ఆధిపత్య రాజకీయాలపై అక్షర సందేశం
జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) జనసేన ఆవిర్భావ సభలో (Janasena Formation day) సుమారు ఒక గంటా ముప్పై మూడు (93) నిముషాలు మాట్లాడారు. ఇందులో అయన ఎన్నో కీలకమైన విషయాలను ప్రస్తావించారు.
జనసేన ఆవిర్భావ సభలో కీలకమైన అంశాలు
గంజాయి సాగును నాశనం చేస్తే డీజీపీని ట్రాన్సఫర్ చేసారు.
రాష్ట్రంలో అధికారంలో ఉండే ఒక్కకులమే అధికార ఫలాలు అనుభవిస్తున్నది
ఎస్సీ సబ్ ప్లాన్ విషయంలో దళితులూ తీవ్రంగా నష్టపోతున్నారు.
బీసీలకు అధికార ఫలాలు దక్కడం లేదు.
అణగారిన వర్గాల మధ్య వైసీపీ ప్రభుత్వం గొడవలు పెడుతున్నది.
చనిపోయిన రంగాకి (Vangaveeti Ranga) పూల దండాలు వేయడం వల్ల రాజ్యాధికారం రాదు. బతికున్న స్వచ్ఛమైన నాయకులను మద్దతు నివ్వడం వల్ల రాజ్యాధికారం వస్తుంది.
కాపులు బీసీలు, దళితులతో కలిసి రాజ్యాధికారం పంచుకోవడానికి కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి.
జనసేన అధికారంలోకి వస్తే అవినీతిపరుల కాళ్ళు విరిచి కుర్చోపెడుతుంది.
జనసేన అధికారంలోకి వస్తే అక్రమార్కుల తాట తీస్తా.
జనసేన అధికారంలోకి వస్తే యూనివర్సల్ ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్తుంది
జనాభా నిష్పత్తిలో అధికాల ఫలాలను అన్ని కులాలకు పంచుతుంది.
అయితే వీటి మీద వేటి మీద కూడా మన కుల మీడియాగాని పాలక పార్టీలు గాని చర్చలు పెట్టడం లేదు. మన కుల మేధావులు కూడా తమ అభిప్రాయాలూ చెప్పడం లేదు. కుల నాయకులు కూడా వీటి గురించి మాట్లాడం లేదు.
కానీ కానీ కానీ
పవన్ కళ్యాణ్ రంగాకి టీ ఇవ్వలేదు అంటా. పవన్ కళ్యాణ్ పొత్తులపై స్పష్టత నివ్వలేదు అంటా. అంతే చంద్రబాబుతో పోతున్నట్టేనంటా అనే సొల్లు వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి. దాన్ని మనం నమ్మి నట్టేట మునిగిపోతున్నాం.
రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న గంజాయిపై డీజీపీ ట్రాన్సఫర్ అనే పవన్ ఇచ్చిన స్పష్టత ప్రజలకు ముఖ్యమా. ప్రజలకు ఫ్రీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ముఖ్యమా లేక రంగాకి టీ అలవాటు ఉన్నదా లేదా అనేది ముఖ్యమా?
ఆలోచించండి… తాడిత పీడిత బాధిత వర్గ సోదరులారా! పాలకులు వారి బానిస మేధావులు చేస్తున్న విష ప్రచారాలను ఇకనైనా తిప్పికొట్టండి. లేక పోతే నష్టపోయేది మన బిడ్డలే (It’s from Akshara Satyam)