రాష్ట్రము (State) ఎదుర్కొటున్న నేటి సమస్త సమస్యలకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లే కారణం అన్నట్లు పవన్ కళ్యాణ్ ప్రత్యర్ధులు ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచారానికి కొంతమంది రచయితలు, మేధావులు కూడా మద్దతు ఇవ్వడం చాలా విడ్డూరం. సినిమాల్లో కధలు రాసేటప్పుడు అభ్యుదయం, అవినీతి మీద పోరాటం అంటూ కధలు రాస్తూ, సినిమాలు తీస్తూ ప్రజలను ఫూల్స్’ని చేస్తూ ఉంటారు. కానీ వీరు నిజజీవితంలో మాత్రం అవినీతికి వంత పాడుతూ, ధర్మం చర అన్నట్లుగా మాట్లాడుతూ సమాజ వినాశకులుగా ఉంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు.
పవన్ పెళ్లిళ్ల వల్ల నష్టం ఎవరికి?
ఒక రాష్ట్రాన్ని పాలించేవాడు అవినీతిపరుడైన (Corruptionist), దుర్మార్గుడు (Cruel) అయినా, రాక్షస స్వభావం కలవాడు అయినా ఆ రాష్ట్రము తీవ్రంగా నష్టపోతోంది. అంతేకానీ చట్టబద్ధంగా చేసికోన్న మూడు పెళ్లిళ్ల (Three Marriages) వల్ల రాష్ట్రానికిగాని, ఆ రాష్ట్ర ప్రజలకు గాని ఏమీ నష్టం లేదు. ఈ విషయం జనసేనుడిని (Janasenudu) విమర్శ చేసే రచయితలకు, మేధావులకు తెలియంది కాదు. వారి స్వార్ధం వారిది. స్వార్ధంతో విషాన్ని కక్కుతూ ఉంటారు.
చట్టబద్ధంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్లిళ్లు చేసికొన్నా లేక 5 పెళ్లిళ్లు చేసికొన్నా రాష్ట్రానికి గాని లేదా సమాజానికి గాని వచ్చే నష్టం లేదు. ఆ పెళ్లిళ్లు వల్ల నష్టం ఆయనని పెళ్లిళ్లు చేసికొన్న ఆ స్త్త్రీ మూర్తులకు ఉంటుంది. అలానే వారి వారి కుటుంబాలకు ఉంటుంది. అలానే పవన్ కళ్యాణ్’కి కూడా ఆ నష్టం ఉంటుంది.
చట్టబద్ధంగా పరస్పరం అంగీకారంతో వారు విడిపోయారు. ఎవరి జీవితాలను వాళ్ళు కొనసాగిస్తున్నారు. అలా విడిపోయిన తరువాత ఆ స్త్రీలపై పవన్ కళ్యాణ్ ఎప్పుడు విమర్శ చేయలేదు. అలానే ఆ విడిపోయిన స్త్రీలు కూడా పవన్ కళ్యాణ్’పై నోరెత్తి విమర్శ చేయలేదు. అటువంటప్పుడు ఆ నలుగురికి లేదా నాలుగు కుటుంబాలకు లేని భాధ పవన్ ప్రత్యర్థులకు ఎందుకు? అలానే కొంతమంది అవినీతి పరులకు వంత పాడుతున్న ఈ అమేధావులకు ఎందుకు?
పవన్ కళ్యాణ్’ని విమర్శ చేయడానికి వేరే కారణం వీరికి దొరకడం లేదు. అందుకే వీరు పవన్ వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి పవన్ ప్రత్యర్ధులు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారా?
రచయితలు (writers) గాని, మేధావులుగాని (Intellectuals), పెద్దలు గాని ఏదైనా ప్రభుత్వ అనినీతిపైన, కక్షపూరిత పాలన ఉంటే వాటిపైనా తమ గళాన్ని విప్పాలి. అలానే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా తమ విమర్శలను చేయాలి. అయితే వీరు అలా చేయడం లేదు. కారణం వీరికి మాత్రం ఆ ప్రశ్నించే ధైర్యం లేదు. కనీసం ప్రశ్నించే వారికి మద్దతు అయినా నివ్వాలి. అయితే వీరికి ఆ గుణము ఉండదు. కానీ ప్రశ్నించే వారిని మూడు పెళ్లిళ్లు, లేదా మరోదో అంటూ ఎగతాళి చేస్తూ తమ అస్థిత్వాన్నే అమ్మేసికొంటున్నారు అని ప్రజలు భావిస్తున్నారు. వీరా మేధావులు, వీరా రచయితలూ అని సమాజం నేడు అసహ్యించుకుంటున్నది.
అయితే నేడు రాష్ట్రము ఎదుర్కొటున్న వివిధ సమస్యలకు కారణం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాలను పాలిస్తున్న పాలకుల చేతకాని తనమా లేక మరేదైనానా అనేది ఈ రచయితలకు, మేధావులకు తెలియాలి? తెలిసికొని ప్రజలకు స్పష్టంగా చెప్పాలి.
సమస్యలకు కారణం పవన్ పెళ్లిళ్ల లేక పాలకులా?
నేడు రాష్ట్రంలో వివిధ సమస్యలు ఉన్నాయి అని సోషల్ మీడియా (Social Media) కోడై కూస్తున్నది. అవి ఏమిటి అనేది ఒక్కసారిగా చూద్దాం. ఈ సమస్యలు అన్నిటికీ కారణం పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లేనా (Pawan Marriages) లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకుడి చేతకాని పరిపాలనా లేక మరేదైనానా అనేది మీరే నిర్ణయించుకోవాలి.
రాష్ట్రంలోని కీలక పదవులన్నీ
రాష్ట్రంలోని కీలక పదవులన్నీ (Key Posts) ఒక సామాజిక వర్గానికే దక్కుతున్నాయి. ఏ పార్టీ ఉంటే ఆ వర్గానికి దక్కుతున్నాయి. మిగిలిన వారికి అధికార ఫలాను దక్కడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం జనసేనాని (Janasenani) మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీలనాయకులు స్వార్ధ రాజకీయాలా?
రాష్ట్రము విడిపోయి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా నేటికీ రాజధాని (Capital) లేదు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
ఇన్ని సంవత్సరాలు కావస్తున్నాఇప్పటికీ రైల్వే_జోన్ (Railway Zone) ఏమైందో తెలియదు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్ల లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న నాయకులు స్వార్ధ రాజకీయాలా?
ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా రాష్ట్రానికి రావలిసిన ప్రేత్యేక హోదా (Special Status) ఇప్పటికీ రాలేదు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా (Cruel Politics)?
పోలవరం నిర్మాణం
ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా పోలవరం (Polavaram) నిర్మాణంపై వస్తున్న ఆరోపణలు ఆగలేదు. నిర్మాణ దశ ఏమిటో ఎవ్వరికీ పూర్తిగా తెలియదు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్ల లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
ఎందరో బలిదానాలతో పోరాడి సాధించుకొన్న విశాఖ (Visakha) స్టీల్ ప్లాంట్ (Steel Plant) అమ్మకాన్ని ఆపలేక పోతున్నాము. దీనికి కారణం దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
రాష్ట్రంలో ఉన్న అస్తవ్యస్త రోడ్లకు కారణం జనసేనాని మూడు పెళ్లిళ్ల లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
రాష్ట్రంలో మద్యపాన నియంత్రణపై (Liquor abolition) ప్రభుత్వం చేతులెత్తేసినట్లు కనపడుతున్నది. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
ప్రజలకు ఉచితంగా దక్కాలిసిన మట్టి, ఇసుక కూడా వేలకు వేలు వేసి కొనుక్కోవాలి అని ప్రజలు వాపోతున్నారు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
పెట్టుబడులు రావడం లేదు
రాష్ట్రంలోకి రావలిసిన పెట్టుబడులు (Investments) రావడం లేదు. పైగా ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయి అని ఆరోపణలు వస్తున్నాయి. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్ల లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
వచ్చిన వెంటానే CPS ని రద్దు చేస్తాను అని ఇచ్చిన హామీ నేటికీ అమలు కాలేదు. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
సంక్షేమ పధకాలు (Welfare Schemes) అతి కొద్దమందికే
ఒక పక్కన సంక్షేమ పధకాలు అతి కొద్దమందికే దక్కుతున్నాయి. మిగిలినవారు విలపిస్తున్న గాని వీరికి ఆ పధకాలు దక్కడం లేదు అనే ఆరోపణలు ఉన్నాయి. మరొక పక్కన నిత్యావస వస్తువుల (Basic commodities) ధరలు ఆకాశాన్ని (inflation) అంటుతున్నాయి అనే వాస్తవాలు ఉన్నాయి. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
పెట్రోల్ రేట్లు (Petrol Rates) పెరుగుపోతున్నాయి. పోర్టులను అమ్మేస్తున్నారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారు. అభివుతుది కుంటుపడింది అనే ఆరోపణలు రోజు రోజుకీ పెరుతుగుతున్నాయి. దీనికి కారణం జనసేనాని (Janasenani) మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
నిరుద్యోగుల (unemployees) మీద శ్రద్ధ ఉండదు. అందరికీ ఉద్యోగాలు అన్నవారు నేడు చేతులు ఎత్తేసారు అనే నిరుద్యోగుల కన్నీటి గాధలు ఉన్నాయి. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
ఒక పక్కన కరెంటు చార్జీలు (current charges) పెంపు. మరొక పక్కన చెత్త పన్ను, బాత్ రూమ్ పన్ను. ఇంకొక్క పక్కన వాహనదారులపై వేస్తున్న పెనాల్టీలు అనే ఆరోపణలు మిన్నంటుతున్నాయి. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
రాష్ట్రము అప్పుల కుప్ప
ఇంకొక పక్కన కొంద్దిమంది కోసమే ఇస్తున్న సంక్షేమ పధకాల కోసం రాష్ట్రము అప్పుల కుప్పగా (debt trap) అవుతున్నది. కానీ ఈ అప్ప్పుల భారాన్ని రాష్ట్రంలో ఉన్న అందరూ భరించాలి అనే ప్రజల ఆవేదన ఉంది. దీనికి కారణం జనసేనాని మూడు పెళ్లిళ్లేనా లేక ఆ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న పార్టీల నాయకులు స్వార్ధ రాజకీయాలా?
పై అన్ని సమస్యలకు పవన్ కళ్యాణ్ చేసికొన్నా మూడు పెళ్లిళ్లేనా లేక రాష్ట్రాన్ని పాలించిన లేక పాలిస్తున్న పార్టీల అధినేతలదా?
రచయితల్లారా? నిజాజీవితంలో నోరెత్తకుండా, కేవలం ఉత్తిత్తి సందేశాల్నిఇచ్చే సినీ పెద్దలారా (Film Faternity) ? మేధావులారా? పౌరులారా? ఒక్క సారి ఆలోచించండి (Its from Akshara Satyam)