Jagain on New DistrictsJagain on New Districts

వచ్చే ఉగాది (Ugadi) నాటికి కొత్త జిల్లాలు (New Districts) ఏర్పాటు పూర్తి కావాలని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) ఆదేశించారు. కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు కొత్త జిలాలనుడి సాగించాలని ఉన్న‌తాధికారుల‌ను ముఖ్యమంత్రి జగన్‌ (Chief Minister Jagan) ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటుపై ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ నేడు స‌మీక్షా స‌మావేశం (Review meeting) నిర్వ‌హించారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు అవసరమైన వనరులపై సీఎం సమీక్షించారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, సీఎం ముఖ్య సలహాదారు అజేయ కల్లాం, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌ కుమార్‌ ప్రసాద్, తదితర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ సంద‌ర్భంగా సీఎం జగన్ మాట్లాడారు. ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని, వారికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుంది అని జగన్ అన్నారు. పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుంది అని జగన్ అన్నారు. ప్రస్తుత 13 జిల్లాల‌ను 26 జిల్లాలు చేస్తూ ఏపీ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రజల నుంచి సలహాలు, సూచనలు కూడా కోరింది. వీటిపై ఏమైనా అభ్యంతరాలు (Objections) ఉంటే ఈ నెల 26 వరకు తెలియజేయవచ్చు.

కాపులపై బీజేపీ అనూహ్యపు ఎత్తుగడ – ఇరకాటంలో జగన్!

Spread the love