ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలలో, సమతామూర్తి విగ్రహావిష్కరణలో
పాల్గొననున్న దేశ ప్రధాని మోడీ
ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్, డీజీపీ
ప్రధానిని స్వాగతించనున్న కేసీఆర్?
వీడ్కోలు పలికే వరకు ఆయన వెంటే: సీఎంవో
దేశ ప్రధాని (Indian Prime Minister) మోడీ (Modi) నేడు హైద్రాబాదు (Hyderabad) విచ్చేస్తున్నారు. పఠాన్ చెరువులోని ఇక్రిశాట్ (ICRISAT) పరిశోధనా సంస్థ స్వర్ణోత్సవాల్లో పాల్గొంటారు. అలానే ముచ్చింతల్ (Muchintal) దివ్యక్షేత్రంలో (Temple) నిర్మించిన సమతా మూర్తి (Statue of Euality) విగ్రహాన్ని ప్రధాని (Prime Minister) ఆవిష్కరిస్తారు.
216 అడుగుల శ్రీరామానుజాచార్యుల (Ramanujacharya) మహా విగ్రహాన్ని శనివారం సాయంత్రం 5 గంటలకు ప్రధాని జాతికి అంకితం చేయ నున్నారు.
చినజీయర్ స్వామి (China Jiyar swamy) ఆధ్వర్యంలో ముచ్చింతలలో ఈనెల 2 నుంచి 14వ తేదీ వరకు శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ధి వేడుకలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాని మోదీ.. తొలుత సమతామూర్తి (Samatha murthy) మహా విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దాదాపు మూడు గంటలపాటు దివ్యక్షేత్రంలో జరిగే పూజా కార్యక్రమాల్లో కూడా ప్రధాని పాల్గొం టారు. యాగశాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకుంటారు.
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ ప్రాంతాన్ని ఎస్పీజీ (SPG) తమ అధీనంలోకి తీసుకుంది. దివ్యక్షేత్రంతోపాటు యాగశాలల చుట్టుపక్కల ప్రాంతాల్లో వేలాదిమంది పోలీసులను మోహరించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్లు చూసేందుకు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ (DGP) మహేందర్ రెడ్డి తదితర ఉన్నత పోలీసు అధికారులు (Police officers) శుక్రవారం ముచ్చింతల్‌కు వచ్చి ఏర్పాట్లను సమీక్షించారు.
హైదరాబాద్‌కు ఓవైపు యాదాద్రి (Yadadri), మరోవైపు ముచ్చింతల్ అద్భుత క్షేత్రాలుగా మారనున్నాయి. ప్రపంచంలోనే వైష్ణవ ఆరాధకులకు ముచ్చింతల్ ప్రధాన క్షేత్రంగా ఉంటుంది.
మూడంతస్తుల భద్రవేది శ్రీరామానుజాచార్యుల మహా విగ్రహ పీఠాన్ని భద్రవేదిగా పిలువనున్నారు. మహా విగ్రహంతోపాటు ఇక్కడ నిర్మాణాలను సంఖ్యా శాస్త్రం ప్రకారం నిర్మించినట్లు చెబుతున్నారు. ఇక్కడే శ్రీరామానుజాచార్యుల జీవిత చరిత్రను చిత్రకళా ప్రదర్శనగా కూడా ఏర్పాటు చేశారు.
ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన ముచ్చింతల్ దివ్యక్షేత్రం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా (Tourist Place) వెలుగొందనున్నది. రూ.1000 కోట్ల వ్యయంతో 2016లో ఈ పోజెక్టు ప్రారంభమైనది. ఈ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు దేశ నలుమూలలకు చెందిన వేలమంది శిల్పులు అహోరాత్రులు శ్రమించి నిర్మించారు.
తరలివచ్చిన ఉద్యోగులతో కిక్కిరిసిన బెజవాడ