Pawan KalyanPawan Kalyan

కోనసీమ అల్లర్ల (Konaseema Incidents) వెనుక వైసీపీ హస్తం (YCP Hand) ఉండే అవకాశం ఉందని జనసేన పార్టీ (Janasena Party) అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఆరోపించారు. అన్నీ జిల్లాలు ప్రకటించినప్పుడే కోనసీమ పేరును అంబెడ్కర్ కోనసీమ జిల్లాగా (Ambedkar Konaseema District) ప్రకటించి ఉండిఉంటే నేడీ పరిస్థితి వచ్చి ఉండేది కాదని పవన్ కళ్యాణ్ వివరించారు. జనసేన (Janasena) మంగళగిరి పార్టీ ఆఫీస్ (Mangalagiri Party office) నుండి మీడియాతో మాట్లాడారు. కోనసీమ అల్లర్లు, పీసీపీ ప్రభత్వ అలసత్వంపై, జగన్ ప్రభుత్వ పాలనపైనా పవన్ స్పష్టమైన ఆరోపణలు చేశారు.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రెస్ మీటులోని ముఖ్యంశాలు (జనసేనాని ఏమన్నారు అంటే)

ఏపీలోని అన్ని జిల్లాలకు ఒక విధానం పెట్టారు. కానీ కోనసీమకు మాత్రం మరో విధానం అనుసరించారు.

జిల్లా ప్రకటించినప్పుడే పేరు పెడితే నేడు ఈ పరిస్థితి వచ్చేది కాదు.

అంబేద్కర్ పేరు పెట్టడంలో జాప్యం చేయడంలో వైసీపీ ప్రభుత్వ (YCP Government) ఉద్దేశ్యం ఏంటి ?

జిల్లాలకు జాతీయ స్థాయి నాయకుల పేర్లను పెట్టడం జనసేన సమర్థిస్తుంది.

ఆంధ్ర రాష్ట్రానికి గుండెకాయ లాంటి వ్యక్తిని పొట్టి శ్రీరాములను (Potti Sriramulu) జిల్లాకు పరిమితం చేశారు.

పేర్లు పెట్టేటప్పుడు వైసీపీ ప్రభుత్వం కాస్త సున్నితంగా వ్యవహరించాల్సి ఉంది.

కృష్ణా నది తక్కువగా ఉన్నచోట కృష్ణా జిల్లా పెట్టారు. కానీ కృష్ణా నది ఎక్కువగా ఉన్నచోట ఎన్టీఆర్ పేరు పెట్టారు.

ప్రజలు జిల్లా పేర్లకు వ్యతిరేకమైనప్పటికీ కూడా ఆ యా వ్యక్తులకు వ్యతిరేకం కాదు.

కోనసీమ జిల్లాకు జాబ్మేద్కర్ కోనసీమ జిల్లాగా పేరు మార్చడంపై అభ్యంతరాలు ఉంటే 30 రోజులు సమయం ఇస్తున్నామన్నారు. వేరే జిల్లాలకు లేనిదీ కోనసీమ జిల్లాకే అనేందుకు ఈ గడువు ఇచ్చారు.

గొడవలు జరగాలని వైసీపీ (YCP) అనుకుంది అనే వైసీపీ దురుద్దేశం ఇట్టే అర్థమవుతోంది

గొడవలు జరగాలనే ఉద్దెశంతోనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారా?

సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలని చెప్పారు .

ఇది కేవలం వ్యక్తులను టార్గెట్ చేయడం కోసమే అని జనసేన భావిస్తోంది.

మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఉంటారా?

దాడి జరుగుతుందంటే ఇంటికి రక్షణగా ఉండాలి కానీ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారంటే ఏమనుకోవాలి?

ఘోరాలను ఆపకుండా జరిగేలా చేస్తారా? పైపెచ్చు జనసేనపై ఆరోపణలు చేస్తారా?

కులసమీకరణపై రాజకీయాలు చేస్తారా? భావోద్వేగాలు ఉంటాయని తెలిసే రెచ్చగొట్టారు?

మూడు రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్‍ను చంపారు. మృతదేహం తెచ్చి ఇంటికి తెచ్చి పడేశారు. ఎస్సీ వ్యక్తి కావడంతో వ్యతిరేకత వచ్చింది. ప్రజల దృష్టి మరల్చేందుకే కోనసీమలో గొడవలు రేపారు.

కోనసీమకే పేరు పెట్టడం వెనుక ప్రభుత్వ ఆలోచనేంటి? కడప జిల్లాకు అంబేడ్కర్ పేరు పెట్టవచ్చు కదా?

కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య (Damodaram Sanjeevaiah) పేరు పెట్టేలా చూడాలని కోరారు .

మొదటి ఎస్సీ ముఖ్యమంత్రి పేరు పెట్టడం మంచిదని సూచించారు. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కర్నూలు జిల్లాకు పేరు పెడతామని చెప్పా

అంబేడ్కర్ స్ఫూర్తిని అమలు చేయటం మాని వేరే పనులు చేస్తున్నారు.

అంబేడ్కర్‍పై ప్రేమ ఉంటే ఎస్సీ, ఎస్టీ సబ్‍ప్లాన్ సజావుగా అమలు చేయాలి.

గత రెండేళ్లలో రూ.10 వేల కోట్లు దారి మళ్లించారు.

దళితవాడల్లో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమయ్యారు

ఎస్సీలకు ఇవ్వాల్సిన వాహనాలు ఇవ్వడం లేదు

ఎస్సీలకు సివిల్స్, గ్రూప్స్ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వటం ఆపేశారు.

అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెనకు నిధులు ఇవ్వటం లేదు.

రాష్ట్రంలో వైసీపీ కుల రాజకీయాలకు ఆజ్యం పోసింది.

కోడి కత్తి ఘటనపై విచారణ ఎంతవరకు వచ్చిందో చెప్పాలి

వైఎస్ వివేకా హత్య విషయంలో వాస్తవాలేంటి?

కోడికత్తి కేసు సమయంలో ఏపీ పోలీసులను నమ్మేది లేదన్నారు

ఏపీ పోలీసులను నమ్మమని చెప్పి హైదరాబాద్ వెళ్లారు.

ఇప్పుడు పోలీస్ వ్యవస్థ మీ చేతిలో ఉంటే ఎందుకు విచారించట్లేదు.

మీపై హత్యాయత్నంతో సానుభూతి సంపాదించి ఎన్నికల్లో గెలిచారు.

రాందాస్ అథవాలే ఏపీలో అత్యధికంగా 557 అట్రాసిటీ కేసులు ఉన్నాయని చెప్పారు.

కులాల మధ్య ఘర్షణ రావణకాష్టం లాంటిది.

కులాల గొడవలు జరిగితే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు.

వైసీపీ ప్రభుత్వం బాధ్యత వహించాలి

యువత ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలపై ప్రభుత్వాన్ని అడగాలి.

ఇలాంటి వారి ఉచ్చులో పదవద్దని మనవి చేస్తున్నా

వైసీపీ నేతలు (YCP Leaders) గొడవలు తగ్గించే ప్రయత్నం చేయండి

సజ్జల వంటి పెద్దల అనుభవం కులాల మధ్య గొడవలకు కారణం కాకూడదు

కులాల చిచ్చుతో భగ్గుమంటున్న కోనసీమ