ఏపీ పోలీసులు (AP Police) చట్టాన్ని చేతుల్లోకి తీసికొని దేనినేని ఉమని నిర్బంధించడం దారణము అని చంద్రబాబు (Chandra Babu) ఆరోపించారు. “నా 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎంతోమంది డీజీపీలను, సీనియర్ ఐపీఎస్ అధికారులను చూశాను. కానీ ఇటువంటి డీజీపీని ఇంతవరకు చూడలేదు. పోలీసులు రివర్స్ కేసులు పెడతారా? గంటల తరబడి కారులో కూర్చున్న వ్యక్తి ఎవరిని కులం పేరుతో దూషించారు? ఎవరిపై హత్యాయత్నం చేశారు? మీడియా సమక్షంలోనే ఇన్ని జరిగాయా?” అని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పోలీసులను ప్రశ్నించారు.
రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ (Police Department) భ్రష్టుపట్టిపోయిందని, పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని తీవ్రంగా ధ్వజమెత్తారు. మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఉమా కుటుంబాన్ని శనివారం పరామర్శించారు. దేవినేని ఉమా భార్య, కుమార్తెలను ఓదార్చి బాబు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా బాబు విలేకర్లతో మాట్లాడారు. కొండపల్లి అభయారణ్యంలో అక్రమ మైనింగ్ (Illegal Mining) విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకోలేదు. అందుచేతనే దేవినేని పరిశీలనకు వెళ్లారని చెప్పారు. వారు సూచించిన మార్గంలో పోలీసుల సలహాతోనే తిరిగి వస్తుండగా ఎలా దాడులు చేసారు అని నిలదీశారు. ‘బాక్సైట్ తవ్వకాల్లో ఏం జరిగింది? మేం చెప్పిందే నిజమైంది. ఎన్‌జీటీ తీర్పు ఇచ్చింది. ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు కేసులు పెడుతున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని వేధించడమే ఈ ప్రభుత్వం లక్ష్యం అనే బాబు తీవ్రంగా దుయ్యబట్టారు.
చాలామంది సీఎంలను చూశాను. ఇంత ఇటువంటి సీఎంని చూడలేదు. రేపు వీరు ఈ రాష్ట్రంలో ఉండరా..? ఎక్కడికి పోతారు..? గతంలో నేను ఇలా చేయలేకనా..? పోలీసు వ్యవస్థపై ప్రజలకు పూర్తిగా విశ్వాసం పోయింది అంటూ బాబు ఆవేదన వ్యక్తం చేశారు.
వైకాపా వర్గీయుల నిరసన
మాజీ మంత్రి దేవినేని ఉమ ఇంటికి చంద్రబాబు వస్తున్నారని తెలిసి వైకాపా వర్గీయులు ఫ్లకార్డులతో నిరసన ప్రదర్శనకు సిద్ధమయ్యారు. దళితులకు న్యాయం చేయాలని కోరుతూ వినతిపత్రం చంద్రబాబుకు ఇస్తామని పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దళిత ద్రోహి చంద్రబాబు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. మరోవైపు తెదేపా కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్తత ఏర్పడింది. పోలీసులు అక్కడికి చేరుకుని బాబు కాన్వాయ్ సాఫీగా వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు.
అయితే చంద్రబాబు చేసిన ఈ వ్యాఖ్యలను వైసీపీ (YCP) నాయకులు (Leaders) తీవ్రంగా ఖండించారు.