Bus boltaaBus boltaa

పశ్చిమగోదావరి జిల్లా (West Godavari District) జంగారెడ్డిగూడెం (Jangareddygudem) మండలం జల్లేరు వాగులో (Jalleru vagu) బుధవారం ఆర్టీసీ (RTC) పల్లె వెలుగు బస్సు (Palle Velugu Bus) అదుపు తప్పి బోల్తా పడింది. అధికార స్థానిక వివరాల ప్రకారం ఆర్టీసీ బస్సులో సుమారు 57 మంది ఉన్నట్టు తెలుపుతున్నారు. అశ్వరావుపేట మండలం వేలేరుపాడు గ్రామం నుండి జంగారెడ్డిగూడెం వైపు వెళ్లే రహదారి జల్లేరు వాగు ఉంది. ఆ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సులో ప్రయాణించే 57 మంది లో తొమ్మిది మంది మరణించగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మరణించిన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నారు.

సంఘటనా స్థలానికి జంగారెడ్డిగూడెం ఆర్డీవో (RTO) ప్రసన్న లక్ష్మి చేరుకుని ఘటనా స్థలాన్ని పర్యవేక్షించారు. జంగారెడ్డిగూడెం పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తరలించే ప్రయత్నం చేశారు. చుట్టుపక్కల స్థానికులు పోలీసువారికి సహకరించారు. స్థానిక చింతలపూడి (Chintalapudi) శాసనసభ్యులు ఎలీజా ఏరియా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులకు వైద్యం అందేలా తగిన ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ బస్సును అధికారులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. కాల్వలో పడిన బస్సుని పూర్తిగా బయటకు తీసిన తరువాత మాత్రమే బస్సులో ఇంకా ఎంత మంది మరణించి ఉంటారు అనేదే తెలియాల్సి రావచ్చు.

జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కూడా ఘటనస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.

ఆదాయం అంచనాలో ఏపీ ప్రభుత్వం విఫలం! 

Spread the love