FM during Budget for FY23FM during Budget for FY23

కేంద్ర ఆర్ధికమంత్రి (Finance Minister) నిర్మల సీతారామన్ బడ్జెట్ 2022 ని లోక్ సభలో (Lok Sabha) ప్రవేశపెట్టారు.

బడ్జెట్ 2022 లోని ముఖ్యంశాలు

కొవిడ్‌ మహమ్మారి తర్వాత భారత్‌ వేగంగా కోలుకుంది
వచ్చే 5 ఏళ్లలో 60 లక్షల ఉద్యోగాల కల్పన.
వృద్ధిరేటులో (Growth Rate) మనం ముందున్నామని తెలిపారు.
వచ్చే 25 ఏళ్లను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్‌ రూపొందించాం.

పేద, మధ్యతరగతి వర్గాల సంక్షేమం కోసం కృషి.
పేద వర్గాలకు మౌళిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం.
ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వ్యవసాయదారులకు సముచిత స్థానం

వందే భారత్‌ రైలు (Vande Bharat Railu) విజయవంతమైందని నిర్మల అన్నారు.
75వ వడిలోకి వచ్చిన భారత్‌కు వందేళ్ల అభివృద్ధిని కాంక్షిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే మూడేళ్లలో ఆ దిశగా చర్యలు.
వైద్య ఆరోగ్య సౌకర్యాల అభివృద్ధి, వ్యాక్సినేషన్‌కు ప్రాధాన్యత.

వందేళ్ల భారతానికి ప్రధాని మోదీ ఒక మిషన్‌ రూపొందించారని, దానికి అనుగుణంగా పనిచేస్తున్నామని అన్నారు.

ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల్లో ముందంజలో ఉన్నామని
ఎయిరిండియా (Air India) బదిలీని సంపూర్ణం
పీఎం గతిశక్తి పథకం ద్వారా మౌలిక సదుపాయాలు కల్పించామని తెలిపారు.
రవాణా రంగంలో (Transport Sector) మౌలిక సదుపాయాల (Infrastructure) కోసం రూ. 20వేల కోట్లు
ఐదేళ్లలో 60 లక్షల మందికి ఉ‍ద్యోగాల (Jobs) కల్పనకు ప్రణాళిక

చిన్న, మధ్యతరహా రైతుల కోసం వన్‌నేషన్‌ వన్‌ ప్రొడక్ట్‌ (One Nation One product) పథకం అమలు
దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల జాతీయ రహదారుల నిర్మాణం (National Highways) 
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు
ఒమిక్రాన్‌ వేవ్‌ మధ్యలో ఉన్నాం.. వ్యాక్సిన్‌ల వల్ల మేలు జరిగింది.

వచ్చే మూడేళ్లలో కొత్తగా 400 వందే భారత్‌ రైళ్లు
రవాణ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.20 వేల కోట్టు
భారత్‌లో అవసరాలకు అనుగుణంగా మెట్రో రైలు కనెక్టివిటీ

దేశ వ్యాప్తంగా కొత్తగా 25 వేల కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం
వచ్చే ఐదేళ్లలో 13 లక్షల కోట్ల ఉత్పత్తి ఆధారిత ఇన్సెంటివ్‌లు

ఆతిథ్య రంగానికి (Hospitality) రూ. 5లక్షల కోట్లు కేటాయింపు
మైక్రో, చిన్న తరహా పరిశ్రమలకు రూ. 2 లక్షల కోట్లు
పీఎం ఈ- విద్య కోసం 200 టీవీ చానెళ్లను ఏర్పాటు
ప్రాంతీయ భాషల్లో 1-12 తరగతుల వరకు వర్తింపు
పట్టణ ప్రాంతాల్లో రోప్‌వేల నిర్మాణం జరుగుతుంది.
అదే విధంగా, సరుకు రవాణాకు మరిన్ని కేటాయింపులు
2023 నాటికి 2 వేల కి.మీ రైల్వే లైన్లు పెంపు.
భూరికార్డులను డిజిటలైజేషన్‌
కృష్ణా,పెన్నా,కావేరి నదుల అనుసంధానానికి (Rivers integration) ప్రణాళిక

ప్రస్తుత బడ్జెట్‌లో వేతన జీవులకు నిరాశ.
ఆదాయ పన్నులో ఎలాంటి మార్పులేదు.
ఇన్‌కంటాక్స్‌ స్లాబ్‌లలో ఎలాంటి మార్పులేదు.
ఐటీ శ్లాబుల్లో కేంద్రం ఎలాంటి మార్పులు లేవు

తెలుగు రాష్ట్రాల్లో నదుల అనుసంధానానికి ప్రణాళికలు
ప్రత్యేకంగా డిజిటల్‌ యూనివర్సిటీ ఏర్పాటు
దేశంలో 4 మల్టీమోడల్‌ లాజిస్టిక్‌ పార్క్‌లు.

లోక్‌సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
ఆర్ధిక సర్వే ప్రధానాంశాలు