Chiru with PKChiru with PK

ప్రజరాజ్యం పార్టీ (Prajarajyam) అధ్యక్షులు, మాజీ కేంద్ర మంత్రి, మెగాస్టార్ (Mega Star) చిరంజీవిపై (Chiranjeevi) సిపిఐ నారాయణ (CPI Narayana) చేసిన వ్యాఖ్యలపై కాపు సంఘాలు (Kapu Sangalu) విరుచుకు పడ్డాయి. నారాయణని క్షమాపణ చెప్పించాము అని ఆనందపడుతున్నాయి. సంతోషమే.

అయితే ఇదే కులసంఘాలు ద్వారంపూడి & బ్యాచ్ (Dwarampudi & Batch) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మీద చేసిన దూషణలపై ఎందుకు స్పందించలేదు. జనసేన పార్టీ (Janasena Party) అనే నెపంతో కొంతమంది ఒక కులంవారిపై ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి & బ్యాచ్ దాడిచేసినప్పుడు ఇవే కుల సంఘాలు ఎందుకు స్పందించలేదు.

తమ్ముడిపై స్పందించలేదు అని విచార పడాలా లేక అందరివాడు అయిన అన్నయ్యపై స్పందించారు అని ఆనందపడాలా అనే సందిగ్ధంలో ప్రజలు కొట్టు మిట్టాడుతున్నారు? దీనికి కారణం కాపు సంఘాల ద్వంద విధానాలు కావా?

ఎకిలి నవ్వులు నవ్విన ఒక పెద్దమనిషి

చిరంజీవి చేతులు జోడించి నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెట్టకుండా ఎకిలి నవ్వులు నవ్విన ఒక పెద్దమనిషిపై, ఒక పార్టీ అధినేతపై ఆనాడు ఈ కుల సంఘాలు ఎందుకు స్పందించ లేక పోయాయి.

ఇటువంటి వాటిలో కూడా కాపు సంఘాలు స్పందించి ఉంటే..ఇప్పుడు నారాయణ వ్యాఖ్యల మీద స్పందించినందుకు అభినందించేవాళ్ళం. ఈ కాపు సంఘాలు ఉద్దేశం ఏదైనా సరే కొన్ని విషయాల్లోనే స్పందించి, మని కొన్ని విషయాల్లో స్పందించకపోక పోవడం వల్ల పవన్, చిరుల మీద కుల ముద్రవేయడానికి కొన్ని కుల సంఘాలు ఆరాటపడుతున్నాయి అని అనుకోవాలసి వస్తున్నది.

కాపు సంఘాలు చిరంజీవి, పవన్ కళ్యాణ్’లకి దయచేసి దూరంగా ఉండిండి. వారి మీద చేసే దిగజారుడు వ్యాఖ్యలని వారైనా ఖండిస్తారు. లేదా వారి అభిమానులైనా ఖండిస్తారు. ఎల్లప్పుడూ అభిమానులు వారికి కొండంత అండగా ఉంటారు.

మనవారిపై వ్యాఖ్యలు చేసింది ఏపార్టీ వాడో అని మన కుల సంఘాలు చూస్తున్నాయి? స్పందించిన వారి పార్టీని బట్టి స్పందించాలా వద్దా అని మన కుల సంఘాలు ఆలోచిస్తున్నాయి? కొన్ని కుల సంఘాలు కొన్ని పార్టీలపై వ్యతిరేకంగా, మరికొన్ని కుల సంఘాలు మరికొన్ని పార్టీలకు వ్యతిరేకంగా స్పందిస్తున్నాయి. కానీ మెగా అభిమానులు అలా చేయరు. స్పందించే వారి పార్టీని బట్టి కాకుండా అన్ని పార్టీల వారిని సమానంగా చూస్తూ మెగా అభిమానులు (Mega Fans) ఒకేలా స్పందిస్తారు.

కాపు సంఘాలు కొన్నీటీ మీద మాత్రమే స్పందిస్తారు. అది ఎలా అంటే చంద్రబాబు అండ్ టీడీపి (TDP) వారు చేసే వాటి మీద వైసీపి పార్టీకి (YCP) మద్దతుగా ఉండే సంఘాలు స్పందిస్తాయి.

అలానే జగన్ రెడ్డి (Jagan Reddy) అండ్ వైసీపి (YCP) వారు చేసే వాటి మీద టీడీపి (TDP) మద్దతుగా ఉండే సంఘాలు స్పందిస్తాయి, ఆస్పందన కూడా ప్రతిపక్షంలో ఉంటేనే చేస్తారు. వైసీపీ ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి ప్రభుత్వ అనుకూల కాపు సంఘాలు స్పందిచరు.

కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి (Dwarampudi Chandra Shekar Reddy) ఇంటి ముట్టడి కార్యక్రమంలో నేటికి కేసులు ఎదుర్కుంటూ కోర్టుల చుట్టు తిరుగుతున్నవారు ఎందరో ఉన్నారు. వారిలో ఏక్కువ మంది జనసేన నాయకులు, కార్యకర్తలు, పవన్ అభిమానులు ఉన్నారు. కష్టమో నష్టమో వాటిని వారే భరిస్తున్నారు.

కుల సంఘాలకు చెప్పేది ఒక్కటే…

చివరిగా ఈ కాపు కుల సంఘాలకు చెప్పేది ఒక్కటే. కాపు కులానికి సంబందించి చాలా సమస్యలు ఉన్నాయి. మీకు వీలుంటే వాటి మీద పోరాడండి. కాపులకి 2 వేల కోట్లు ఇస్తాను అని హామీ ఇచ్చిన వైసీపీ అధికారంలోకి వచ్చాక సర్వజనులకి ఇచ్చే పించన్లని (Pensions) కూడా కులం పేరుతో విడదీసి 2 వేల కోట్ల లెక్కలో చూపెడుతున్నారు. వాస్తవంగా ఇచ్చేది 100 కోట్లు కూడా లేవు అనే ఆరోపణలు ఉన్నాయి. అందరికి ఇచ్చే పధకాలని కులం పేరుతో ప్రత్యేకంగా చూపిస్తున్నారు అని అంటున్నారు. మన కుల సంఘాలకు చేతనైతే ధైర్యం ఉంటే ఇంటువంటి వాటి మీద పోరాడండి.

అంతే కానీ సమాజం కోసం పోరాడే చిరంజీవికి, పవన్ కళ్యాణ్’ల మధ్య విభన తీసికొచ్చేలా, లేదా మెగా సోదరులకు (Mega Brothers) కుల ముద్ర (Kula mudra) వేయడానికి అన్నట్లు ఈ కుల సంఘాలు ప్రయత్నం చేయడం మానుకోండి.

— ప్రసాద్ చిగిలిశెట్టి, ప్రవాసాంధ్రుడు (Prasad Chigilisetty, NRI)

భారత నూతన రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపదీ ముర్మూ