Tuni IncidentTuni Incident

కాపు ఉద్యమ సారం (Kapu agitations) అంటే కమ్మని ద్వేషం (Kammani dwesham). దొడ్డలపై ప్రేమ (Doddalapai prema). ఇదేనా? ఇటువంటి కాపు ఉద్యమాల వల్లనే కాపులు (Kapulu) అధికారానికి (Rajyadhikaram) దూరం అయ్యారు అని Akshara Satyam చెబుతూ వస్తున్నది. ఈ Akshara Satyam అభిప్రాయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. అయనకు చంద్రబాబు (Chandra babu) అంటే ఉన్న గుడ్డి ద్వేషం ఉంది. ఆ ద్వేషంతో అంతకన్నా భయంకరమైన శత్రువుని గుర్తించలేక పోతున్నారు. అతని వ్యక్తిగత ద్వేషంతో తీసికొన్న అనాలోచిన నిర్ణయాలతో అయన నేడు పూర్తిగా జాతికి దూరమైనారు.

ఇక్కడ ఒక్క విషయం నేను స్పష్టంగా చెబుతాను. నేను కూడా చంద్రబాబు అంటే పరమ ద్వేషిని. అయితే ఒకే ఒక్క విషయంలో అతను కాపులకు ఒక మంచి పని చేసాడు. అది కాపు కార్పోరేషన్ (Kapu Corporation) ఏర్పాటు ద్వారా పేద, మథ్య తరగతి కాపు విద్యార్థులు, నిరుద్యోగులకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పనకు కావాల్సిన నిథులు ఇచ్చాడు. నిజంగా దానిని సక్రమంగా వినియోగించుకుంటే, చాలామంది జాతి జనులు విథ్యాదికులు మరియు స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చు కునేవారు.

కాపులకు కావాల్సింది రిజర్వేషన్లు కాదు?

నేను ఒక విషయం నిక్కచ్చిగా చెబుతాను. కాపులకు కావాల్సింది రిజర్వేషన్లు (Kapu Reservations) కాదు, కాదు, కాదు. రిజర్వేషన్లు వలన మన వర్గం సాథించే ఘనకార్యం ఏమీ లేదు. మరియు పీకేది కూడా ఏమీ లేదు. అది కేవలం కాపు రాజకీయ నాయకులు (Kapu Leaders), బిసీ నియోజకవర్గాలలో పోటీ చేయటం కోసం మాత్రమే పనికివస్తుంది. దాని వలన మరోక బలమైన బీసీ వర్గాలకు మనం సామాజికంగా దూరం అవుతున్నాము. ఇది ఏంత మాత్రం వాంఛనీయం కాదు. కారణం కాపులకు అంతిమంగా కావాల్సింది రాజకీయ సాథికారికత. దానిని సాథించాలంటే బీసీ వర్గాలతో అత్యంత సఖ్యత అవసరం. వారి సహకారంతో మాత్రమే మనం అథికారం దిశగా అడుగులు వేయగలం.

ఇక్కడే కాపుకులంలో (Kapu Caste) ఉన్న పెద్దాయన (కాపు ఉద్యమాల పేరుతో) రాజకీయంగా, సామాజికంగా, వ్యూహత్మకంగా తప్పటడుగు వేశాడు. తన గుడ్డి ద్వేషంతో, చంద్రబాబుని దెబ్బ తీయాలనే దొడ్డల కుట్రలో భాగస్వామి అయి ఉండవచ్చు. కాపు రిజర్వేషన్లు సాథన పేరుతో ఉద్యమం లేవదీసారు. కాపు యువతను తప్పు దారి పట్టించారు. తుని సంఘటనలో పెద్దాయన ఏకపక్షంగా ప్రవర్తించడం కేవలం నాటి ప్రతిపక్ష పార్టీకి మాత్రమే కలిసి వచ్చేలా చేశాడు అనే ఆరోపణలు ఉన్నాయి. కాపు పెద్దలు చిరంజీవి, దాసరి లాంటి వారు పరామర్శకు వస్తామంటే, వారిని కలవకుండానే దీక్ష విరమణ చేసి, పెద్దాయన వారిని అవమానం పాలు చేశారు.

అసలు కాపు జాతికి కావాల్సిన నిజమైన అవసరాలను, ఉండాల్సిన సంబంధ భాంథవ్యాలను పెడచెవిని పెట్టారు. తన గుడ్డి కమ్మని ద్వేషంతో నాటి ప్రతిపక్ష నాయకుడికి అనుకూలంగా ఉద్యమాన్ని మలచాడు అనే ఆరోపణలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. కాపులను పెనం మీద నుంచి పోయ్యి లోకి తోశాడు అని కాపు యువత రగిలి పోతున్నారు.

కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనాయి?

జగన్ రెడ్డి ప్రభుత్వం (Jagan reddy Government) కాపులకు (Kapu) సంవత్సరానికి 1,000 కోట్ల ఇస్తానన్నారు. ఆ కాపు కార్పోరేషన్ నిథుల కోసం పెద్దాయన పోరాటం చేయటం లేదు. నిజంగా అటువంటి నిథులు కాపు యువతకు (Kapu Youth) వరుసగా 10 సంవత్సరాల కాలం లభిస్తే బాగుండేది. అప్పుడు ఖచ్చితంగా ఒక తరం యువత అభివృద్ధి చెంది ఉండేవారు. అటువంటప్పుడు వారు మరలా జాతి అభివృద్ధికి స్వయంగా ఉతం ఇచ్చి ఉండేవారు.

రిజర్వేషన్లు డిమాండ్ చేయకుండా, బీసీలను కలుపుకోని రాజ్యాథికారానికి (Rajyadhikaram) అడుగులు వేస్తే, ఖచ్చితంగా ఈ రెండు కుటుంబ పార్టీల నుండి రాజ్యాధికారం అణగారిన వర్గాల చేతుల్లోకి వచ్చి ఉండేది.

పెద్దాయన (Pedhayana)తప్పటడుగు?

ఏందుకో ముద్రగడ (Mudragada) ఈ విషయంలో జాతికి తెలిసో, తెలియకో ద్రోహం చేస్తూన్నాడు అనే భావన ప్రజల్లో పెరుగుతున్నది. అయన అమ్ముడుబోయాడు అని అనలేను. ఆయన నిజాయితీ పరుడే. కానీ గుడ్డి ద్వేషంతో జాతిని నిర్వీర్యం చేశారు. పైగా అతనికి మెగా కుటుంబం అంటే ఏందుకో ద్వేషం ఉన్నది. నాడు ప్రజారాజ్యం పార్టీని ఆదరించలేదు, నేడు జనసేన పార్టీని కూడా గుర్తించటం లేదు. కనీసం గౌరవించటం లేదు. అతనికి తోటి కాపులు రాజకీయ ఎదుగుదల అంటే పడదా అనే అనుమానం మాలాంటి వారికి కలుగుతున్నది.

పెద్దాయన మౌనం దేనికి సంకేతం?

రాజశేఖరరెడ్డి (Rajashekar Reddy), జగన్ రెడ్డి (Jagan Reddy) పూర్తిగా కాపు ద్వేషులా కాదా అనే విషయాన్ని చెప్పకుండా పెద్దాయన కావాలని విస్మరించడం ఆశ్చర్యకరం. రంగా హత్యలో పరోక్ష పాత్ర దారులు ఎవరు? అనేది కూడా పెద్దాయన చెప్పి ఉంటే బాగుండేది. చిరంజీవి (Chiranjeevi) పార్టీ పతనంలో కూడా రాజశేఖరరెడ్డి, జగన్ రెడ్డి పాత్ర మరువరానిది అని అనుమానాలు ఉన్నాయి. వీటిలో చంద్రబాబు పాత్ర ఇక చర్వితచరణమే. ఆ రెండు పార్టీల అధినేతలు పవన్ కళ్యాణ్ పైన ఒక పద్దతిలో దాడులు చేపిస్తున్నారు. అయినా పెద్దాయన ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు. కాపు ఉద్యమ నాయకుడిగా, కుల నాయకుడిగా ఖండించాల్సిన బాధ్యత ఆయనకీ ఉన్నది. కానీ ఆయన నోరు ఇప్పడం లేదు. ఇవన్నీ జాతి యావత్తు నిశ్శబ్దంగా, నిశితంగా గమనిస్తూనే ఉన్నది.

మంజునాథ కమీషన్ (Manjunath Commission) విషయంలో, దాని రిపోర్టు విషయంలో నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి. నిజంగా ఇంకా చాలా చెప్పాలని ఉంది. జాతి (Kapu jathi) ప్రయోజనాల దృష్ట్యా అవన్నీ ఇక్కడ చెప్పలేను. కాకపోతే కాపు జాతికి, ముఖ్యంగా కాపు యువత (Kapu Yuvatha) ఎదుగుదలకు, అభివృద్ధికి మన పెద్దాయన ఉద్యమ తీరు పూర్తి వ్యతిరేకంగా ఉన్నదేమో ఆలోచించండి.

— Shanthi Prasad Singaluri, Advocate, Janasena