why Jagan Reddy as CMwhy Jagan Reddy as CM

ఆంధ్ర ప్రదేశ్ సీఎంగా జగన్ రెడ్డి (AP CM jagan Reddy ) మాకోద్దు బాబోయ్ అంటున్న ప్రజలు అంటూ వచ్చిన జనసేన కార్టూన్ (Janasena Cartoon) వైరల్ అవుతున్నది. జాబ్ క్యాలెండరు ఇవ్వనందుకా, కరెంటు చార్జీలు పెంచుతున్నందుకా, ప్రత్యేక హోదా తేనందుకా. రాజధాని లేనందుకా, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెత్తినందుకా లేక ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేనందుకా? జగన్ రెడ్డి నిన్ను ఎందుకు మళ్ళీ సీఎం గా ఎన్నుకోవాలి అని ప్రశ్నిస్తూ వచ్చిన జనసేన కార్టూన్ వైరల్ అవుతున్నది.

వైసీపీ ప్రభుత్వంపై (YCP Government) ఏపీ సీఎం జగన్ రెడ్డిపై (AP CM Jagan Reddy) జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విడుదల చేస్తున్న జనసేనాని కార్టూన్ (Janasenani Cartoon) పర్వం కొనసాగుతూనే ఉన్నది.

2024 లో రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ వ్యూహాలు చిత్తు అవుతాయి. జగన్ ప్రభుత్వం పడిపోతుంది అనే అర్ధం వచ్చేటట్లు జనసేనాని పవన్ కళ్యాణ్ తన వంగ్య కార్టూన్ల పరంపరను కొనసాగిస్తూనే ఉన్నారు.

జగనన్న ప్రభుత్వంపై జనసేనాని పవన్ కళ్యాణ్ విడుదల చేస్తున్న కార్టూన్లపై వైసీపీ నాయకులు కూడా పవన్ కళ్యాణ్’కి ఘాటుగానే ప్రతిస్పందిస్తున్నారు. మొత్తం మీద ఏపీ రాజకీయాలు వైసీపీ-జనసేనల మధ్య రసవత్తరంగానే కోనసాగుతున్నాయి అని చెప్పాలి.

ఎవరి కోసమయ్యా మీ అలకలు-ఆవేశాలు: అక్షర సందేశం

Spread the love