Human RightsHuman Rights

విశాఖపట్నంలో (Visakhapatnam) ఒక దళిత మహిళా (Dalita Mahila) ఉద్యోగిని కరోనా కర్ఫూ సమయంలో ఇంటికి వెళ్ళటం కోసం తన స్నేహితుడు సహయం అడిగింది. ఆ స్నేహితుడు కర్ఫూ సమయంలో రోడ్డు పైకి వచ్చాడని 3వ టౌన్ విశాఖపట్నం పోలీసులు (Police) ఫైన్ వేయటం జరిగింది. దీనిపై సదరు యువతి పోలీసులను ప్రశ్నించటం జరిగింది. ఆ తరువాత జరిగిన పరిణామాలు వీడియో ఫుటేజ్,పోలీసులు వివరణ చూసిన తరువాత, నేను ఒక విషయం స్పష్టంగా చెప్పగలను.

ఈ సంఘటనలో పోలీసులు చాలా దురుసుగా ప్రవర్తించడం జరిగింది అని అనిపిస్తున్నది. రోడ్డు పైన ఒక మహిళకు (Women) బహిరంగంగా అవమానం జరిగింది. అలాగే తాగిందేమో, పరీక్ష చేయించండి అంటూ, అమెను బలవంతంగా లిఫ్ట్ చేయటానికి మహిళా పోలీసులతో ప్రయత్నాలు చేయటం జరిగింది. దానికి అమె ఉద్వేగంతో గట్టిగా అరవటం, ఎదుర్కోవటం కనుక పోలీసు విథులను భంగం కలిగించినట్లుగా పోలీసులు కేసు కట్టడం జరిగింది. దీనిపై ఆమె కనుక ఖచ్చితంగా రిపోర్టు ఇచ్చిన పక్షంలో సదరు మగ, అడ పోలీసులు అందరి పైన మహిళను బహిరంగంగా అవమాన పరచి, శారీరకంగా దాడీ చేసినందుకు సెక్షన్ 354 ఐపీసీ కింద మరియు యస్సీ, యస్టీ అత్యాచార నిరోథక చట్టం కింద ఖచ్చితంగా కేసు కట్టి అరెస్టు చేయాలి. కారణం, సదరు సెక్షన్లు కింద ఐదు సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది. మరియు యస్సీ, యస్టీ అత్యాచార నిరోథక చట్టం కింద అరెస్టు ఖచ్చితంగా చేయాలి. కనీసం స్టేషన్ బైయిల్ అవకాశం కూడా లేదు. ప్రతీ దానికీ అరెస్టులు చేసే పోలీసులు, ఖచ్చితంగా నిక్కచ్చిగా ఉండే వారైతే, ఈ విషయంలో అమె పైన అన్యాయంగా అమె ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మానవ హక్కుల ఉల్లంఘన కూడా చేసి, బహిరంగంగా అవమాన పరచటం చాలా హేయమైన చర్య.

పోలీసులు (Police) ఏరకంగా చలానాలు రాస్తూన్నారో అనేది ఇటీవల చాలా చూస్తున్నాం . అమె చెప్పిన కారణాలు రీత్యా, సదరు చలానా రుసుము రద్దు చేయవచ్చు. కానీ పోలీసులు ఈరకంగా ప్రవర్తన చేయటం ఖచ్చితంగా నేరం. ఇక్కడ వారి విథుల భంగం కన్నా, అమె హక్కులు భంగపరచబడటం అత్యంత స్పష్టంగా కనిపిస్తుంది. అసలు బలవంతంగా ఒక వ్యక్తిని పోలీసు స్టేషన్ కి తీసుకుని వెళ్ళే ప్రయత్నం పూర్తిగా మానవ మరియు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన. అలాగే సంథ్యా సమయం తరువాత అమెను పోలీసు స్టేషన్ లో నిర్బంధించటం పూర్తిగా పోలీస్ దౌర్జన్యాల కింద, అక్రమ నిర్బంధం కింద కేసు కట్టవచ్చు.

పోలీసులు పైన క్రిమినల్ కేసు!

అమె కనుక ఇప్పటికైనా ఈరకంగా అదే పోలీసు స్టేషన్’లో (Police Station) అదే పోలీసులు పైన క్రిమినల్ కేసు పైన చెప్పిన సెక్షన్ తో పాటు పలు సెక్షన్లు వచ్చేలా కేసు పెట్టవచ్చు. మరియు జాతీయ మానవ హక్కుల సంఘంలో మరియు జాతీయ యస్సీ, యస్టీ సంఘంలో పిర్యాదు చేయవచ్చు. భాథ్యులైన పోలీసులు ఖచ్చితంగా మూల్యం చెల్లించు కుంటారు. పోలీసులు సాథారణ పౌరులపైన, మరీ ముఖ్యంగా కోవిడ్ వారియర్లపైన ఈరకమైన దుశ్చర్యను ఒక క్రిమినల్ కేసులు చేసే న్యాయవాదిగా పూర్తిగా ఖండిస్తున్నాం.

— శింగలూరి శాంతి ప్రసాద్ (Shanti Prasad Singuluri), న్యాయవాది, జనసేన లీగల్

2 thought on “విశాఖ మహిళా ఉద్యోగిపై పోలీసు చర్య: శాంతి సందేశం”
  1. This is inhuman and needs to condemned. Action needs to be taken on the officials for misuse of power.

  2. అమ్మాయికి వాళ్ల మీద కేసు పెట్టే ఆర్ధిక స్తోమత అంత బ్యాక్ గ్రౌండ్ ఉండాలి కదా సార్ అదే అమ్మాయి కారులో వచ్చి ఉంటే ఈ పోలీసులు సలామ్ కొట్టేవాళ్ళు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు అంటే విలువ లేకుండా పోయింది

Comments are closed.