భక్తులను టీటీడీ (TTDP కులాలవారీగా విభజించి తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనానికి అనుమతిస్తోందని ఒక యూట్యూబ్ ఛానల్ (Youtube Channel) సామాజిక మాధ్యమాల్లో (Social Media) చేస్తున్న దుష్ప్రచారాన్ని టిటిడి తీవ్రంగా ఖండించింది. సదరు యూట్యూబ్ ఛానల్ నిరాధారమైన నిందారోపణలు చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది అని టీటీడీ ఒక ప్రకటన జారీచేసింది.
లాక్‌డౌన్ (Lock Down) సమయంలో 21 రోజులు శ్రీవారికి నైవేద్యం (Srivariki Naivedhyam) సమర్పించలేదని సదరు ఛానల్‌లో ఆరోపించడం పూర్తిగా అవాస్తవం. ఆ సమయంలో కేవలం భక్తులకు దర్శనాలు నిలిపివేశారే తప్ప స్వామి వారికి జరిగే పూజలు, కైంకర్యాలు, నైవేద్యాలు యథాతథంగా కొనసాగాయి అని టీటీడీ వివరించింది.
భక్తులను కులాలవారీగా విభజించి దర్శనం?
సనాతన హిందూ ధర్మాన్ని (Hindu Dharma) వ్యాప్తి చేసి మత మార్పిడులను అరికట్టేందుకు సమరసత సేవా ఫౌండేషన్ సహకారంతో 2021 అక్టోబరు 7 నుండి 14వ తేదీ వరకు రాష్ట్రంలోని వెనుకబడిన మారుమూల ప్రాంతాలకు చెందిన పేద ఎస్సీ, ఎస్టీ, బిసి, మత్స్యకారులను ఉచితంగా తిరుమలకు తీసుకుని వచ్చి… శ్రీవారి బ్రహ్మోత్సవ (Brahmotsava) దర్శనం కల్పించడం జరిగింది. ఇదే తరహాలోనే వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasa) సందర్భంగా తిరుమల (Tirumala) శ్రీవారి ఆలయం వైకుంఠ ద్వార (Vaikunta Dwara) దర్శనం కల్పించేందుకు టిటిడి ధర్మకర్తల మండలి (TTD Board Members) నిర్ణయం తీసుకుంది. అంతేగానీ భక్తులను కులాలవారీగా విభజించి దర్శనం చేయిస్తున్నారని ఆరోపించడం దుర్మార్గం అని టీటీడీ వివరణ ఇచ్చింది.
టిటిడి సొమ్ముతో రాష్ట్ర ప్రభుత్వం (State Government) ఫాస్టర్లను పోషిస్తోందని, జెరూసలెం యాత్ర, హజ్ యాత్రకు నిధులు అందిస్తోందనడం సత్యదూరమైన ఆరోపణ అంటూ టీటీడీ స్పష్టం చేసింది.
గోసంరక్షణ కోసం టిటిడి అనేక చర్యలు
గోసంరక్షణ (Gosamrakshana) కోసం టిటిడి అనేక చర్యలు చేపడుతోంది. తిరుపతి (Tirupati), పలమనేరులోని (Palamaneru) గోశాలల్లో (Goshala) దేశవాళీ గోవుల సంరక్షణతోపాటు వాటి సంతతిని పెంచేందుకు ప్రణాళికలు రూపొందించడమైనది అంటూ టీటీడీ తెలిపింది.
వాస్తవాలు ఇలా ఉంటే భక్తులను తప్పుదోవ పట్టించేవిధంగా తిరుమల పుణ్యక్షేత్రంపై, ప్రపంచం లో ఏ ఇతర ఆలయాల్లో లేని విధంగా ఇక్కడ అమలవుతున్న దర్శన విధానంపై కుట్ర పూరిత అవాస్తవ ప్రకటనలు చేయడం మంచిది కాదని టీటీడీ హెచ్చరిస్తోంది. ఇలాంటి అవాస్తవ ప్రచారాలు ఆరోపణలను భక్తులు విశ్వసించవద్దని టీటీడీ మనవి చేస్తోంది. భక్తులను రెచ్చగొట్టేలా సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి పోస్టులు పెట్టేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది అంటూ తితిదే ఒక ప్రకటన జారీ చేసింది.