విలక్షణ నటుడు సూర్య (Surya) అభిమానులకి మరొక తీపి వార్త. దర్శకుడు బాలా ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. విశాల్ (Vishal), ఆర్యలతో ‘వాడు వీడు’, సూర్య, విక్రమ్‌తో ‘శివపుత్రుడు’ లాంటి మల్టీస్టారర్ చిత్రాలకు దర్శకత్వం వహించి మంచి విజయాలను దర్శకుడు బాలా అందుకున్నారు . తాజాగా ఆయన ముగ్గురు హీరోలతో ఓ మల్టీస్టారర్ చిత్రానికి (Multistar movie) ప్లాన్ చేస్తున్నారు అని తెలిసింది. ఈ మల్టీస్టారర్ కోసం బాలా ఇప్పటికే స్ర్కిప్ట్ సిద్ధం చేసేపనిలో ఉన్నారట. ఇందులో ముగ్గురు హీరోలుగా తమిళ నటులు సూర్య, అథర్వ, ఆర్య నటిస్తే బాగుంటుందని బాలా అనుకుంటన్నారని తెలిసింది. ఈ ముగ్గురు హీరోల చిత్రాలకు గతంలో బాలా దర్శకత్వం వహించడం విశేషం. తన కొత్త చిత్రం కోసం వీరితో సంప్రదింపులు జరుపుతున్నారని కూడా తెలుస్తున్నది. విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ కథానాయకుడిగా తెలుగు అర్జున్‌రెడ్డికి తమిళ రీమేక్ వర్మకు దర్శకత్వం వహించారు. ఈ కొత్త చిత్రంతో తన సత్తా చాటుకోవాలనే ప్రయత్నంలో బాలా ఉన్నారని అంటున్నారు.