kodali naniKodali nani press meet

స్థానిక సంస్థల ఎన్నికల (Local Body Elections) కంటే రాష్ట్ర ప్రజల ప్రాణాలే ముఖ్యమని మంత్రి కోడలి నాని అన్నారు. కరోనా (Covid) రోజు రోజుకీ విజృభిస్తున్న నేపథ్యంలో స్థానిక ఎన్నికలు (Local Body Elections) జరపడం మంచిది కాదు  కొడాలి నాని (Kodali Nani) అని అన్నారు. స్థానిక ఎన్నికల విషయంలో కోర్టులు మానవతాదృక్పథంతో వ్యవహరించాలని మంత్రి అన్నారు.  ఎన్నికల నిర్వహణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆ ప్రక్రియలో పాల్గొనే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులు కూడా సిద్ధంగా లేరని ఆయన చెప్పారు. కృష్ణా జిల్లా (Krishna District) గుడివాడలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ తమకు ఎన్నికలు ముఖ్యం కాదని వ్యాఖ్యానించారు. ఎన్నికలు జరగకపోవడం వల్ల వచ్చిన ఇబ్బందేమీ రాష్ట్ర ప్రభుత్వానికి (AP government) లేదన్నారు. ప్రత్యేకాధికారులతో పాలన కొనసాగుతోందని. ఎన్నికలు జరగకపోయినా ఇవ్వాల్సిన నిధులను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని నాని చెప్పారు. ప్రస్తుతం ఎన్నికలు వాయిదావేస్తే ఎవరికి నష్టమో చంద్రబాబు, ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ‌కుమార్‌ (Nimmagadda Ramesh Kumar) చెప్పాలని మంత్రి వ్యాఖ్యానించారు.

Spread the love