“కొమరం పులి” (Komaram Puli) లాంటి “వకీల్ సాబ్” (Vakeel Saab)”కి “సుస్వాగతము” (Suswagatam)
“అక్కడ అమ్మాయి (పచ్చ పార్టీ) ఇక్కడ అబ్బాయి (ఛీపీ పార్టీ)” రహస్య ఒప్పందములో భాగముగానా అన్నట్లు తెలుగు తల్లిని విడగొట్టి నడి రోడ్డున పడేసిన భాధలొంచి పుట్టినదే “జనసేన” (Janasena).
పచ్చకులంలో ఉన్న రావణుడిని “గోకులంలో సీత” (Gokulam lo seetha) అంత ప్రవిత్రుడు అని భ్రమించి, మద్దతునిచ్చి పచ్చ పార్టీకి (Pacha Party) నాడు వెన్నంటి నిలిచావు.
అది పచ్చ రావణుడిపై ప్రేమకాదు… బులుగు దుర్యోధన పాలనకు అడ్డుతలిగే వకీలు సాబు వ్యూహం అని ప్రజలకు తెలుపలేక పోయావు.
“తమ్ముడు” “బద్రి” ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథము!
తొలిసారి స్వతంత్రముగా పార్టీపెట్టిన “తమ్ముడు” “బద్రి” ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథము పడుతూ “తోలి ప్రేమ” చూపుతూ అండగా ఉన్నారు. అయినా పచ్చ బాబుకి అండగా నిలబడి పచ్చ పార్టీకి నాడు అధికారము కట్టబెట్టావు.
జనసేనుని (Janasenudu) అండతో వచ్చిన అధికారంతో “ఖుషీ”గా ఉన్న బాబు జనసేనుడిని “జానీ” జానీ ఎస్ పాపా అనే రాజకీయము తెలియని పిల్లాడిలా చూసాడు. అమాయకపు ప్రజలను, వారి సమస్యలను నాటి ప్రభుత్వము నిర్లక్ష్యము చేయడము జరిగింది.
“గోపాలా గోపాలా” మమ్ము ఆదుకోవయ్యా అంటూ రాష్ట్ర నలుమూలలనుండి వస్తున్న ప్రజలకు మద్దతుగా జనసేనుడు నాడు “అజ్ఞాతవాసి”గా మాత్రమే మీరు వస్తూ ఉండేవారు.అయినా జనసేనాని పచ్చ పార్టీని పాతాళంలోకి నెట్టగలిగారు. కానీ అజ్ఞాతవాసి అజ్ఞాతంలోకి వెళ్ళాలిసి వచ్చింది. అయినా “కొమరం పులి”లా గర్జిస్తున్నావు. కానీ సేనాని పోరాటాలు జనాల్లోకి వెళ్లడం లేదు అని మీరు గ్రహించడం లేదు.
మా “బాలు” “బంగారము” అని జనసేనుడుని స్తుతిస్తూ ఉంటే “అజ్ఞాతవాసి”గానే ఉంటాడు అని పచ్చ బాబు భావించి జనసేనానిని నిద్రపుచ్చడానికే ప్రయత్నము చేస్తూ వచ్చాడు. కానీ గబ్బర్ సింగ్’లా పచ్చ పార్టీని ఒక ఆట ఆదుకొంటాడు అని పచ్చ బాబుగాని, చంద్రన్న మీడియా (Pacha Media) గాని నాడు తెలిసికోలేక పోయారు.
కుల మీడియా తొక్కేస్తూ ఉంటే
అలానే శారీరకంగా, మానసికముగా ప్రజలని బాధిస్తూ, “జల్సా” చేసికొంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకముగా “శంకర్ దాదా జిందాబాద్” వలే జనసేనాని తిరిగబడతాడు అని కూడా చంద్రన్నగాని, చంద్రన్న మీడియా గాని నాడు ఊహించలేదు. కానీ నీ పోరాటాలను అవినీతి పునాదులపై వచ్చిన కుల మీడియా తొక్కేస్తూ ఉంటే, చూస్తూ ఉండిపోయావు.
తన సుఖాలను మరిచి, ప్రజల కష్టాలనే తలుచుకుంటూ, వేదనతో, ఆవేదనతో మీ పార్టీ ఆవిర్భావ సభలో “కొమరం పులి” వలే జనసేనుడు “పంజా” విసిరి పాతుకు పోయిన పచ్చ పార్టీని అతని పరివారాన్ని “తీన్ మార్” డాన్స్ ఆడించావు.
“అజ్ఞాతవాసి”గా ఉంటాడు అనుకొన్నారు. కానీ “కాటమరాయుడు” “గుడుంబా శంకర్” వలే నువ్వు చెలరేగిపోతూ, “గబ్బర్ సింగ్” వలే నాటి అవినీతి పాలకుల పాపపు చిట్టాలను విప్పుతూ తన అప్రతిహత యాత్ర కొనసాగించావు. కానీ పార్టీ ఓడి, శ్రేణులను నిరాశ పర్చావు.
జనసేన ఓడి వ్రతం చెడ్డది. కానీ పచ్చ పార్టీని పాతాళంలోకి నెట్టి ఫలితం దక్కింది. ఇది వకీల్ సాబు వ్యూహం అని… బులుగు దుర్యోధనుని ఆరాధకులకు తెలియలేక పోతున్నావు.
అయితే బులుగు దుర్యోధనుని అధర్మ పాలనపై “బీదల నాయక్’గా సేనాని పోరాడాల్సి ఉంది. కానీ “కెమెరామెన్ గంగతో రాంబాబు”లా పాలితుల జాతకాలను బయటపెడుతూ ట్విట్టర్ వార్, ప్రెస్ నోటు యుద్ధాలు మాత్రమే చేస్తున్నావు.
“జనసేనుడు” పోరాటాలు ఇంతితై వటుడింతై అన్నట్లు నానాటికి పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. “కాటమ రాయుడు” పార్టీపై, వకీలు సాబు వ్యూహాలుపై, ‘బీమ్లా నాయక్” నిజాయితీపై వివిధ నాయకుల, ప్రజల చూపులు ఎక్కువ అవుతున్నాయి. మార్పు మొదలు అయ్యే సూచనలు కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కానీ దీన్ని ఉపయోగించుకొనే వ్యూహాలు మాత్రం జనసేనానిలో (Janasenani) కరవు అవుతున్నాయి.
అయితే “గోపాల గోపాలా”!
“అత్తారింటికి దారేది” అన్నట్లు “జనసేన పార్టీకి దారేది” అంటూ సమస్త జనులు, నాయకులు, పార్టీలు “జనసేన” పార్టీవైపు దారి కట్టే రోజు రావాలి. దానికి “సర్దార్ గబ్బర్ సింగ్” కోట దారులు ఇకనైనా తెరుచుకోవాలి. చుట్టూ ఉన్న నివురుని తోసి యోధుడిలా ప్రజల్లో తిరగడం ఇంకా పెరగాలి. నేను అజ్ఞాత వాసిని కాదు. అవినీతి రాజకీయ అజ్ణానుల భరతం పట్టే శతధృవ వంశ యోధుడిని అని జనసేనుడు నిరూపించుకోవాలి.
నవరంధ్రాలోతో వస్తున్ననవ రత్నాలు కాదు ముఖ్యం. మనిషిని బిక్షగాడిని చేసే పధకాలు కాదు ముఖ్యం. మనిషి స్వయం సమృద్హితో అభివృద్ధి చేయగలిగే పధకాలు కావాలి. అనే హామీలతో మీ అప్రతిహత యాత్ర పునః ప్రారంభించాలి.
జనసేన పోరాటాలు మరింత దూకుడుతో కొనసాగిస్తారని, రాజ్యాధికారం సాధిస్తారని, తద్వారా రాజకీయాల్లో మార్పు తీసికొస్తారని జనసైనికులంతా కళ్ళు కాయలు కాచేలా చూస్తున్నారు. అదే జరిగితే అదే మాకు “అన్నవరం” అంటూ జనమహిళలు కూడా “సుస్వాగతము” చెబుతున్నారు.
ఇప్పటికైనా “పవరున్న స్టార్” ప్రెస్ నోటులతో సరిపెట్ట కూడదు. వ్యవస్థలను ప్రక్షాళన చేయగలిగే మరిన్ని పోరాటాలు చేయగలగాలి. అలా చేయగలిగిన రోజు తొందరలోనే రావాలి. అప్పుడే
“కళ్యాణవంతమైన పవనాలతో” తెలుగు గడ్డ పులకించి పోతుంది. అప్పుడే చలి చీమల (Ants) ఆక్రందనలకి “వకీలు సాబు” న్యాయం చేసిన వారు అవుతారు. అప్పుడే ప్రతీరోజు ప్రతిఒక్కరికి “కల్యాణవంతమైన పవనాలతో” పుట్టిన రోజు పండుగ.
జనంలోకి రావడానికి ఆపసోపాలు పడుతున్నఅర్జనుడు లాంటి ఓ యోధుడా! జనసేనానీ!
శతమానం భవతి శతాయుష్మాన్ భవ…
ఇది Akshara Satyam ఆవేదన మాత్రమే కాదు. యావత్తు అణగారిన వర్గాల యువత గుండె చప్పుడు.
–Akshara Satyam, Its voice of the suppressed
(Supreme Court directions on Cases pending against Peoples representatives)
Wish him a very happy birthday