KCR at Gandhi jayanthiKCR at Gandhi jayanthi

దసరా రోజున పార్టీ ప్రకటన
డిసెంబరు 9న దిల్లీలో సభ
భాజపాను గద్దె దించడమే ప్రథమ లక్ష్యం
మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో సీఎం కేసీఆర్‌

విజయదశమి నాడు కొత్త జాతీయ పార్టీ ఏర్పాటును ప్రకటిస్తాము. దానికి బీఆర్‌ఎస్‌ తదితర పేర్లను పరిశీలిస్తున్నామని తెరాస అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెల్లడించారు. 5వ తేదీ ఉదయం 11 గంటలకు జరిగే పార్టీ విస్తృతస్థాయి కార్యవర్గ సమావేశంలో 283 మంది సభ్యులు జాతీయ పార్టీ ఏర్పాటును ఆమోదిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేస్తారు. ఆ అనంతరం జాతీయ పార్టీ పేరుని ప్రకటిస్తామని తెరాస పార్టీ సమావేశంలో కెసిఆర్ వెల్లడించారు.

భాజపాయే తమ ప్రధాన శత్రువు. ఆ పార్టీని గద్దె దించడమే తమ మొదటి లక్ష్యమని కేసీర్ అన్నారు. వచ్చే మునుగోడు ఉప ఎన్నికల్లో జాతీయ పార్టీగానే పోటీ చేస్తామని వివరణ నిచ్చారు. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని కెసిఆర్ స్పష్టం చేసారు చెప్పారు.

ఆదివారం ప్రగతి భవన్‌లో మంత్రులు, 33 జిల్లాల పార్టీ అధ్యక్షుల సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడారు. జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు తొలిసారిగా బహిరంగంగా కెసిఆర్ వెల్లడించారు. సుమారు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. జాతీయ పార్టీ ఏర్పాటు అవసరం, కసరత్తు, కార్యాచరణ, ప్రభావాలు, పరిణామాలు, ఇతర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ పలు ఆశక్తికరమైన అంశాలను ప్రస్తావించారు.

దేశం యావత్తు తెరాస వైపు

దేశం యావత్తు తెరాస వైపు చూస్తున్నది. భాజపా దుర్మార్గపు పాలనతో ప్రజలు అష్టకష్టాలు అనుభవిస్తున్నారు. వ్యవస్థలు దెబ్బతిన్నాయి. ప్రతిపక్షంగా కాంగ్రెస్‌ విఫలమైంది. ఈ నేపథ్యంలో దేశం యావత్తూ మనకోసం కోసం ఎదురుచూస్తోంది. దేశంలోని ఇతర పార్టీల నేతలు, మేధావులు, రైతు నేతలు, మీడియా సంస్థల అధిపతులు మన నిర్ణయాన్ని మెంచుకొంటారు. తెరాసగా తెలంగాణను సాధించడంతో పాటు రాష్ట్రాన్ని దేశంలో అగ్రస్థానంలో నిలిపాం. దేశాన్ని ఇదే తరహాలో అభివృద్ధి చేయాల్సిన బాధ్యత మనపై ఉంది అని కెసిఆర్ వివరించారు.

కేంద్ర ఎన్నికల సంఘంతో, న్యాయ నిపుణులతో సంప్రదిస్తాం. అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసికొంటూ మాత్రమే అడువు వేస్తాం. కొత్తగా జాతీయస్థాయి పార్టీ ఏర్పాటు చేస్తే సాంకేతిక సమస్యలు వస్తాయి. అందుకే తెరాసకే జాతీయ పార్టీగా పేరు మారుస్తున్నాం. పేరు మార్చుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని అనుకొంటున్నాం. కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసుకొని ఆమోదం పొందుతాం అని కెసిఆర్ అన్నారు.

విస్తృతంగా పర్యటించేందుకు అన్ని చర్యలు

విస్తృతంగా పర్యటిస్తాను. అందుకే సొంత విమానం కొనుగోలు చేస్తున్నాం. జాతీయ పార్టీ ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో బహిరంగ సభలు, రౌండ్‌ టేబుల్‌ సమావేశాలను వీలైనన్ని ఎక్కువ చోట్ల నిర్వహిస్తాం. డిసెంబరు 9న దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తాం. దానికి అన్ని పార్టీల నేతలను ఆహ్వానిస్తాం. మన ఎజెండాను ప్రకటిస్తాం అని కెసిఆర్ అన్నారు.

రఘుపతి వెంకటరత్నం నాయుడు విశిష్టతపై శాంతి సందేశం