కొత్త PRC పేరుతో జీతంలో కోతలు
పూర్తి వివరాలతో వివరించిన కోటిపల్లి అయ్యప్ప
నిన్న వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన మూడు జీవోల ఆధారంగా-
కోతలవాత – 1
IR 27% కంటే తక్కువగా ఫిట్మెంట్ 23% ఇచ్చి 4% కోత ఫలితంగా… ఉద్యోగి రవికి తన సర్వీస్ కాలమంతా 2-3 ఇంక్రెమెంట్ల ప్రత్యక్ష నష్టం, పరోక్షంగా నెలకు 600 దాకా DA (20%) నష్టం. అలాగే HRA (8%) పై 240 నష్టం వాటిల్లనున్నది.
అనగా ఒక్కో ఉద్యోగి నికరంగా నెలకు 4000 కోల్పోనున్నాడు. సర్వీస్ పెరిగేకొద్దీ ఈ నష్టం పెరుగుతూనే ఉంటుంది. ఈ శాపం జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది.
కోతలవాత – 2
HRA స్లాబ్ 12/14.5/20/30% ల నుంచి 8/16/24% లకు తగ్గింపు. ఫలితంగా
12% HRA లోనివారు 4%,
14.5HRAలోనివారు 6.5%,
20% HRA లోనివారు12%
30% HRA లోనివారు కొందరు 14%, కొందరు 6% HRA ను కోల్పోతున్నారు.
Example: 60000 basic తీసుకునే ఉద్యోగులు నెలకు కొందరు 2400(4% loss),
కొందరు 3900(6.5%), మరికొందరు 7200(12%) ఇంకొందరు 3600(6%) నష్టపోతున్నారు.
వాత ఎలా పెట్టారో తెలుసా? ఇలా…
ఈ HRA స్లాబులు కూడా 2021 జనాభా గణన ఆధారంగా కాకుండా 2011 నాటి జనాభా ప్రాతిపదికన మాత్రమే అట.
కోతలవాత – 3
సాధారణంగా IR అమలు తేదీ నుంచి PRC మానిటరీ బెనిఫిట్స్ లభిస్తాయి.
కానీ *PRC మానిటరీ బెనిఫిట్ 1.4.2020 నుంచి అంటూ 1.7.2019 నుండి 31.3.2020 (9నెలలు) వరకు ఇచ్చిన IR 27% ను లాగేసుకున్నారు.
Example: 37100 బేసిక్ గల రవి 27% ప్రకారం నెలకు 10017/- చొప్పున 9నెలలకు పొందిన 90153/- లను తిరిగి చెల్లించాలి
కనిపించని నాలుగో సింహం లాంటి వాత – 4
IR 27% కంటే తక్కువ ఫిట్మెంటు 23% ఇచ్చి గడచిన కాలం నుంచి PRC అమలు చేస్తే అదనంగా చెల్లించిన IR 4%(1484) ను వెనక్కి రాబట్టవచ్చు.
అనగా 1.4.2020 నుంచి 31.12.21 వరకు 21నెలల పాటు 4% పొందిన అదనపు IR మొత్తం 31164/- ని వెనక్కి తీసుకోనున్నారు
కోతలవాత – 5
CPS రద్దు కోరితే సిటీ కాంపెన్సేట్టరీ అలవెన్స్(CCA) రద్దు చేసిన ప్రభుత్వం
కోతలవాత – 6
5 సంవత్సరాలకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం పిఆర్సి కమిషన్’ను నియమించి PRC అమలు చేసే ప్రక్రియ తొలగింపు.
ఇక నుండి పది సంవత్సరాలకు ఒకసారి పిఆర్సి అమలు.
కోతకు కారెవరు అనర్హం అంటూ పెన్షనర్లను వదలని కోతవాత – 7
అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పొందు వయసు 70 నుంచి 80 సంవత్సరాలకు పెంపు.
*జీవిత చారమాంకం లోని వారికి కొడుకులా తోడు ఉండాల్సింది పోయి కోతపెట్టడం దారుణం..
వీటన్నింటినీ మనకు లక్షల్లో రావలసిన DA ARREARSలో తగ్గింపు చేసి పది, పన్నెండు వేలకు సరిపెట్టనున్నారు.
మాట మార్చాము. మడం తిప్పం అంటూ అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం ఇలా చేయడం తగునా అని ఉద్యోగులు తలలు పెట్టుకొంటున్నారు. పోరు బాట పట్టడానికి సమాయత్తం అవుతారేమో?
ప్రభుత్వం విడుదల చేసిన జీవోలు ఆధారంగా వివరించడం జరిగింది. పూర్తి వివరాలు అందాల్సిఉంది. పూర్తి వివరాలు అందిన తరువాత కొద్దిగా మార్పులు చేర్పులు ఉండవచ్చు .
— Analysis by Kotipalli Ayyappa
You are so great .You explained very clearly .What is the future of the employees.