Pawan Kalyan Legal Cell PratapPawan Kalyan Legal Cell Pratap

జనసేన పార్టీకి (Janasena Party) గాజు గ్లాసును (Glass Tumbler) గుర్తుగా ఖరారు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం (Election Commission) ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ఉత్తర్వులు ఈ-మెయిల్ ద్వారా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయానికి చేరాయి.

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తును కేటాయించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘానికి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.

గత సార్వత్రిక ఎన్నికలు, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గాజు గ్లాసు గుర్తుపైనే జనసేన అభ్యర్ధులు పోటీ చేసిన విషయం విదితమే.

అదే విధంగా ఈ సారి ఎన్నికల్లో కూడా గాజు గ్లాసు గుర్తుతోనే జనసేన అభ్యర్ధులు ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఈ ఉత్తర్వు కాపీలను పార్టీ లీగల్ సెల్ ఛైర్మన్ ఇవన సాంబశివ ప్రతాప్ బుధవారం పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి అందచేశారు.

నాన్నా లోకేశా! మా కళ్ళు తెరిపించినందుకు ధన్యులం

Spread the love