కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా జస్టిస్ అబ్దుల్ నజీర్ (S Abdul Nazeer) నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు.
మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్ గవర్నర్‌గా నియమించారు.
ఏపీ కొత్త గవర్నర్ అబ్దుల్ నజీర్ గురించి
జస్టిస్ అబ్దుల్ నజీర్ 1958 లో కర్ణాటకలోని బెలువాయిలో జన్మించారు. మంగళూరులో అయన న్యాయవిద్యను అభ్యసించారు. 1983లో కర్ణాటక హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రాక్టీస్ ప్రారంభించారు. 2003లో కర్ణాటక హైకోర్టు అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2017 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు జడ్జిగా పదోన్నతి లభించింది.
ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన కూడా ఒకరు. ట్రిపుల్ తలాక్ చెల్లదని తీర్పు ఇచ్చిన సుప్రీం ధర్మాసనంలో జస్టిస్ నజీర్ కూడా ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వం నియమించిన కొంత గవర్నర్ల జాబితా
ఆంధ్రప్రదేశ్: జస్టిస్ అబ్దుల్ నజీర్
మహారాష్ట్ర: రమేశ్ బైస్
ఛత్తీస్‌గఢ్: బిశ్వభూషణ్ హరిచందన్
హిమాచల్ ప్రదేశ్: శివ్ ప్రతాప్ శుక్లా
అరుణాచల్‌ప్రదేశ్: లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్
సిక్కిం: లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
అసోం: గులాబ్ చంద్ కటారియా
నాగాలాండ్: గణేశన్
బిహార్: రాజేంద్ర విశ్వనాథ్
ఝార్ఖండ్: సి.పి. రాధాకృష్ణన్
లద్దాఖ్ లెఫ్టినెంట్ గవర్నర్: బీడీ మిశ్రా
మేఘాలయ: ఫాగు చౌహాన్
మణిపూర్: అనుసూయ