మరణించిన కౌలు రైతులకు అండగా జనసేన (Janasena) ఉంటుంది అని జనసేనాని (Janasenani) పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం (Jagan Government) అధికారంలోకి వచ్చాక కౌలు రైతుల (Tenant Farmers) ఆత్మహత్యలు (Suicides) విపరీతంగా పెరిగాయని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ (YCP) అధికారంలోకి వస్తే ఆత్మహత్యకు పాల్పడ్డ కౌలు రైతు కుటుంబానికి రూ.7 లక్షల నష్టపరిహారం అందిస్తామని జగన్ హామీ ఇచ్చారు. కానీ ఇవాళ తమ హామీని జగన్ ప్రభుత్వం (Jagan Government) పెడచెవిని పెట్టింది అని పవన్ అన్నారు.
అధికారంలోకి వచ్చిన మొదట ఏడాది నామమాత్రంగా జగన్ ప్రభుత్వం సాయం చేసింది. అయితే గత రెండేళ్లుగా సాయం చేయకుండా ముఖం చాటేసిందనిజనసేనాని స్పష్టం చేశారు. జనసేన పార్టీ చనిపోయిన ప్రతి కౌలు రైతు కుటుంబానికి అండగా ఉంటుందని, వారికి కొంతైనా ఊరటనివ్వాలనే ఉద్దేశంతో ప్రతి కుటుంబానికి రూ. ఒక లక్ష ఆర్థిక సాయం సాయం చేస్తుంది అని పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటే బాధనిపిస్తోంది. పోరాట యాత్ర, మండపేట పర్యటన, కాకినాడ రైతు సౌభాగ్య దీక్షలో, నివర్ తుపాన్ సమయంలో స్వయంగా కౌలు రైతులతో మాట్లాడాను. వారు పడుతున్న బాధలు విని భాధ అనిపించింది. ఈ రోజు మనం తినే 80 శాతం తిండి కౌలు రైతు కష్టం, శ్రమ నుంచి వచ్చిందే. ఈ రోజు మన రాష్ట్రాన్ని అన్నపూర్ణ అంటున్నామంటే దానికి కారణం కౌలు రైతే. వాళ్లు కష్టపడి మన కడుపు నింపినందుకు వాళ్లకు మనమిచ్చే బహుమతి 3 వేల చావులా అని జనసేనాని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతుల పొట్టకొట్టి మిల్లర్లు, దళారులు లాభపడుతున్నారు
భూములను కౌలుకు తీసుకొని, ఎరువుల నుంచి విత్తనాల వరకు అప్పులు చేసి వ్యవసాయం చేస్తే కనీసం పండిన పంటకు గిట్టుబాటు ధర కూడా వచ్చే పరిస్థితి లేదు. చేసిన అప్పులు తీర్చడానికి, భార్య, పిల్లల కడుపు నింపడానికి పండిన పంటను రైతు నష్టానికి అమ్ముకుంటున్నాడు. రైతు దగ్గర నుంచి మిల్లర్లు, దళారులు ధాన్యం బస్తా రూ.700కు కొంటున్నారు. ఆ తరువాత దానిని రూ. 1400కు దళారులు అమ్ముకొని లాభం చేసుకుంటున్నారు.
బాధిత కుటుంబాలను ప్రభుత్వం అట్టించుకోవడం లేదు
ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలను పరామర్శించడానికి అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా వెళ్లలేదు. మనం ఏదైనా మాట్లాడితే మన మీద విరుచుకుపడతారు తప్ప రైతుకు అండగా నిలబడటానికి ఏపీ ప్రభుత్వం మాత్రం ముందుకు రావడం లేదు. రైతు ఆత్మహత్యకు పాల్పడితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర రూ. కోటి నిధి ఉంటుంది. అయినా ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు కూడా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదు అని పవన్ విరుచుకు పడ్డారు.
నష్టపరిహారం ఇచ్చే వరకు జనసేన పోరాడుతుంది
ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. ఆత్మహత్యలకు పాల్పడ్డ రైతు కుటుంబాలకు జనసేన పక్షాన రూ. లక్ష ఆర్ధిక సాయం చేయాలని నిర్ణయించాం. ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని వెళ్లి పరామర్శించి ఆర్థిక సాయం (Financial assistance) అందిస్తాను అని జనసేనాని కౌలు రైతు కుటుంబాలకు హామీ ఇచ్చారు. కౌలు రైతు కుటుంబాలు బాగుండాలి, వారికి భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆర్థిక సాయం అందిస్తున్నాం. కౌలు రైతులకు మేమంతా అండగా ఉంటాం. మీరు ఎలాంటి ఆత్మహత్యలకు పాల్పడొద్దు అని రైతులకు, కౌలు రైతులకు ధైర్యాన్ని నింపడానికి పవన్ప్ర కళ్యాణ్ ప్రయత్నం చేసారు.