ఈటల రాజేందర్ ఘన విజయం
హుజురాబాద్ (Huzurabad) ఉపఎన్నికలో (By Election) బీజేపీ (BJP) అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajendar) ఘన విజయం సాధించారు. 22వ రౌండ్‌లోనూ బీజేపీ ఆధిక్యంలో నిలిచింది. 22వ రౌండ్‌లో 1333 ఓట్ల లీడ్‌ను బీజేపీ సాధించింది. 22 రౌండ్లు ముగిసిన తర్వాత ఈటెల రాజేంద్రకు మొత్తం 107022 ఓట్లు వచ్చాయి. 23,855 ఓట్ల ఆధిక్యంతో ఈటల రాజేందర్ తన సమీప ప్రత్యర్థిపై భారీ విజయాన్ని సాధించారు.
తెరాస (TRS) విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్’కు ఈ ఎన్నికల్లో 83,167 (40.38శాతం) ఓట్లు రాగా… 2018 డిసెంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 1,04,840 (59.34 శాతం) ఓట్లు వచ్చాయి.
ఉప ఎన్నిక ఫలితాల్లో నోటాకు 1,036 ఓట్లు వచ్చాయి. 2018 ఎన్నికల్లో 2,867 ఓట్లు వచ్చాయి. అప్పుడు బీజేపీ అభ్యర్థి పుప్పాల రఘుకు 1,683 ఓట్లు వచ్చాయి. అప్పుడు నోటా కంటే తక్కువగా ఉన్న బీజేపీ ఇప్పుడు అసెంబ్లీ స్థానాన్ని కైవసం చేసుకుంది.