బిజెపి (BJP) నిర్వహించిన ప్రజా ఆగ్రహ సభలో (Prajagraha Sabha) బిజెపి రాష్ట్ర అధ్యక్షులు (BJP State President) సోము వీర్రాజు (Somu Veerraju) రాష్ట్ర ప్రభుత్వం (State Government) చేసిన ప్రజా వ్యతిరేక విధానాల అన్నింటి మీద జగన్ ప్రభుత్వాన్ని (Jagan Government) దుమ్మెత్తి పోశారు. ఎండగట్టారు. కానీ సోము (Somu) మాట్లాడిన విషయాలన్నిటిని ప్రజల్లోకి తీసుకు వెళ్ళకుండా ఒక్క లిక్కర్ బాటిల్ (Liquor Bottle) విషయాన్నె ట్రోలింగ్ చేస్తూన్నారు. ఈ విధంగా చేస్తూ వీర్రాజుకు, బీజేపీకి (BJP) చెడ్డ పేరు తెచ్చే ప్రయత్నం చేస్తున్నది. ఇది అంతా బీజేపీ వ్యతిరేక మీడియా చేస్తున్న విష ప్రచారంగా గమనించాలని బీజేపీ నాయత్వం (BJP Leadership) చెబుతున్నది.
అందులో వీర్రాజు మాట్లాడుతూ చీప్ లిక్కర్ తయారీ కాస్ట్ క్వార్టర్ బాటిల్ పది రూపాయలు కూడా కాదు. కానీ ప్రభుత్వం దానిని 250 రూపాయలకు అమ్ముతున్నారు . ఒక్కొక్కరు రెండు బాటిల్స్ తాగితే 500 రూపాయలు అవుతుంది అనే బాధతో మాట్లాడారు అంటూ బీజేపీ (BJP) వివరణ నిస్తున్నది.
ప్రజల దగ్గర వందల కోట్లు దోచుకొంటున్నది?
మందు ఇంత తక్కువ రేటుకు తయారవుతున్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. ప్రభుత్వం ప్రజల తాగుడు అలవాటును అవకాశంగా, అలుసుగా తీసుకొని ప్రజల దగ్గర వందల కోట్లు దోచుకొని వారి వ్యక్తిగత ఆదాయం పెంచుకుంటున్నారని మాత్రమే అయన అన్నారు . ఈ తాగుడు మహమ్మారికి వారి కష్టమంతా ఖర్చు పెడుతున్నారని భార్యాబిడ్డలను గాలికి వదిలేస్తున్నారని ఆవేదనతో సోము మాట్లాడారు. సామాన్య మానవుడి బలహీనతను ఈ ప్రభుత్వం దోచుకుంటున్నారని బీజేపీ అధికారంలోకి వస్తే క్వార్టర్ బాటిల్ 70 రూపాయలుకు అమ్ముతాము. ఇంకా పరిస్థితులు అనుకూలిస్తే 50 రూపాయలకే అమ్ముతాము అని మాత్రమే సోము వీర్రాజు మాట్లాడారు అంటూ బీజేపీ నాయకులూ (BJP Leaders) స్పష్టత నిస్తున్నారు.
బీజేపీని చేస్తూ చులకనగా ట్రోలింగ్
ఈ మాటల్లో ఆంతర్యాన్ని, మంచిని అర్థం చేసుకోకుండా బీజేపీ వ్యతిరేక పార్టీలు (Opposition Parties), వ్యతిరేక మీడియా (Opposition Media) ఇష్టప్రకారం వీర్రాజుని, బీజేపీని చులకనగా ట్రోలింగ్ (Trolling) చేస్తూ, డిబేట్లో (Debates) రూపంలో, నేషనల్ మీడియాతో (National Media) సహా స్టేట్మెంట్లు రూపంలో ఇష్టప్రకారం మాట్లాడుతున్నారు అంటూ బీజేపీ (BJP) ఖండిస్తున్నది.
ఈ మాట్లాడే వాళ్ళకి ,ఈ చానెల్స్’కి ప్రజల మీద ప్రేమ ఉందా? ఉంటే వారి ఆర్థిక పరిస్థితి (Financial situation) బాగుపడాలని కోరిక ఉంటే జగన్మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) అధికారంలోకి రాకముందు క్వార్టర్ బాటిల్ ఎంత రేటు ఉంది ఇప్పుడు ఎంత రేటు ఉంది. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపాన నిషేధం (Liquor ban) అమలు చేస్తానని చెప్పిన పెద్దమనిషి మాట ఏమైంది అని ట్రోలింగ్ చేయండి అంటూ బీజేపీ (BJP) పిలుపు నిస్తున్నది.
ఈ ట్రోలింగ్ చేసే వాళ్లకు నిజంగా పేద ప్రజల మీద ప్రేమ, అభిమానం ఉంటే ,ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని వుంటే బ్రాందీ క్వార్టర్ బాటిల్ ఎంతకు తయారవుతుంది బేవరేజెస్ కార్పొరేషన్ రేటెంత? దానిమీద జిఎస్టి ఎంత? రిటైల్ షాప్ కి ఎంతకు ఇస్తున్నారు? ఇప్పుడు కొత్తగా పెడుతున్న ఎలైట్ షాపులకు ఎంతకు ఇస్తున్నారు ? ఏ బ్రాండ్ , ఏ సైజు బాటిల్ ఎంత? దీంట్లో ఎన్ని కోట్లు కిక్ బ్యాక్ ? బయటకు తీయండి అంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వం (BJP State Leadership) పిలుపు నిస్తున్నది.
అప్పుడు వీర్రాజు మాట్లాడింది నిజమా ! అబద్దమా ! పేద ప్రజల పట్ల సానుభూతిగా ఉండడం తప్పా ! పేద ప్రజల పక్షాన మాట్లాడారా లేదా !అనే విషయం బయటకు వస్తుంది. చేయాల్సిన పని ఇదయితే 50 రూపాయలుకు మద్యం బాటిల్ అమ్ముతానని వీర్రాజు అన్నారని నేషనల్ మీడియాతో సహా వ్యతిరేక ప్రచారం చేస్తున్నారు. ఇది తప్పు అంటూ బీజేపీ రాష్ట్ర నాయకులూ వివరణ నిస్తున్నారు.
మీరు చేయవలసిన పని ఇదేనా?
అంటే పేద ప్రజల పక్షాన మాట్లాడటం తప్పా? ప్రజలు తాగుడుకు బానిస అవుతున్నారు. సంపాదించిన డబ్బంతా తాగుడుకు ఖర్చుపెడుతున్నారనే బాధతో, సానుభూతితో, మాట్లాడితే వ్యతిరేక ప్రచారం చేస్తారా ! ప్రజలారా వాస్తవాలు గమనించండి .బిజెపి పార్టీ (BJP Party) ప్రజలను తాగుడు అలవాటు నుండి దూరంగా పెట్టే దానికోసం ప్రయత్నం చేస్తుంది. కానీ వారిని తాగుబోతులు చేయడానికి తాగుడు అలవాటు కొనసాగేతట్టు ఉండదు అంటూ బీజేపీ నాయకులూ సోషల్ మీడియాలో (Social Media) వివరణ నిస్తున్నారు.
— కరణం భాస్కర్ (Karanam Bhaskar), బిజెపి, నెల్లూరు