Route map for Machilipatnam meetingRoute map for Machilipatnam meeting

తుది దశకు ఆవిర్భావ సభ ఏర్పాట్లు
శ్రీ పొట్టి శ్రీరాములు పుణ్య వేదికగా సభ వేదికకు నామకరణం
సభ నిర్వహణ వాలంటీర్లతో వేదిక వద్ద మాట్లాడిన నాదెండ్ల మనోహర్

ఒక పక్కన పోలీసు ఆంక్షలు (Police conditions) మరొక పక్కన తగ్గేదేలే అంటున్న జనశ్రేణుల ఘీంకారాలు (Janasainiks) మధ్య జనసేన పార్టీ (Janasena Party) పదో ఆవిర్భావ సభ ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయి. 34 ఎకరాల సువిశాల ప్రాంగణంలో కనీవినీ ఎరుగని రీతిలో సభాస్థలి ముస్తాబు అయ్యింది. ఎక్కడా ఇబ్బందులు లేకుండా ప్రత్యేకంగా అన్ని వసతులతో సభా ప్రాంగణం సిద్ధం అయ్యింది. సభ వేదికకు అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు (Potti sriramulu) పుణ్య వేదికగా నామకరణం చేశారు.

సభకు వచ్చే వాహనాలు పార్కింగ్ కోసం ప్రత్యేకంగా నియోజకవర్గాల వారీగా స్థలం కేటాయించడం జరిగింది. తాగునీటి సదుపాయం, వైద్య సదుపాయం, మరుగుదొడ్లు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సోమవారం సాయంత్రం సభా ప్రాంగణాన్ని పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. సభా ప్రాంగణం మొత్తం కలియతిరిగి మొత్తం ఏర్పాట్లు గురించి కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కడ ఏ ఏర్పాట్లు జరుగుతున్నాయో స్వయంగా పరిశీలించారు.

వాలంటీర్లకు సూచనలు

సభా వేదిక పరిశీలన అనంతరం అక్కడే ఉన్న ఆవిర్భావ సభ వాలంటీర్లతో మనోహర్ గారు మాట్లాడుతూ ” ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆవిర్భావ సభకు వాలంటీర్ల సేవలు చాలా కీలకం. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే జనసైనికులు, వీర మహిళలకు ఎక్కడ ఇబ్బంది కలగకుండా వాలంటీర్లు పనిచేయాలి. నిబంధనల ప్రకారం పక్కాగా వ్యవహరించండి. సభకు వచ్చిన ప్రతి ఒక్కరినీ గౌరవించి, వారిని ప్రత్యేకంగా చూసుకోవడం వాలంటీర్ల బాధ్యత. పార్టీ ప్రతిష్ట పెంచేలా వాలంటీర్లు సేవలు ఉండాలి. పూర్తిస్థాయి లో సమన్వయం చేసుకొని పని చేయండి. కార్యక్రమాల నిర్వహణ ఆ కమిటీ సూచనలు తీసుకోండి. పోలీసు శాఖకు సహకరించి, సభ సజావుగా సాగేలా చూడాలి.

ప్రత్యేక గీతం విడుదల

గబ్బర్ సింగ్ టీం ఆవిర్భావ సభ కోసం ప్రత్యేకంగా తయారు చేయించిన గీతాన్ని మనోహర్ సోమవారం సభ వేదిక వద్ద విడుదల చేశారు. భగభగ మండే భగత్ సింగ్ అంటూ వచ్చే గీతం అందరిలో స్ఫూర్తి నింపేలా ఉంటుందని ఈ సందర్భంగా మనోహర్ గబ్బర్ సింగ్ టీంకు శుభాకాంక్షలు తెలియజేశారు. సభా వేదిక వద్ద మనోహర్ సమక్షంలో మచిలీపట్నం నియోజకవర్గానికి చెందిన వివిధ పార్టీల నాయకులు జనసేన పార్టీలో చేరారు.

బీసీలంతా మోసపోతున్నాం. చేయూత నివ్వండి: బీసీ కాన్ఫరెన్స్