మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) 156 వ చిత్రం ఖరారు అయ్యింది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య (DVV Danayya) నిర్మిస్తున్నారు. చిరు యువ హీరోలకు పోటీగా వరుస సినిమాలు ప్రకటిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) ఇప్పటికే మూడు చిత్రాలతో బిజీగా ఉన్నారు. అయినప్పటికీ చిరు మంగళవారం మరో చిత్రాన్ని ఖరారు చేశారు. చిరు 156 (working title)గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి ఛలో ఫేం వెంకీ కుడుముల దర్శకత్వం వహించ నున్నారు. డాక్టర్ మాధవి రాజు సహనిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
త్వరలోనే ప్రారంభంకానున్న ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు రాబోయే రోజుల్లో తెలియ నున్నాయి. కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో చిరు నటించిన ‘ఆచార్య’ చిత్రం 2022 ఫిబ్రవరి 4న విడుదల కానున్న విషయం తెలిసిందే.