Nadendla Manohar at Party officeNadendla Manohar at Party office

రూ.800 కోట్లు ఎటు మళ్లించారో సీఎమ్ సమాధానం చెప్పాలి

జీపీఎఫ్ డబ్బులు (Money in GPF accounts) మాయం చేయడమంటే ఉద్యోగులను మోసగించడమేనని జనసేన పార్టీ (Janasena Party) ఆరోపించింది. వైసీపీ ప్రభుత్వ (YCP Government) పెద్దలకు సూట్ కేసు కంపెనీలు పెట్టి, దొంగ లెక్కలు రాసిన అనుభవంతో కాగ్ (CAG) కళ్ళకు గంతలు కట్టేలా నివేదికలు ఇస్తున్నారు. పథకాల లబ్ధిదారుల లెక్కల్లోనూ మాసిపూసి మారేడుకాయ చేస్తోందని నాదెండ్ల మోనోహర్ విమర్శించారు.

ఇప్పుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన జీపీఎఫ్ (GPF) సొమ్ములను వారికి తెలియకుండా ప్రభుత్వమే మాయం చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇప్పటి వరకూ వెలుగులోకి వచ్చిన లెక్కల ప్రకారం రూ.800 కోట్లు సొమ్మును ప్రభుత్వం మళ్లించింది. ఉద్యోగుల ఖాతాల్లో ఉన్న ఈ డబ్బులు వారికి తెలియకుండా తీసేసుకోవడం అంటే మోసం చేయడమే. వైసీపీ ప్రభుత్వ ఆర్థిక పాలన ఆశ్చర్యం కలిగిస్తోందని మనోహర్ విస్మయం వ్యక్తం చేసారు.

జీపీఎఫ్ ఖాతాలోని డబ్బులను డ్రా చేసుకొనే అధికారం కేవలం ఉద్యోగికి మాత్రమే ఉంటుంది. ప్రభుత్వం ఆ నిధికి కేవలం కస్టోడియన్ మాత్రమే. కాపలాదారే దోపిడీకి పాల్పడితే ఎలా? వైద్య ఖర్చులకో, బిడ్డ పెళ్ళికో, చదువులకో పీఎఫ్ డబ్బుల కోసం దరఖాస్తు చేస్తే నెలల తరబడి అనుమతి ఇవ్వకుండా వైసీపీ ప్రభుత్వం పెండింగ్లో ఉంచుతున్నది. కానీ ఆ ఉద్యోగుల సొమ్మును (Employees Money) వారికి తెలియకుండానే నేడు తీసేసుకొంటోంది. అంటే ఈ పాలకుల ఆర్థిక క్రమశిక్షణ ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఉద్యోగులకు కరవు భత్యం పీఎఫ్ ఖాతాలో (PF accounts) వేసినట్లే వేసి, తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా ఆ ఉద్యోగులనుమోసం చేయడమే అవుతుంది. అలాగే రిటైర్ అయిన ఉద్యోగులకు కూడా రావాల్సిన బెనిఫిట్స్ కూడా ఇవ్వకుండా నిలుపుదల చేస్తోంది. రూ.800 కోట్లను ఎటు మళ్లించారో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అని నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) డిమాండ్ చేసారు.

సామాన్యుడి గళం వినిపించేలా జనసేన ‘జన వాణి’