Pawan KalyanRythulaki Nasta Parihaaram

గత ఏడాది పంట నష్ట పరిహారం మాటేమిటి?

భారీ వర్షాలు, వరదల (Floods) మూలంగా నష్టపోయిన రైతులకి (Rythulu) అందాలిసిన నష్ట పరిహారంపై (Compensation) జనసేనుడు (Janasenudu) తీవ్రంగా స్పందించారు. రైతులకు అందాలిసిన నష్టపరిహారంపై  ప్రభుత్వం తాత్సారం మాని తక్షణమే చర్యలు తీసికోవాలని పవన్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు.

భారీ వర్షాలు, వరదల మూలంగా నష్టపోయిన రైతులు తమ పంటలను పూర్తిగా నష్టపోవడం చాలా దురదృష్టకరం. ఖరీఫ్ సీజన్’లో పెట్టుబడి పెట్టిన ప్రతి పైసా నీటి పాలైంది. రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం లేదు అని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం పరిహారాన్ని అందించడంలో ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తోంది. గత ఏడాది జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారం ఇప్పటికీ  చెల్లించలేదని జనసేనాని తెలియ జేశారు. ఈసారి పరిహారం ఎప్పటికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు, వరదలకు తీవ్రంగా ప్రభావితం అయిన  జిల్లాలలో జనసేన నాయకులు పర్యటించారు. ముంపులో ఉన్న పొలాలను పరిశీలించి, రైతులను పరామర్సించి, పంటలకు జరిగిన నష్ట వివరాలను పవన్ కళ్యాణ్’కి అందించినట్లు జనసేనాని తెలిపారు.

2.71 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బ తిన్నాయి!

ప్రాథమిక అంచనాల ప్రకారమే 2.71 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బ తిన్నాయి. అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలోనే పంటలు నష్టపోయి ఉంటాయని క్షేత్ర స్థాయి పర్యటనకు వెళ్ళిన నాయకులు పవన్’కి తెలియచేశారు. ప్రధానంగా వరి పంట నీట మునిగి కుళ్లిపోతోంది. ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో వరి సాగు చేసిన వారి పరిస్థితి దయనీయంగా ఉంది అని పవన్ తెలిపారు. ఉద్యాన పంటలు వేసిన వారు, కూరగాయలు సాగు చేసేవారు, కడియం ప్రాంతంలోని నర్సరీ రైతులు నష్టాల పాలయ్యారు. ఈ విపత్కర కాలంలో పెట్టుబడి రాయితీలు చెల్లిస్తాం. నష్టాలను లెక్కిస్తాం అనే ధోరణిని ప్రభుత్వం విడిచిపెట్టాలి. రైతులు పెట్టిన పూర్తి పెట్టుబడిని పరిహారంగా చెల్లించాలి అని పవన్ డిమాండ్ చేసారు. తక్షణమే ఆ పరిహారం చెల్లిస్తే తదుపరి పంటకు రైతులు మానసికంగా సంసిద్ధులు అవుతారు. లేని పక్షంలో ఖరీఫ్ లో చేసిన అప్పులు తీర్చేందుకు కొత్త అప్పుల కోసం రైతులు ప్రైవేట్ వ్యాపారులను ఆశ్రయిస్తారు. అప్పుడు రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉంది అని పవన్ వివరించారు.

గత ఏడాది ప్రకృతి విపత్తుల మూలంగా నష్టపోయిన రైతులకు పెట్టుబడి రాయితీ చెల్లించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని వెల్లడిస్తోంది. ఆ నిధులు విడుదల చేస్తున్నామని ప్రకటనలు చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకూ రైతుల ఖాతాల్లోకి మాత్రం సొమ్ములు వెళ్ళడం లేదు అని పవన్ కళ్యణ్ విమర్సించారు.

నిత్యావసరాల కోసం వారంపాటు నీట మునగాలా?

వరద ముంపులో చిక్కుకుపోయిన వారికి రేషన్, పరిహారం చెల్లించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో మానవీయత లోపించింది.నివాసాలు నీట మునిగిపోయి బాధలో ఉన్నప్పుడూ నిత్యావసరాలు అందించి ఆదుకోవాలి. కానీ అలా కాకుండా వారం రోజులపాటు ముంపులో ఉంటేనే వాటిని అందిస్తామని చెప్పడం భావ్యం కాదు. ఈ మేరకు డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ నుంచి వచ్చిన జీవో 19ని ఉపసంహరించు కోవాలి. వరద ముంపు బారినపడ్డ ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలి. అలానే ఉపాధికి దూరమైన కాలానికి పరిహారం ఇవ్వాలి అని జనసేన పార్టీ అధ్యక్షులు డిమాండ్ చేశారు