VijayammaVijayamma

వైసీపీ (YCP) గౌరవ అధ్యక్షురాలి పదవికి విజయమ్మ (Vijayamma) రాజీనామా (Resignation) చేశారు. గౌరవ అధ్యక్షురాలి పదవి నుండి తప్పుకుంటున్నానని ప్లీనరీ సమావేశాల్లో విజయలక్ష్మి ప్రకటించారు. పార్టీ సభ్యత్వం నుంచి కూడా తాను తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పారు.

తెలంగాణలో (Telangana) వైఎస్ షర్మిల (Y S Sharmila) ఒంటరిగా పోరాటం చేస్తున్నది. షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని విజయమ్మ తెలిపారు.

అయితే తల్లిగా జగన్‌కు (Jagan) ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని కూడా విజయమ్మ స్పష్టం చేశారు. జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉంటున్నారు. తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయమ్మ పేర్కొన్నారు.

వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానని విజయమ్మ వివరించారు. ఇలాంటి ఒక రోజు వస్తుందని తాను ఎన్నడో అనుకోలేదు. వైసీపీ అభిమానులు (YCP Cadre) క్షమించాలని విజయమ్మ కోరారు.

నవరత్నాలపై నవ సందేహాలు: జనసేనాని