర్ అన్నారు.
మాట జారితే గట్టిగా బుద్ధి చెబుతాం: శెట్టిబత్తుల రాజబాబు
అమలాపురం అసెంబ్లీ జనసేన ఇంచార్జి శెట్టిబత్తుల రాజబాబు (Settibathula Rajababu) మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ మహానుభావుల స్ఫూర్తి తీసుకోమని నాయకులకు చెబుతారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, మదర్ థెరిసా వంటి మహనీయులు అడుగుజాడల్లో నడవాలని వారి స్ఫూర్తి వాక్యాలను అందరికీ చెబుతారు. వైసీపీ నాయకులకు జాతి నాయకుల పేర్లు చెప్పి ఓట్లు దండుకోవడం మాత్రమే తెలుసు. అందరూ అదే చేస్తారని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ నాయకుల అద్భుతమైన స్ఫూర్తి వాక్యాలు చెప్పి, యువతకు ఒక మార్గం చూపారు. వైసీపీ నాయకులది ఒకటే అజెండా. పవన్ ను తిట్టు… పదవి పట్టు అనే మీ రహస్య అజెండాతో పవన్ కళ్యాణ్’ని ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇటీవల ప్యాలెస్ నుంచి తరిమేసిన పేర్ని నాని అనే కు.. మళ్ళీ ప్యాలెస్ లోకి దూరడానికి పవన్ కళ్యాణ్’ని తిట్టడమే పనిగా పెట్టుకుంది. మరోసారి మా నాయకుడిని దిగజారి మాట్లాడితే, మేం గట్టిగా బుద్ధి చెప్పాల్సి వస్తుంది.
అసలు పవన్ కళ్యాణ్’ని అనడానికి నువ్వు ఎవడివి రా పేర్ని నాని..? పాదయాత్రలో ఎన్నో ముద్దులు పెట్టి రకరకాల హామీలు ఇచ్చి తాడేపల్లి ప్యాలెస్ లో దాక్కున్న మీ నాయకుడిని.. ముందు ప్రజల్లోకి రమ్మని చెప్పు. రాజప్రసాదంలో దాక్కున్న మీ నాయకుడిని ముందు బయటకు రమ్మను. ప్రజాస్వామ్యవాదులం ప్రజల్ని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి చాలా మర్యాదగా మాట్లాడుతున్నాం. ఇది గుర్తు పెట్టుకుంటే నీకు కూడా మంచిది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పేర్ని నానిలాంటి చీడ పురుగుల్ని ఏరి వేయడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు” అని శెట్టిబత్తుల రాజబాబు అన్నారు.