Panthulu garu mekapillaPanthulu garu mekapilla

లోకేశా! మీ దుర్భుద్ధిని, కుట్రని, అహంకారంని, కుతంత్రాన్ని, అవకాశవాదంని, అణచివేతలను కేవలం నీ 18 సెకండ్ల వీడియోలో చూపించావు అనిపిస్తున్నది. ఎంతైనా మా కళ్ళు తెరిపించావు. మేము ధన్యులం అని మార్పు కోరుకొనే ప్రతీ ఒక్కరు నేడు అనుకొంటున్నారు. దీనికి నీ అహంకార పూరిత వీడియో కాదా? ఇక విజయం నీదే అని విర్రవీగుతున్నావు. అందుకే మా మా గుండెల్లో గొడ్డల్లోతో పొడిచావు అని మార్పు రోధిస్తున్నది. మీరు కూల్చిన మా ఆశల సౌధాల క్రింద ఛిద్ర మవుతున్న లేత మనస్సులు శోకిస్తున్నాయి. ఈ శోకాలు రేపు మీ పచ్చ పార్టీకి షాక్ ఇవ్వడం అక్షర సత్యం కాదా?

కానీ లోకేశా! మా నాయకుడు లేకపోతే ఈ రోజున నీ పార్టీ ఉండేది కాదు. బయట నీ బాబు aఉండేవాడు కాదు. ఇంటర్వ్యూలు ఇవ్వడానికి నువ్వు ఉండేవాడివి కాదు అనే అక్షర సత్యాన్ని మరిచిపోతున్నావు. కృతజ్ఞత అంటే తెలీయని వాడిలా మూర్ఖంగా మాట్లాడావు. తప్పు చేసావు లోకేశా అని ప్రతీ ఒక్కరు నేడు విలపిస్తున్నారు. దీనికి బాధ్యులు ఎవ్వరు?

అయినా లోకేశా మా నాయకుడు, మా పార్టీ లేకుండా నీ పార్టీ ఎలా విజయం సాధిస్తుంది అనుకొన్నావు. నీ బాబు ఎలా సీఎం అవుతాడు అనుకొన్నావు నాన్న లోకేశా అని అందరూ అనుకొనేలా చేసావు.

లోకేశా! నీ అహంకారపు మాటలతో పొత్తులకు తూట్లు పొడుస్తున్నావు. తెలుగుదేశం భవితపై సమాధులు కడుతున్నావేమో మరొక్కసారి ఆలోచించు.

బాబు! మీపుత్రప్రేమతో గెలుపు ద్వారా రాబోయే మార్పుని సమాధి చేస్తావో లేక పుత్రుని అహంకారపు మాటలను ఖండించి గెలుపుని మన అందరి వశం చేస్తావో బాగా ఆలోచించండి. మిత్ర ధర్మమా లేక మిత్ర ద్రోహమా? నిర్ణయం నీదే బాబు.

ఆలోచించండి… ఇది ఎవ్వరినీ ఉద్దేశించి కాదు. అలానే ఇది అక్షర సత్యం నుండి జాలువారిన కవితాక్షరాలు కాదు. మార్పు కోరుకొనే సామాన్యుని రక్త కన్నీటితో రాసిన సమకాలీన రాజకీయ వాస్తవాలు.

పవన్ కళ్యాణ్-చంద్రబాబు కీలక భేటీ అందుకేనా!

Spread the love