రేయ్ చరణ్. నేను నీ బాబును రా! అన్న మాటలతో విడుదల అయిన ఆచార్య సినిమాకి (Acharya Movie) సంబంధించి వీడియో ఒక్కటి వైరల్’గా మారింది. ఆచార్య చిత్రానికి కీలకమైన పాట చిత్రీకరణకు కొరటాల శివ (Koratala Siva) సిద్ధమవుతున్నారు. దీని ప్రోమో కోసం అన్నట్లుగా చిరంజీవి (Chiranjeevi), రామ్‌చరణ్‌ల (Ram Charan) సంభాషణల వీడియో ఒక్కటి విడుదల చేశారు. భలే భలే బంజారా అంటూ సాగే పాట ఈ ఆచార్య చిత్రానికి చాలా కీలకం.
ఈ పాటకు చిరంజీవి, చరణ్ ఇద్దరూ స్టెప్పులు వేయబోతున్నారు. శేఖర్ మాస్టర్ (Shekar Master) నృత్యరీతుల్ని అందిస్తున్న ఆ పాటకు మనం వేయబోయే స్టెప్పులు గురించి చూసుకుందామా అని చిరంజీవి, చరణ్‌లు ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు. దీనికి సంబంధించి నిర్మాణ సంస్థ ఓ వీడియో విడుదల చేసింది. అందులో సంభాషణలివి…
చిరు: ఏం చరణ్ ఏంటి పాటలో డామినేట్ చేద్దామని చూస్తున్నావా? హహహ.. నేను నీబాబును రా.
చరణ్: నేనా? లేదు డాడీ. డామినేట్ చేయను కానీ తగ్గను కూడా!
చిరు: కరెక్ట్ చెప్పావ్ తగ్గాలి.. తగ్గుతావ్ చూస్తు ఉండూ!
చరణ్: తగ్గాలి కాదు డాడీ.. తగ్గను అంటున్నా… అంటే మీ ట్రైనింగ్ నుంచి వచ్చినవాడిని తగ్గితే బావుండదు.. మీరే ఆలోచించండి!
చిరు: సర్లే ఇక్కడ ఎందుకు కబుర్లు… కెమెరా ముందు.. సెట్స్‌లో అక్కడ చూసుకుందాం.. పదా.. అంటూ చిరంజీవి–రామ్‌చరణ్ ఒకరికొకరు సవాల్ విసురుకున్నారు.
ఈ వీడియో వైరల్’గా మారింది. ఆచార్య సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు.
అందరి అంచనాలను అందుకోవాలంటే నేను కష్టపడక తప్పదు’ అని చిరంజీవి అన్నారు. చరణ్ డామినేట్ చేేస అవకాశం ఉందన్న చిరంజీవి సెట్‌లో కెమెరా ముందు చూసుకుందామా అంటూ సవాల్ చేశారు. తండ్రీకొడుకులిద్దరూ తొలిసారి పూర్తి స్థాయిలో చేస్తున్న ఈ పాట ఈ నెల 18న విడుదల కానుంది అనే విష్యం తెలిసిందే.
లైవ్‌లో ఇద్దరి డాన్స్ చూడాలని అంటున్నారు అని కొరటాల శివ దీనికి సంబంధించి మరో ఆసక్తికర విషయాన్ని చెప్పారు. సాంగ్ షూటింగ్ షెడ్యూల్ కనుక్కొని లైవ్‌లో మీ ఇద్దరి షూటింగ్ చూడాలని చాలామంది ఆరాట పడుతున్నారు. దీనికోసం ఇప్పటికే చాలా ఫోన్లు చేస్తున్నారు అని శివ అన్నారు. సురేఖ కూడా షూటింగ్ చూడాలని ఎదురు చూస్తోంది అని చిరంజీవి వివరించారు.