మా తాడిత పీడిత బాధిత వర్గాలకు (Suppressed Classes) బద్ధ శత్రువు చంద్రబాబు (Chandra Babu), తెలుగుదేశం (Telugudesam) పార్టీనే. అటువంటి టీడీపీతో జనసేనాని (Janasenani) పొత్తు (Poll Alliance) ఎందుకు పెట్టుకోవాలి. పవర్ షేరింగ్ (Power Sharing) లేదు అలానే సీట్ల సంఖ్య కూడా చాలా తక్కువ. అటువంటప్పుడు టీడీపీతో వెళుతున్న సేనకు ఓటు (Vote for Janasena) ఎందుకు వేయాలి అనే వారి కోసమే ఈ విశేషణాత్మక ఆర్టికల్.
తాడిత పీడిత బాధిత వర్గాలకు శత్రువు టీడీపీ మాత్రమే కాదు. టీడీపీ వైసీపీలు రెండు అణగారిన వర్గాలకు అన్యాయం చేసినవే. ఆ మాటకొస్తే రెడ్డి ప్రభుత్వాలే (Kamma) (Reddy) అణగారిన వర్గాలకు ఎక్కువ నష్టం చేసాయి అని చెప్పాలి. కానీ కుల పెద్దలు లేదా ఉద్యమ పెద్దలు వారి వారి స్వార్ధం కోసం కమ్మ వ్యతిరేకతను మాత్రమే మీలో పెంచి పోషించాయి. తప్ప రెడ్డి ప్రభుత్వాలు మీకు చేసిన అన్యాయాలను వారు మీకు చెప్పలేదు. మీ నర నరాన కమ్మ వ్యతిరేకతను పెంచాయి అలానే దొడ్ల మీద ప్రేమని పెరిగేటట్లు చేశాయి. కానీ ఇది వాస్తవం కాదు.
కమ్మ వ్యతిరేకత లేదా రెడ్డి వ్యతిరేకతతో మీరు ఏమీ సాధించ లేరు. ప్రస్తుత పరిస్థితుల్లో పొత్తు పెట్టుకోవాలి అనే సేనాని నిర్ణయం ముమ్మాటికీ హర్షణీయం. అనుసరణీయం. పొత్తులతో బాబు పొందే లాభం కంటే పొత్తు లేకపోతే మీ జనసేన పార్టీకి, రాష్ట్రానికి జరిగే నష్టం గురించి కూడా ఈ అణగారిన వర్గాలు ఒక్కసారి ఆలోచించాలి.
అసలు పొత్తుల వల్ల ఉన్న లాభ నష్టాలు ఏమిటి:
1. టీడీపీకి, వైసీపీకి సమ దూరం పాటించి ఒంటరిగా పోటీ చేస్తే ఆ రెండు వర్గాలు లేదా ఆ రెండు కుటుంబాలు లేదా ఆ రెండు పార్టీలు ఒక్కటి అయిపోతున్నాయి. పీఆర్పీ ఓటమికి, జనసేన ఓటమికి ఇదే కారణం. ఆరు దశాబ్దాల ఆంధ్ర రాజకీయ చరిత్ర కూడా అదే చెబుతున్నది.
2. రెండు బలమైన పార్టీలను సమస్థాయిలో ఓడించే సత్తా వచ్చే వరకు ఒక బలమైన వర్గంతో పొత్తు పెట్టుకోవడం సేనాని వ్యూహమే గాని పిరికితనం కాదు.
3. ఒక బలమైన రాక్షసుడిని ఎదుక్కోవడానికి చంద్రబాబుతో మధ్ధతుని తీసికోవడం ఉత్తమమే గాని తప్పిదం కాదు.
4. జనసేన మద్దతుదారుల్లో పోరాటానికి అవసరమైన ఆత్మా స్థైర్యం ఇంకా రాలేదు. అలానే ఈ అణగారిన వర్గాల్లో అవసరమైన ఐక్యత పూర్తిగా రాలేదు.
5. కారణాలు ఏమైనా కారకులు ఎవరు అయినా ఒంటరిగా పోటీచేసే స్థాయికి జనసేన పార్టీ ఇంకా పటిష్టం కాలేదు. అప్పటి వరకు పొత్తులు అనివార్యం.
6. పోటీకి అవసరమైన ఆర్ధిక బలం, అంగ బలం, మీడియా బలం కూడా జనసేనకు లేదా సేన మద్దతు దారులకు తగినంత లేదు.
7. టీడీపీకి, వైసీపీకు ఉన్న వ్యాపార వేత్తల మద్దతు జనసేనకు లేదు. అలానే డబ్బు ఉన్నవాళ్లను సేన దరిదాపులకు రానివ్వడం లేదు అలానే డబ్బున్న వారు సేన దరికి రావడం లేదు కూడా.
8. సేనానిపై ప్రేమతో ఉన్నవారే గాని గెలిచే సత్తా ఉన్న నాయకులు జనసేనలో తగినంత మంది లేరు. దానికి కారకులు మనోహర్ నా లేక మీరా లేక నేనా అనేది అప్రస్తుతం. తగినంత మంది నాయకులు మాత్రమే జనసేనలో ఇంకా పూర్తిగా ఎదగలేదు అని చెప్పాలి.
9. జనసేనానికి, పార్టీలో కింద స్థాయి కార్యకర్తలకు అనుసంధానం ఇంకా బలపడలేదు. సమాచార వ్యవస్థ తగు విధంగా లేదు. బూత్ స్థాయి వ్యవస్థ ఏర్పాటు ఇంకా పూర్తి కాలేదు.
10. ఒక రాజకీయ పార్టీకి అవసరమైన అన్నివర్గాల నాయకులు సేనలో లేరు. మనోహర్ గారు లాంటి ముఖ్యుల అడ్డంకిని పార్టీ నేటికీ ఎదురుక్కొంటున్నది అనేది కూడా అక్షర సత్యం.
11. జనసేనాని పవన్ కళ్యాణ్ గారు పొత్తులో భాగంగా పిఠాపురంలో పోటీ చేస్తుంటే వైసీపీ ఊరుకోక ఇంచార్జిని పెట్టి వందల కోట్లు ఖర్చు చేయబోతున్నది అని వార్తలు వస్తున్నాయి. అదే ఒంటరిగా పోటీచేస్తే వైసీపీతో బాటు టీడీపీ కూడా ఊరుకోక ఇంచార్జిని పెట్టి వందల కోట్లు ఖర్చు పెట్టి జనసేనాని పవన్ కళ్యాణ్ ని ఓడించడానికి ప్రయత్నం చేసేది. ఈ రెండు పార్టీలను ఎదుర్కొనే సత్తా సేన మద్దతు దారులకు ఉంది అని భావిస్తున్నారా?
12. పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేస్తీ వైసీపీలో ఉన్న కాపు నాయకులూ, వైసీపీకి మద్దతునిస్తున్న ముద్రగడ లాంటి వారు సేనకు మద్దతు నిస్తారు అని భావిస్తున్నారా. రారు. మరి అప్పుడు వైసీపీలో ఉన్న కాపు నాయకుల, ముద్రగడ లాంటి ఉద్యమ నాయకుల మాట విని మీరు ఎందుకు మోసపోవాలి అనేది మీరు ఆలోచించండి.
చివరి మాట:
వైసీపీ లో ఉన్న కాపు నాయకులూ లేదా ఉద్యమ నాయకులూ లేదా వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పి కొట్టండి. సేనాని పవన్ కళ్యాణ్ గారిని నమ్మి జనసేనకు అండగా ఉండండి. టీడీపీ, సేన, బీజేపీ కూటమికి మద్దతు పలకండి
టీడీపీ మీదనో లేక బాబు మీద ఉన్న కోపంతో, నేడు మీరు సేనకు అండగా ఉండక పోతే రాజ్యాధికారం మాట అటుంచి అణగారిన వర్గాల ఉనికే లేకుండా పోవచ్చు. బానిస సంకెళ్లతో భావితరాలు కూడా మనుగడ సాగించే రోజులు రావచ్చు?