దక్షిణ భారత సినీరంగ కేసరి – దాసరి బహుముఖ ప్రజ్ఞాశాలి. దర్శక రత్న, నిర్మాత, కథా రచయిత, మాటలు-పాటల రచయిత, నటుడు, జర్నలిస్ట్, ప్రముఖ పత్రికాధిపతి, మాజీ రాజ్యసభ సభ్యుడు, మాజీ కేంద్ర మంత్రి అయిన స్వర్గీయ డాక్టర్ దాసరి నారాయణ రావు (Dasari Narayana Rao) గారి వర్ధంతి (Dasari Vardhanthi) నేడు. మా గురువు దాసరి నారాయణ రావు గారి పవిత్రాత్మకి అశ్రు నివాళితో మా ఈ కన్నీటి అక్షర కుసుమాలు…
మహానుభావుడు, అణగారిన వర్గాలకు చెందిన ఒక కేసరి
తన పంచన పెరిగి, తన చుట్టూ ఉన్న పంచభూతాల నయవంచనకు గురై,
చివరకి స్వయంకృతాపరాధంతో వంగి, లొంగి, విధికి బలై, ఆ మేఘాలలో కలిసిపోయాడు.
అతడే ఆ మేఘ సందేశం సృష్టికర్త…
మా బహుదూరపు బాటసారి
నేటి రౌడీ దర్బారులను నాడే పసికట్టగలిగిన దర్శకరత్న
డాక్టర్ దాసరి నారాయణ రావు గారు…
ఎంతటి సింహం అయినా సరే,
అది అణగారిన వర్గాలకి చెందినది అయితే
కమ్మని దొడ్డల పెరట్లో పెరిగే పంచభూతాల నయవంచనకు బలి కావలిసిందేనా?
ఆలోచించండి… ఎన్నాళ్లీ మోసపోవడాలు. ఇంకానా? ఇప్పటికైనా నయ వంచనలు తెలుసుకొని సమైక్యం కాకపోతే మనుగడ సాధ్యమేనా?
Janasainulaki Shanthi Sandesam