Indian ParliamentIndian Parliament

వచ్చేది మా సర్కారే…

వచ్చేది మా సర్కారే అంటున్న తెలంగాణలో (Telangana) అన్ని రాజకీయ పార్టీలు (Political Parties).

అయినను ఓటరులను కొనేద్దాం (Note for Vote) అంటున్న డబ్బున్న పార్టీలు.

చేష్టలుడిగి చూస్తున్న డబ్బులేని నాయకులూ/పార్టీలు.

వీళ్లనా ఎన్నుకొనేది…

తెలిచిన తరువాత అసెంబ్లీకి (Assembly) సరిగా రారు. కొంతమందికి సెక్రటేరియట్ (Secretariat) కూడా ఎక్కడ ఉందొ తెలీదు?  

కొంతమందికి సెక్రటేరియట్ లోని తమ పేషీ ఎక్కడ ఉందొ కూడా తెలియడం లేదు? ప్రజలను కలవరు. వీళ్లనా ఎన్నుకొనేది…

అయినా…

ఏ సర్కార్ వచ్చినా పాలకులకు ఆస్తులు పెరుగుతున్నాయి?

రాష్ట్రానికి అప్పులు మిగులుతున్నాయి.

కేవలం కొంతమంది అనుయాయులకు మాత్రం పప్పు బెల్లాలు దక్కుతున్నాయి???

నాశనం అయ్యేది మా బిడ్డల భవితనే

అని మదన పడుతున్న సామాన్యులు.

అయినను ఈసారి కూడా ఓటును అమ్మేసికొందాం అంటున్న అదే సామాన్యుడు.

పులి మేకల దోబూచులాట…

ఇదే నేటి రాజకీయ చదరంగంలో పులి (పార్టీలు) మేకల (ఓటరుల) దోబూచులాట.

రాజకీయ పార్టీల- మా అమ్మా-నాన్నల డబ్బులాటలో
నాశనం అయ్యేది మా బంగారు భవిష్యత్తే అని బిక్కు బిక్కు
మంటూ రోదిస్తున్న ముక్కు పచ్చలారని చిన్నారులు.

అయినను ఓటును అమ్ముకోవాలి అని నోట్ల కోసం ఎదురు చూస్తున్న జీవులు
నాన్నొయి నా గోడు విను అంటే వింటారా???

ఆలోచించండి… ఏ ఎన్నిక చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? ఓట్లను కొనుక్కోవడం-ఓట్లను అమ్ముకోవడం తప్ప అని మన ఓటును కూడా అమ్మేసికొందామా లేక మార్పు కోసం మన ఓటు హక్కుని వాడుకొందామా? (It’s from Akshara Satyam)

(ఇది ఏ ఒక్కరిని ఉద్దేశించి కాదు వ్యవస్థలను చిన్నాభిన్నం చేస్తున్న కొంత మంది చేతిలోని ఓటు హక్కు గురించి మాత్రమే)

అణగారిన వర్గాలకు అధికారం వచ్చిననాడే నిజమైన స్వాతంత్య్రం: పవన్ కళ్యాణ్

Spread the love