Sheshu Kumari MakineediSheshu Kumari Makineedi

కాకినాడ జిల్లా పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జి (Janasena Pitapuram Incharge) మాకినీడి శేషుకుమారి (Makineedi Sheshu Kumari) వైసీపీ మంత్రులు, నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ (Strong Counter) ఇచ్చారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ట్వీట్ లో రాష్ట్రంలో జరగవలసిన అభివృద్ధి గురించి చెప్పారు. అలానే రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి (Corruption in AP) గురించి ట్వీట్ చేసారు. జనసేనాని (Janasenani) అలా మాట్లాడితే గుమ్మడి కాయలు దొంగ ఎవరంటే భుజాల తడుముకున్నట్లుగా మన వైసీపీ మంత్రులు (YCP Ministers) స్పందిస్తున్నారు. మంత్రి రోజా, అంబటి రాంబాబు, ఐటీశాఖ మంత్రి భుజాలు తడుము కుంటున్నారని పిఠాపురం నియోజవర్గ జనసేన పార్టీ ఇన్చార్జి మాకినీడి శేషుకుమారి మీడియాలో మండిపడ్డారు.

జరుగుతున్న అవినీతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గళమెత్తితే గొంతు తెగిన మేకలా వైసీపీ మంత్రులు అరుస్తున్నారు. చూస్తూ చూస్తూ మూడు సంవత్సరాలు కాలంగడిచి పోయింది. ఇప్పటికీ పోలవరం ప్రోజెక్టు పూర్తి చేయలేక పోయినందుకు సిగ్గు పడకుండా పవన్ కళ్యాణ్’ని అవమానకరంగా మాట్లాడం మంచి పద్దతి కాదు. రాష్ట్ర భవిష్యత్ (Future of Andhra Pradesh) గురించి ఆలోచించేవారే అయితే మీ నాయకుడి పోలవరం పూర్తిచేసి మాట్లాడమని శేషు కుమారి సవాల్ విసిరారు.

రాజధాని (Capital) పూర్తి చేయలేని నాయకుడిగా మీ నాయకుడు చరిత్రలో మిగిలి పోతారని మోదికి మోకరిల్లి ఆంధ్రులు హక్కు అయిన ప్రత్యేక హోదా మాట మరచి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేసారు అని కుమారి అన్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ నాయకుడి మెప్పు పొందడానికి రోజా హద్దు అదుపులేని విమర్శలు చేస్తున్నది. మంత్రి హోదలో ఉండి దిగజారు విమర్శలు చేయడం ఎంత సిగ్గు చేటో ఆలోచించుకోవాలని మాకినీడి శేషు కుమారి ఘటైన వ్యాఖ్యలు చేసారు.

పచ్చ-నీలి విశ్లేషణలపై తశ్మాత్ జాగ్రత్త: శాంతి సందేశం

Spread the love