RosaiahRosaiah

ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం, రాజకీయ కురువృద్ధుడు కొణిజేటి రోశయ్య (Konijeti Rosaiah) కన్నుమూశారు. ఇంట్లో ఈ ఉదయం పల్స్‌ పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆయనను నగరంలోని స్టార్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస వదిలీనట్లు ప్రకటించారు.

రోశయ్య (Rosaiah) రాజకీయాల్లో విశేష అనుభవాన్ని గడించారు. ఆయన 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరులో (Vemuru) జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో (Hindu College) కామర్స్ పూర్తిచేశారు. 1968లో తొలిసారిగా శాసనమండలికి రాజయ్య ఎన్నికైనారు. రోశయ్య ప్రముఖ స్వాతంత్ర్య యోధుడు, కర్షక నాయకుడు అయిన ఎన్.జి.రంగా శిష్యులు. నిడుబ్రోలులో అయన రాజకీయ పాఠాలు నేర్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున 1968, 1974, 1980లలో శాసనమండలి (Legislative Council) సభ్యునిగా ఎన్నికయ్యారు.

కాంగ్రెస్‌ (Congress) సీఎం (CM) లందరి వద్ద పలు కీలకమైన శాఖల బాధ్యతలను రోశయ్య నిర్వర్తించారు. 2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా ఎమ్మెల్సీగా కొనసాగారు.

అనేక సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను (State Budget) ప్రవేశపెట్టిన ఘనత

ఉమ్మడి రాష్ట్రంలో (Combined State) సుదీర్ఘకాలం పాటు ఆర్థికమంత్రిగా (Finance Minister) పనిచేశారు. మొత్తం 15 సార్లు రాష్ట్ర బడ్జెటును (State Budget) ప్రవేశపెట్టిన ఘనత రోశయ్యకు దక్కుతుంది. ఇందులో చివరి 7 సార్లు వరుసగా బడ్జెట్‌ ప్రవేశపెట్టడం విశేషంగ చెప్పవచ్చు. బడ్జెట్ కూర్పులో రోశయ్య ఎంతో పేరు పొందారు. వై.ఎస్.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మృతిచెందడంతో రోశయ్య ముఖ్యమంత్రిగా (Chief Minister) ప్రమాణస్వీకారం చేశారు. పద్నాలుగు నెలలు అధికారంలో కొనసాగిన అనంతరం తన పదవికి రాజీనామా చేశారు. ఆ తరువాత తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా (Tamilnadu Governor) బాధ్యతలు చేపట్టి సేవలు అందించారు.

మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతిపట్ల పలువురు ప్రముఖులు నివాళి అర్పించారు. పలువురు తమ సంతాపాన్ని తెలియచేస్తున్నారు.

రైతులకు లక్షల జరిమానా అని బెదిరింపా?-నాదెండ్ల

Spread the love