ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎస్ఐ సాగర్ బాబు
దాతల సహకారంతో త్వరలో 18 సైకిల్లు అందజేస్తాం: వలవల తాతాజీ
సమాజానికి సేవ చేయాలన్న సంకల్పంను ఆచరణలో చూపడం వలవల తాతాజీ వ్యక్తిత్వంలోని ఆదర్శం. వారధి ట్రస్ట్ ద్వారా తాతాజీ ఆధ్వర్యంలో దాతల తోడ్పాటుతో సమాజ సేవకు కృషి చేస్తున్న ట్రస్ట్ సభ్యులు మరియు దాతలు అభినందనీయులని… జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఎం.సాగర్ బాబు అన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ నాల్గవ వార్డ్ ఇందిరానగర్ కాలనీలోని ఎంపీపీ పాఠశాల ప్రాంగణంలో సైకిళ్ళ పంపిణీ కార్యక్రమం జరిగింది.
వారధి ట్రస్ట్ వ్యవస్థాపకులు వలవల తాతాజీ ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థిని ముప్పిడి కుసుమకు సైకిల్ అందచేశారు. స్థానికులు వాశంశెట్టి ప్రసాద్ వితరణతో ఈ సైకిల్ ను అందజేసే కార్యక్రమం గురువారం ఉదయం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న సాగర్ బాబు మాట్లాడుతూ ఇందిరానగర్ కాలనీ నుండి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే 18 మంది బాలికలకు సైకిళ్ళు అందించాలన్న వలవల తాతాజీ ఆలోచనకు కార్యరూపం అందించిన దాతల దాతృత్వం గొప్పదని అన్నారు.
అనంతరం ఎస్ ఐ సాగర్ బాబు చేతుల మీదుగా ముప్పిడి కుసుమకు వారధి ట్రస్ట్ ద్వారా వలవల తాతాజీ నేతృత్వంలో సైకిల్’ను అందజేశారు. వలవల తాతాజీ మాట్లాడుతూ 18 సైకిళ్ళు పంపిణీలో భాగంగా ఈరోజు రెండవ సైకిల్ ను అందజేసామని, ఫిబ్రవరి 9, శ్రీఅభయాంజనేయ స్వామి వార్షికోత్సవం లోపు 18 సైకిళ్ళు దాతల తోడ్పాటుతో అంద జేస్తామని ఈరోజు సైకిల్ వితరణ చేసిన దాత వాశంశెట్టి ప్రసాద్ కు ధన్యవాదాలు తెలిపారు.
వలవల తాతాజీకి, వారధి ట్రస్ట్’కు, దాతకు విద్యార్థిని కుసుమ ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ధనకుమార్, మద్దిపాటి శ్రీను, షేక్ మస్తాన్, తుమ్మల శివ ఉపాధ్యాయులు ఎం శ్యామల, వీ రమాదేవి,ఏ విజయ్ మరియు పి నాగమణి, పి ఇందిర, ఎం కాంతమ్మ, పి. వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
— జంగారెడ్డిగూడెం నుండి గరువు బాబురావు