Babu as AP CMBabu as AP CM

నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, కొణిదెల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం కన్నుల పండుగగా ముగిసింది. చంద్రబాబు నాయుడుతో పాటు 25 మంది మంత్రులుగా ప్రమాణం చేశారు.

నేటి ఆంధ్ర ప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువు ప్రముఖులు విచ్చేసారు. లక్షల మంది తెలుగు తమ్ముళ్లు, జనసైనికులు, బీజేపీ కార్యకర్తల హర్షద్వానాల మధ్య ఏపీ నూతన ప్రభుత్వ ప్రమాణ స్వీకార మహోత్సవం ముగిసింది. మొదటిగా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు చేతే రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చూపించారు. అనంతరం కొనెడల పవన్ కళ్యాణ్ చే రాష్ట్ర మంత్రిగా, రాష్ట్ర గవర్నర్ ప్రమాణం చూపించారు. తదనంతరం తతిమ్మా మంత్రులు ఒక్కొక్కరుగా ప్రమాణం చేశారు.

ఆంధ్ర ప్రదేశ్ మంత్రులుగా ప్రమాణం చేసిన వారి వివరాలు:

పవన్ కళ్యాణ్
నారా లోకేష్
కింజరపు అచ్చెము నాయుడు
కొల్లు రవీంద్ర
నాదెండ్ల మనోహర్
పొంగూరు నారాయణ
అనిత వంగలపూడి
సత్య కుమార్ యాదవ్
డాక్టర్ నిమ్మల రామానాయుడు
మహమ్మద్ ఫరూఖ్
ఆనం రామనారాయణ రెడ్డి
వయ్యావుల కేశవ్
అనగాని సత్య ప్రసాద్
కొలుసు పార్థ సారధి
డాక్టర్ డోలా బాలావీరాంజనేయ స్వామి
గొట్టిపాటి రవికుమార్
కందుల దుర్గేష్
గుమ్మడి సంధ్య రాణి
బీసీ జనార్ధన రెడ్డి
టీ జి భరత్
ఎస్ సవితమ్మ
వాసంశెట్టి సుభాష్
కొండపల్లి శ్రీనివాస్
మండిపల్లి రామ్ ప్రసాద్

 

 

మోదీ టీంకు శాఖలు కేటాయింపు – కీలక శాఖలన్నీ బీజేపీకే!

Spread the love