Amaravati DesignAmaravati Design

తెలుగోడికి జరిగిన అవమానంపై, ప్రత్యేక హోదాపై తెలుగుదేశం, తన భాగస్వామి కాంగ్రెసుతో కలిసి పోరాడుతాను అంటున్నది. పాత భాగస్వామి బీజేపీపై తెలుగు దేశం పార్టీ పెట్టిన అవిశ్వాస తీర్మానాలు చూస్తుంటే ఆత్మశుద్ధి లేని యాచార యేల , చిత్తసుద్ధి లేని శివ పూజ లేలరా విశ్వదా తెలుగోడా వినుర మన చంద్ర నాటకాలు అన్నట్లు ఉన్నది. (Anjani putrudu)

ఈ పచ్చపార్టీ , బీజేపీ, కాంగ్రెసు లోక్ సభలో ఆంధ్రులపై జరిగిన అన్యాయము మీద మాట్లాడుతున్న మాటలు, నాటకాలు చూస్తుంటే ఔరా నిజమేనా అనిపిస్తున్నది, కానీ అదే సభలో ఈ నేతల చేతలు చూస్తే కాంగ్రెసు, బీజేపీ, పచ్చపార్టీల నిజరూపాలు. బయటపడున్నాయి. చంద్రబాబు మావాడే అని బీజేపీ సభ సాక్షిగా చెబుతారు. బీజేపీ ప్రజావ్యతిరేక పాలనపై పచ్చపార్టీ సభలో మాట్లాడదు. తెలుగుదేశం అవినీతి, నిరంకుశ పాలనపై బీజేపీ సభలో మాట్లాడదు. ఆపరేషన్ సక్సెస్ బట్ పేషెంట్ డెడ్ అన్నట్లు ఈ మూడు పార్టీల నాటకాలు సభలో రక్తి కట్టాయి. కానీ నరికేయబడ్డ తెలుగుతల్లి నుండి కారుతున్న కన్నీటి రక్తధారలు కారుతూనే ఉన్నాయి.

స్వార్ధ ప్రయోజనాలు కోసము తల్లిని చంపేసి బిడ్డలను పంచుకున్న నాటి రాజకీయ నిరుద్యోగుల వికృత చేష్టలతో, చట్టసభల మూసిన తలుపులవద్ద పడి చనిపోయిన తల్లి, నేటికీ ఘోషిస్తూనే ఉన్నది. అయితే చనిపోయిన తల్లి శవం మీదపడి ఈ మూడు పార్టీలు నేడు శవ రాజకీయాకాలు చేస్తూ శివపూజలు చేస్తున్నట్లు చట్టసభల సాక్షిగా నాటకాలు ఆడుతున్నాయి.

పరమేశ్వరుడు అనుగ్రహము కోసము “శివమ్” ఉండగా చేస్తున్న పూజలను శివ పూజలు అంటారు. కానీ ఇక్కడ తల్లి చనిపోయి ఐదు సంవత్సరాలు అయింది కావున ఈ పచ్చపార్టీ , కాంగ్రెస్, బీజేపీ చేసున్నది “శవ” పూజలే అవుతాయి. శవపూజలు అమ్మవారి అనుగ్రహము కోసం చేస్తారు. అయితే చితసుద్ధి లేని మన తెలుగుదేశం చేస్తున్న “శవ” పూజలు దుర్గ అమ్మవారి అనుగ్రము కోసమా? లేక కాంగ్రెసు అమ్మవారి ప్రాపకం కోసమా అన్నదే అర్ధము కావడము లేదు.

బాబు సరికొత్త మొసలి కన్నీరు?

కాంగ్రెసు పాలన బాగుండేది అని  తెలుగుదేశంఅనడము విడ్డూరం. తెలుగుదేశముపై కాంగ్రెసు చూపిస్తున్న సరికొత్త మొసలి కన్నీరు చూస్తుంటే మన చంద్రలోకాధీశుడు పెట్టిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెసు అమ్మవారి అనుగ్రహము కోసమే అని తెలుస్తున్నది. తప్ప అఖిలాంధ్రుల కష్టాలపై కాదు అనేది నిన్న పార్లమెంట్’లో జరిగిన అవిశ్వాస డ్రామాలా ద్వారా మరొక్కసారి బయటపడినది.

తెలుగు ప్రజలకు జరిగిన అన్యాయముపై చిత్తశుద్ధితో ఈ పచ్చపార్టీ, బీజేపీ, కాంగ్రెసు పార్టీలు అవిశ్వాస తీర్మానాలపై చర్చ చేసి ఉంటే తెలుగు ప్రజలకు ప్రయోజనము ఉండేది. కానీ పరస్పర రాజకీయ ప్రయోజనాలను మనస్సులో పెట్టుకొని, రాబోయే ఎన్నికల్లో పెట్టుకోబోయే ఒప్పందాలను దృష్టిలో పెట్టుకొని చేసిన చర్చలే జరిగాయి. మరొక పక్కన వైసీపీ గోడమీద పిల్లిలా తన కలల సీఎం కుర్చీకోసము నాటకాలు ఆడుతూ ఆడుతున్నది. ముద్దుల కోరికలు తీర్చుకొంటూ ఆంధ్రుల హక్కుల కోసము పోరాడడము లేదు అనేది ప్రజలకి అర్ధము అవుతున్నది.

జనసేన (Janasena) పోరాటాలు ఏవి?

ఆంధ్రుల హక్కులు, ఆత్మాభిమానంపై జనసేన లాంటి కొత్తపార్టీలు చేస్తున్న పోరాటాన్ని విష ప్రచారంతో అణచి వేస్తున్నాయి. ఈ పచ్చపార్టీ , బీజేపీ, వైసీపీ పార్టీలు బూర్జువా భావజాలముతో పార్లమెంట్’లో మొసలి కన్నీరు కారుస్తున్నవే కానీ నిజాయితీతో పోరాటం చేయడము లేదు అనేది స్పష్టము అవుతున్నది. అయితే ఆంధ్రుల హక్కుల సాధన కోసము, ఢిల్లీసభల్లో ఆంధ్రుల ఆత్మాభిమానం పునః ప్రతిష్ట చేయడం కోసము, మోసం చేస్తున్న పచ్చపార్టీ , వైసీపీ, బీజేపీ, పార్టీలను పాతి పెట్టడము కోసం జనసేనలాంటి పార్టీలు తన నిరంతరపోరాటం చేస్తూనే ఉండాలి.

స్వార్ధ ప్రయోజనాలకోసము, కేసులనుండి బయటపడడము కోసము ఈ రెండు పార్టీలు అఖిలాంధ్రుల ఆత్మాభిమానాన్ని ఢిల్లీ సుల్తానులవద్ద తాకట్టు పెట్టాయి. 

గతమెంతో ఘనకీర్తి కల ఓ తెలుగోడా! ఢిల్లీ సుల్తానుల పాదాల క్రింద నలిగిపోతున్న అఖిలాంధ్రుల ఆత్మాభిమాన చెరను విడిపించగల నిస్వార్ధ నాయకుడికి మద్దతు నిద్దాము ఎలుగెత్తి చాటలేవా?

Spread the love