YCP MP Kotagiri SridharYCP MP Kotagiri Sridhar

జంగారెడ్డిగూడెం సెప్టెంబర్ 30: రానున్న ఎన్నికల్లో వైసీపీ (YCP) ఘన విజయం సాధిస్తుందని వైసీపీ ఎంపీ కోటగిరి శ్రీధర్ (YCP MP Kotagiri Sridhar) అన్నారు. పశ్చిమగోదావరి ఏలూరు జిల్లా (Eluru District) జంగారెడ్డిగూడెం మండలం ఏ పోలవరం గ్రామంలోని సచివాలయాన్ని ఎంపీ శ్రీధర్, ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా (Unnamatla Sridhar) శుక్రవారం నాడు ప్రారంభించారు. సర్పంచ్ బుద్దాల రాజు అధ్యక్షత వహించిన సభలో శ్రీధర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. రానున్న ఎన్నికల్లో వైసిపి ఘన విజయం సాధిస్తుందని మరొక్కసారి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి సింహాసనాన్ని అధిష్టించటం తద్యం అని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ అన్నారు.

మాట తప్పని మడమ తిప్పని సీఎంగా జగన్

ఎన్నికల ముందు ముఖ్యమంత్రి జగన్ (AP CM Jagan) వాగ్దానాలను చేసారు. అధికారం చేపట్టిన తరువాత ఒక్కొక్కటిగా అమలు చేస్తూ మాట తప్పని మడమ తిప్పని సీఎంగా జగన్ పేరు పొందారు. ముఖ్యంగా మహిళ సాధికారత కోసం అనేక విధాలుగా ఆర్థిక సహాయం అందిస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడేలా సీఎం జగన్ సహాయం అందిస్తున్నారని శ్రీధర్ అన్నారు. రానున్న ఎన్నికల్లో జగనన్నను ముఖ్యమంత్రిని చేయవలసిన బాధ్యత మహిళలదేనని కూడా శ్రీధర్ అన్నారు.

ఈ సంవత్సరం వర్జిన్య పొగాకు అధిక ధరలు పలకడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వమేనని శ్రీధర్ గుర్తు చేశారు. సభలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న చింతలపూడి (Chintalapudi) ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఏర్పాటు చేసిన సచివాలయ (Secretariat) వ్యవస్థ ప్రజలకు పరిపాలనను చేరువ చేసిందని అన్నారు. జగనన్న ప్రభుత్వం రైతులకు మహిళలకు విద్యార్థులకు చేతి వృత్తిదారులకు కులాలు మతాలు అనే తారతమ్య బేధాలు లేకుండా అనేక రకాలైన పథకాలు (Welfare Schemes) అందిస్తూ సంక్షేమ పాలన కొనసాగిస్తుందని అన్నారు.

గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం ద్వారా ప్రజలకు ఏ అవసరాలు ఉన్నవో తెలుస్తున్నాయి. అలానే ఆయా గ్రామాలలో ఇంకా అభివృద్ధి చేయవలసిన పనులు ఏమైనా ఉన్నాయో తమ దృష్టికి వస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా గ్రామాల అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని ఎమ్మెల్యే అన్నారు. చింతలపూడి నియోజకవర్గంలో జగనన్న సహాయం ద్వారా గ్రామాలన్నిటిని అభివృద్ధి చేస్తున్నామని ప్రతి కుటుంబానికి ప్రభుత్వం చేయూతనిస్తూ ఆసరాగా నిలబడిందని ఎలీజా తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొదమ జ్యోతి జడ్పిటిసి పోల్నాటి బాబ్జి, మండల వైసీపీ అధ్యక్షుడు వామిశెట్టి హరిబాబు, వైస్ ఎంపీపీ బుజ్జియా, చింతలపూడి మార్కెట్ యార్డ్ మాజీ అధ్యక్షుడు మేడవరపు అశోక్ బాబు జంగారెడ్డిగూడెం మాజీ సర్పంచ్ మండవల్లి సోంబాబు వైసీపీ నాయకులు మేడవరపు విద్యాసాగర్, కామవరపుకోట వైసీపీ నాయకులు మేడూరి రంగబాబు, సత్రం లక్ష్మణరావు, కనికళ్ళ ప్రసాద్ బాబు, వైసీపీ మహిళా నాయకురాలు వందనపు సాయిబాల పద్మ, తాడువాయి ఎంపీటీసీ పొడపాటి నందిని, జీలుగుమిల్లి మండల వైసీపీ నాయకులు కొల్లూరి రాంబాబు కేతిరెడ్డి రాఘవరెడ్డి తాడువాయి సర్పంచ్ యరమాల సత్యవతి, వీరంకి సత్యనారాయణ మూర్తి, ఏ పోలవరం మాజీ సర్పంచ్ బుద్దాల సత్యనారాయణ, వివిధ పంచాయతీల సర్పంచులు ఉప సర్పంచ్లు ఎంపీటీసీలు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

కూల్చిన బీపీ మండల్ దిమ్మెను తక్షణమే పునర్నిర్మించాలి: జనసేన

Spread the love